Cattle Rearing: పశువులు పెంచడంలో రైతులకి మంచి లాభాలు వస్తున్నాయి. ప్రస్తుతం నాణ్యమైన పాలు ఎక్కడ దొరకడం లేదు. నాణ్యమైన పాలు అమ్మే రైతులకి మంచి లాభాలు వస్తున్నాయి. ఈ ఆలోచన ప్రకారం చిత్తూరు జిల్లా, మంగళంపేట్ రైతు నూరి గణపతి గారు 14 ఆవులతో ఒక షెడ్ ప్రారంభించారు. పొలం పనులతో పాటు పశువులని పెంచుతున్నారు. కానీ గత రెండు సంవత్సరాల నుంచి పశువుల పై ఎక్కువ శ్రద్ధ తీసుకోవడం వల్ల మంచి లాభాలు వస్తున్నాయి.
మొత్తం 14 ఆవులు ఉన్నాయి. అందులో ప్రస్తుతం 6 ఆవులు మాత్రమే పాలు ఇస్తున్నాయి. ఉదయం 6 లీటర్ల పాలు, సాయంత్రం 6 లీటర్ల పాలు ఇస్తున్నాయి. ఈ పాలు డైరీ కేంద్రంలో ఇస్తారు. పాలల్లో ఉండే కొవ్వు బట్టి ఒక లీటర్ పాలు 35 నుంచి 40 రూపాయలు అమ్ముతున్నారు. పాలు అమ్మడం ద్వారా ప్రతి రోజు 2000 రూపాయలు ఆదాయం చేసుకోవచ్చు.
Also Read: Pulses Adulteration Test: మార్కెట్లో కల్తీ పప్పు ఎలా తయారు చేస్తున్నారు.?
పశువులు పాలు బాగా ఇవ్వడానికి పశుగ్రాసం రైతు పొలంలోనే పండిస్తున్నారు. నాలుగు ఎకరాల్లో సూపర్ నిప్పెర్, మొక్కజొన్న, పశుగ్రాసం పండిస్తున్నారు. శైలెజ్ కూడా ఈ రైతు తన సొంతగా తయారు చేస్తున్నారు. శైలెజ్ పశువులకి ఇవ్వడం ద్వారా పాలల్లో కొవ్వు శాతం పెరుగుతుంది.
ప్రతి రోజు పశువులను చూసుకోవడానికి 300 రూపాయల వరకు ఖర్చు వస్తుంది. ఈ పశువులకు ప్రతి రోజు మూడు సార్లు గడ్డి, ధాన ఇవ్వాలి. ప్రతి రోజు సమయానికి నీటిని, ధాన ఇస్తే పశువులు మంచిగా పాలు ఇస్తాయి. ఈ పశువుల నుంచి ప్రతి నెల 50 వేల వరకు ఆదాయం సంపాదించుకోవచ్చు. పాలని డైరీకి కాకుండా దగ్గరలో ఉన్న నగరాలకు అమ్ముతే ఇంకా మంచి ఆదాయం సంపాదించుకోవచ్చు.
Also Read: Poultry Farms: వర్షాకాలంలో కోళ్ల ఫారాల్లో తీసుకోవలసిన జాగ్రత్తలు.!