Mountain Goats: మనం రోజు బయటకు వెళ్లినప్పుడు రకరకాల గొర్రెలను, మేకలను చూస్తుంటాము. అంతేకాకుండా పట్టణాల్లో అంతగా కనిపించకపోయినా గ్రామాల్లో మాత్రం దినచర్యగా అందరికి కనిపిస్తాయి. కానీ ఇప్పుడు నేను చెప్పే మేక బాహుబలి మేక మాత్రం కాదు. మరీ ఏది అనుకుంటున్నారు. మౌంటన్ గోట్ అంటే పర్వత మేక ఎప్పడైనా చూసారా, దాని గురించి విన్నారా. కానీ మనం ఎప్పుడు చూసి ఉండరు. ఎందుకంటే అది మనదేశంలో కనిపించదు కాబట్టి. ఇది ఎక్కువగా పశ్చిమ ఉత్తర అమెరికాలో ఉంటుంది. అది కూడా రాళ్ళు ఎక్కువగా ఉంటే కొండ ప్రాంతాల్లో మాత్రమే ఉంటుంది. అలాంటి ప్రదేశాల్లో మాత్రమే నివసిస్తుంది. వాస్తవానికి ఇది ఒక మేక జాతి జీవి కాదు. బాహుబలి లాంటిది. వీటిలో ఆడమేకలు కంటే మగ మేకలకే ఎక్కువ బలం ఉంటుంది. అంతేకాకుండా వీటికి కొమ్ములు పెద్దవిగా ఉంటాయి.
Also Read: International Tiger Day 2023: నేడు అంతర్జాతీయ పులుల దినోత్సవం.. వీటి గురించి కొన్ని నిజాలు!
బొద్దుగా, ముద్దుగా
పర్వత మేకలు ఎక్కువగా రాళ్ళు ఉన్న ప్రదేశాల్లోనే ఉంటాయి. కొండల్లో ఉంటాయి. ఆడవారికి నానీ అని, మగవారిని బిల్లీ అని అంటారు. ఇవి చూడటానికి చాలా బొద్దుగా, ముద్దుగా ఉంటాయి. ఎటువంటి గాయాలు కూడా వాటికి తగలవు. ఎందుకంటే వాటి శరీరం మీద ఉన్న ఉన్నే వాటిని కాపాడుతాయి. ఇవి పచ్చిగడ్డి, చెట్ల కొమ్మలు, పండ్లు, కూరగాయలను ఆహరంగా తీసుకుంటారు. వాటి బరువు 45నుంచి 140 కిలోల వరకు ఉంటుంది. వీటి సంఖ్య సుమారు 45వేలనుంచి 65 వేల మధ్యలో ఉంది. ఇవి కేవలం 15 సంవత్సరాలు మాత్రమే బ్రతుకుతాయి. వీటిని జంతు ప్రదర్శన శాలల్లో కూడా ఉంచుతారు.
Also Read: PM Kisan Seva Kendras in Telangana: తెలంగాణలో నాలుగు వేల ప్రధాని కిసాన్ సేవా కేంద్రాలు.!