పశుపోషణ

Bird flu in Chickens: కోళ్ళలో బర్డ్ ఫ్లూ వ్యాధి ఎలా వస్తుంది.!

0
Bird flu
Bird flu

Bird flu in Chickens: ఎవియన్ ఇన్ఫ్లూయంజా కోళ్ళలో వచ్చు అత్యంత ప్రమాదకరమైన వ్యాధి. ఈ వ్యాధి ప్రమాదకరం కాని స్థితి నుండి, చాలా ప్రమాదకర స్థితి వరకు కోళ్ళలో వ్యాపిస్తుంటుంది. కొన్ని సందర్భములలో ఈ వ్యాధిలో కోర్సు ఎటువంటి వ్యాధి లక్షణాలు చూపించకుండానే మరణిస్తుంటాయి. ఈ వ్యాధిని 100 సంవత్సరాల క్రితమే ఇటలీ దేశంలో కనుగొనుట జరిగిoది. తరువాత ఈ వ్యాధి ప్రపంచంలోని అన్ని దేశాల్లో వ్యాపించుట గుర్తించుట జరిగింది.ఈ వ్యాధి అన్ని రకముల పెంపుడు పక్షులు, అడవి పక్షులు, నీటి పక్షులు, వలస పక్షులలో వ్యాపిస్తుంటుంది.

ప్రపంచంలోని చాలా దేశాల్లో ఈ వ్యాధి ఒక ఔచ్ బ్రేక్ లాగా వచ్చి, అనేక లక్షల కోళ్ళను వధించుట జరిగిoది. భారతదేశంలో మహారాష్ట్ర మరియు గుజరాత్ సరిహద్దులలో గల నవాపూర్ మరియు జలగావ్ జిల్లాలో H5N1 వైరస్ వలన 2006వ సంవత్సరంలో మొదటి ఔట్ బ్రేక్ వచ్చింది. ప్రపంచంలో 1959 వ సంవత్సరంలో స్కాట్లాండ్ దేశంలో మొట్టమొదటి ఔట్ నమోదు చేయగా, మన దేశంలో 2012 డిసెంబర్ మాసంలో బెంగుళూరులోని సెంట్రల్ పార్టీ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్లోని కోళ్ళలో గుర్తించుట జరిగిoది. ఈ వ్యాధి ఔట్ బ్రేక్ వచ్చిన ప్రతిసారి, ఈ వ్యాధి వ్యాప్తిని అరికట్టేబందుకు, ఆ ప్రాంతంలో లక్షల కోళ్ళను సముహంగా హతమార్చి పూడ్చి పెట్టుట జరుగుతుంటుంది.

ఈ వ్యాధి కోళ్ళతో పాటు మనుషులకు కూడా సోకే గుణం ఉండడంతో దీనికి చాలా ప్రాధాన్యత ఏర్పడిoది. అందుకే ఈ వ్యాధిని ప్రపంచ ఆరోగ్య సంస్థ వారు అత్యంత ప్రధాన్యత జాబితాలో చేర్చుట జరిగిoది. ఈ వ్యాధి కోళ్ళ ఫారాల రైతులకే కాకుండా, ప్రభుత్వం కూడా చాలా ఆర్ధిక నష్టంను కలిగిస్తుంది.

Also Read: Broiler Chickens: మాంసపు కోళ్ళ పెంపకంలో ఈ విషయాలు గమనించండి.!

Bird flu in Chickens

Bird flu in Chickens

ఈ వ్యాధి ఆర్తోమిక్సో విరిడీ కుటుంబానికి చెందిన, ఇన్ ఫ్లూయంజా వైరస్ వలన – కలుగుతుంది. ఈ వైరస్ చుట్టూ కవచం ఉండి, ఫిలమెంటస్ లేదా స్పెరికల్ ఆకారములో ఉంటుంది. దీని చుట్టు హిమాగ్లూటినిన్ (H) మరియు న్యూరామినిజ్ (N) అను ప్రాటిన్లు కలవు. వీటి ఆధారంగా ఈ వైరస్ను H5N1, H7N2, H1N7, H7N3, H13N6, H5N9, H11N6, H3N8, H9N2, H9N2, H5N2, H4N8, H10N7, H2N2, H8N4, H14N4, H12N5 అను రకాలుగా విభజించుట జరిగిoది.

