పశుపోషణ

డీజే దెబ్బకు 63 కోళ్లు మృతి !

0
Chickens die of heart attack

Chickens die of heart attack ఉన్నత చదువులు చదివి ఉద్యోగం రాకపోవడంతో ప్రత్యామ్నాయ దారులను వెతుక్కుంటున్నారు నేటి యువత. కొందరు వ్యవసాయం వైపు అడుగులు వేస్తుంటే మరికొందరు కోళ్ల పెంపకంపై మక్కువ చూపిస్తున్నారు. ఒడిశా బాలాసోర్ లో నివాసం ఉంటున్న రంజిత్ ఇంజినీరింగ్ పూర్తి చేశాడు. ఉపాథి కోసం ఎన్నో కంపెనీల మెట్లు ఎక్కాడు కానీ ఉద్యగం రాలేదు. దీంతో ప్రత్యామ్నాయంగా కోళ్ల పెంపకం పై ద్రుష్టి పెట్టాడు. అనుకున్నట్లే 2 లక్షల రూపాయలు లోన్ తీసుకుని కోళ్ల పామ్ పెట్టుకున్నాడు. మంచి ఆదాయం, సమాజంలో మంచి గౌరవంతో ఎంతో సంతోషంగా ఉంటున్న రంజిత్ కు డీజే సౌండ్ రూపంలో కోలుకోలేని దెబ్బ తగిలింది.

Chickens die of heart attack

Odisha రంజిత ఇంటి పరిసర ప్రాంతంలో ఇటీవల ఓ పెళ్లి వేడుక జరిగింది. పెళ్లి వేడుకలో డీజే సౌండ్ తో అందరూ నృత్యాలు చేస్తూ హోరెత్తిస్తున్నారు. కానీ పక్కనే ఉన్న కోళ్లపై డీజే సౌండ్ తీవ్ర ప్రభావం చూపించింది. డీజే సౌండ్ ని ఆ కోళ్లు తట్టుకోలేకపోయ్యాయి. కొంతసేపటికి ఆ కోళ్ళన్నీ గిలగిలా కొట్టుకుంటూ నేలకొరిగాయి. కొంతసేపటికి హార్ట్ ఎటాక్ కు గురైన ఆ కోళ్లు కొద్దిసేపట్లోనే మృత్యువాతపడ్డాయి. దాదాపుగా 63 కోళ్లు చనిపోయాయి అని వాపోతున్నాడు రంజిత్. సౌండ్ తగ్గించమని ఎంత మొరపెట్టుకున్నా.. వారు సౌండ్ తగ్గించలేదని చెప్తున్నాడు రంజిత్. కాగా మరుసటి రోజు వెటర్నరీ డాక్టర్ ని సంప్రదించగా.. డీజే సౌండ్ ని తట్టుకోలేకపోయాయి అని, అందువల్ల హార్ట్ అటాక్ వచ్చి చనిపోయాయి అని డాక్టర్ చెప్పాడట. అయితే తనకు నష్టపరిహారం ఇవ్వాలని పెండ్లి జరిగిన ఇంటి యజమానికి అడిగానని, వారు స్పందించలేదన్నాడు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు రంజిత్‌ వెల్లడించాడు.

Leave Your Comments

వరి కొనుగోలుపై 26న మళ్లీ కలుద్దాద్దాం: కేంద్రం

Previous article

ఉచిత రేషన్ పథకం పొడిగింపు…

Next article

You may also like