పశుపోషణ

Animal Disease: మందే లేని మాయ రోగానికి నివారణే అనివార్యం

0
Animal Disease

Animal Disease: చికిత్స లేని గాలికుంటూ రోగం(foot & mouth disease) ప్రాణాంతకమైనది. ఈ వ్యాధి సాధారణంగా పందులు, పశువులు, మేకలు మరియు గొర్రెలను ప్రభావితం చేస్తుంది. ఈ రోగం, పూర్వం మహమ్మారి వలే అవతరించింది.ఈ వైరస్ సోకడం వలన జ్వరం కొన్ని రోజుల పాటు కొనసాగుతుంది, తర్వాత నోటి లోపల, పాదాలపై బొబ్బలు వస్తాయి.కుంటితనం, అధిక లాలాజలం, ఆకలి లేకపోవడం, శరీర స్థితిని కోల్పోవడం మరియు అప్పుడప్పుడు మాస్టిటిస్, అబార్షన్‌కు కారణమవుతాయి.చివరకు జంతువు బాధాకరంగా చనిపోతుంది. ఈ వ్యాధికి  నియంత్రణ లేనందున నివారణ చర్యలు చేపట్టడం అనివార్యం.

Animal Disease

  • వ్యవసాయ జంతువులకు రెగ్యులర్ టీకాలు వేయించడం ద్వారా గాలికుంటు వ్యాధి అదుపులో పెట్టవచ్చు.3 నెలల వయస్సులో మొదటి టీకా, 30 రోజుల తర్వాత రెండవ డోస్, ఆపై 6 నెలల వ్యవధిలో మరోసారి వేయడం మంచిది.
  • ఒకే  ప్రాంతానికి చెందిన జంతువులలో  సామూహిక  టీకాలు వేయడం వలన హార్డ్ ఇమ్మ్యూనిటిని సాధించవచ్చు.
  • వ్యాధి వ్యాప్తి నియంత్రణ కోసం రింగ్ టీకాను, వ్యాధి రహిత ప్రాంతాలను రక్షించడానికి సరిహద్దు టీకాలు వేయవచ్చు.

Animal Disease

  • టీకాలు వేసిన జంతువులను మాత్రమే  15-21 రోజుల తర్వాత మాత్రమే బయటి  నుండి గ్రామంలోకి తీసుకురావాలి.
  • వ్యాధి ప్రబలుతున్న ప్రాంతాల నుండి జంతువులను కొనుగోలు చేయవద్దు.
  • వ్యాధి వ్యాప్తి చెందిన ఆరు నెలల వరకు కొత్త జంతువులను కొనుగోలు చేయకూడదు.
  • టీకాలు వేయని జంతువులను పశువుల సంతలకు అనుమతించకూడదు.
  • కొత్తగా కొనుగోలు చేసిన జంతువుల కోసం కఠినమైన నిర్బంధ చర్యలు పాటించాలి.
  • గ్రామం/పొలం ప్రవేశద్వారం వద్ద ఫుట్ బాత్ లేదా ట్రక్ బాత్ చేయవచ్చు.
  • FMD ఆరు నెలలు లేదా అంతకంటే ఎక్కువ కాలం పాటు నమోదు చేయబడని ప్రదేశం నుండి ఎల్లప్పుడూ మేతను కొనుగోలు చేయడానికి / సేకరించండి.
Leave Your Comments

Crop Insurance: పండ్ల పంటలకు రూ.17 కోట్ల ప్రీమియం

Previous article

Cow Urine: వ్యవసాయంలో గోమూత్రాన్ని శాస్త్రీయంగా ఉపయోగించేందుకు కార్యాచరణ

Next article

You may also like