ఇప్పటి వరకు కోళ్ళలో ఎక్కువగా H5 మరియు H7 అను సబ్జెప్ గల వైరస్ వలనే ఔట్ బ్రేక్లు కలిగింది. ఈ వైరస్ రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి అంత ప్రమాదకరం కాని Low Pathogenic Avian Influenza (LPAI) మరియు అత్యంత ప్రమాదకరమైన High Pathogenic Avian influenza (HPAI) స్థితి. ఈ స్థితిలో ఉండు వైరస్ కోళ్ళకు సోకినట్లైతే 100 మోర్టాలిటీ నమోదవుతుంది.

అన్ని రకాల పెంపుడు, అడవి, నీటి మరియు వలస పక్షులు ఈ వ్యాధి బారిన పడుతుంటాయి. ఈ వ్యాధి కారక వైరస్ మనుషులకు వచ్చు హ్యుమన్ ఫ్లూ, పందులలో కలుగు స్వైన్ ఫ్లూ, గుర్రాలలో కలుగు హార్స్ ఫ్లూ మరియు కుక్కలలో వచ్చు డాగ్ ఫ్లూ వ్యాధి వైరస్ తో సంబంధం కలిగి ఉంటుంది.

వ్యాధి వచ్చు మార్గము: నీటి కోళ్ళు, అడవి కోళ్ళు మరియు విదేశీ పక్షులలో ఈ వ్యాధి కారకము సహజంగా ఉంటుంది. వీటి నుండి ఈ వ్యాధి కమర్షియల్ గా పెంచే కోళ్ళ ఫారాలకు వ్యాపిస్తుంటుంది. పందులు కూడా ఈ వ్యాధికి క్యారియర్ హోస్ట్ గా వ్యవహరిస్తుంటాయి. వ్యాధి గ్రస్థ పక్షులు లేదా కోళ్ళతో డైరెక్ట్ వలన, కలుషితమైన ఫారమ్ పరికరాలు, వాహానాలు మరియు మనుషుల ద్వారా ఈ వ్యాధి ఆరోగ్యంగా ఉండు పక్షులకు లేదా కోళ్ళకు వ్యాపిస్తుంటుంది.

అత్యంత ప్రమాదకరమైన H5N1 వైరస్ ఒక్కొక్కసారి పక్షులు లేదా కోళ్ళతో పాటు మనుషులు, పందులు, గుర్రాలు మరియు కుక్కలలో కూడా వ్యాప్తి చెందు గుణం కలిగి ఉంటుంది. వ్యాధి కారక వైరస్ ఆరోగ్యంగా ఉండు కోళ్ళలోకి ప్రవేశించిన తరువాత వాటి శ్వాసకోశ వ్యవస్థ, కంటిలోని కంటెకైవా మరియు జీర్ణాశయ వ్యవస్థ మీద ప్రభావం చూపిస్తుంది, ఈ వ్యవస్థలోని అవయవాలలో శోధoతో పాటు, కణాల విచ్ఛిన్నం జరుగుట వలన కోళ్ళు అధిక సంఖ్యలో మరణిస్తుంటాయి. గ్రుడ్లు పెట్టె కోళ్ళలో ప్రత్యుత్పత్తి అవయవాలు కూడా దెబ్బతింటాయి.

Also Read: Chicken Breeds for Meat and Eggs: అధిక గ్రుడ్లు మరియు మాంసం ఇచ్చే లేయర్, బ్రాయిలర్ కోళ్ళ రకాలు.!

Leave Your Comments

Paddy Gall Midge: వరిలో ఉల్లి కోడును ఎలా గుర్తించాలి.!

Previous article

Biogas: బయోగ్యాస్ లేదా గోబర్ గ్యాస్ గురించి ఈ విషయాలు తెలుసుకోండి.!

Next article

You may also like