పశుపోషణ

Care of Kids in Sheep Farming: గొర్రె పిల్లల సంరక్షణ -మెళకువలు

0
Care of Kids in Sheep Farming
Care of Kids in Sheep Farming

Care of Kids in Sheep Farming: గొర్రె పిల్లలు ,మేక పిల్లల్ని మరణాల నుండి కాపాడుకోవడం ఎలా?

పిల్లలు పుట్టగానే: పిల్లలు జన్మించగానే వాటి ముక్కు రంద్రాల్ని పొడి గుడ్డతో తుడిచి , శ్వాస సరిగ్గా ఆడే వీలు చూడాలి .

Sheep Kids

Sheep Kids

  • పిల్లల బొడ్డును 2-3 అంగుళాలు వదలి దారంతో కట్టి ,కొత్త బ్లేడ్ తొ కత్తిరించి , అయోడిన్ 2-3 రోజుల పాటు అద్దాలి . ఇలా చేయటం వల్ల దనుర్వాతం , బొడ్డువాపు సమస్యలు రాకుండా ఉంటాయి.
  • ఆరోగ్యమైన పిల్లలు ఈనిన 10 నిమిషాల్లో నిలబడి , పావు గంట లో పాలు తాగుతాయి. తాగని పిల్లల్ని గుర్తించి, పాలు తాగేందుకు సహకరించాలి. తల్లి పొదుగు బావుందో లేదో పరిశీలించాలి.
  • పిల్లల్ని తల్లి నాకే విదానాన్ని గమనించాలి.
  • పిల్లలు పుట్టిన వెంటనే ,తల్లి పొదుగు శుబ్రం చేసి ,పుష్కలంగా జున్ను పాలు తాగించాలి . ఇలా చేస్తే పిల్లలకు యాంటిబడిలు అంది ,వ్యాది నిరోధక శక్తి కలిగి ఉంటాయి .
  • ఒకవేళ తల్లి ఏ చేతనైన చనిపోతే ,పిల్లకు ఆవు పాలు పట్టించాలి.
  • పుట్టగానే ధనుర్వాతం రాకుండా టేటనాస్ టాక్సాయిడు ఇంజక్షన్ వేయించాలి .
  • 3,4,5 రోజులలో యాంటిబయాటిక్ పౌడర్ ను నీళ్ళలో కలిపి తాగించాలి .
  • 15 వ రోజు నట్టల నిర్మూలనకు మొదటిసారి నట్టల నివారణ మందు తాగించాలి.

Also Read: ఆడ గొర్రెల ఎంపిక విషయం లో తీయాల్సిన జాగ్రత్తలు

ఆహార విషయంలో :

  • పాకల్లో ఖనిజ లవణ ఇటుకలను వేలాడదిస్తే వాటిని నాకుతూ నేలను నాకకుండా మట్టి తినకుండా ఉంటాయి .వాటికీ త్రాగు నీరూ అందుబాటులో ఉండాలి.
Care of Kids in Sheep Farming

Care of Kids in Sheep Farming

  • 2-3 వయసు నుండి పిల్లలకు పప్పు జాతి గడ్డి , వేప కొమ్మలు కోరికేందుకు అందుబాటులో ఉంచాలి.తద్వారా పొట్ట త్వరగా వృద్ది చెందుతుంది.
  • మూడుమాసాల వయసు పిల్లలో మేత వినియోగం  బావుండి, పెరుగుదల రేట్ అధికంగా ఉంటుంది .కాబట్టి ఉదయం లేదా సాయంత్రం ఉలవలు /శనగ/కంది /మినప/పెసర పోట్టుగాని,ప్రత్యేకంగా తయారుచేసిన పిల్లల దాణ గాని 100 – 200 గ్రా.ఇవ్వాలి.

Also Read: గొర్రెల రవాణా సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు

Leave Your Comments

Safflower Cultivation: కుసుమ సాగు యాజమాన్య పద్దతులు

Previous article

Rose Cultivation: పాలీహౌస్ లలో సాంకేతిక పద్దతిలో గులాబీ సాగు

Next article

You may also like