Raising Rabbits at Home: నేటి తరుణంలో నిరుద్యోగులు పట్టభద్రులు ఉద్యోగ వేటలో నీరసించి పోయి తమ కాళ్ళపై తాము నిలబడేలా సొంత వ్యాపారంకు మొగ్గుచూపుతున్నారు. వ్యాపారంలో నూతన పంతాను ఎంచుకున్న వాళ్లు ఎంతోమంది ఇందులో ప్రధానంగా తక్కువ పెట్టుబడితో కుందేళ్లను పెంచి అత్యధిక ఆదాయాన్ని సంపాదిస్తున్నారు. యువ రైతులు చేపడుతున్న ఈ వ్యాపారం తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలను అర్జించేలా ఉంది.
కుందేళ్ల పెంపకానికి ప్రత్యేక శ్రద్ధ
పెట్టుబడి తక్కువగానే ఉన్న కుందేళ్ళ పెంపకంలో మాత్రం ప్రత్యేక శ్రద్ధ చూపాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కుందేళ్ల కు ఇచ్చే ఆహారం దగ్గర నుంచి వాటిని వ్యాపారం చేసేంతవరకు ప్రతి విషయంలోనూ ప్రత్యేక చర్యలు తీసుకుంటూ ఉండాల్సిందే. ముఖ్యంగా అప్పుడే పుట్టిన కుందేలు నుంచి కొన్ని రోజులు వయస్సు వచ్చే వరకు వాటిని జాగ్రత్తగా చూసుకోవాలి. అలాగే వాటికి ఇచ్చే ఫీడ్ ఆహారం కూడా వ్యాపారులు సొంతంగా తయారు చేసుకుంటే ఖర్చు కూడా తక్కువగా ఉంటుంది. కుందేళ్ళకు ఇచ్చే ఆహారంలో ప్రధానంగా గడ్డి, గోధుమ పొట్టు, జొన్న, మొక్కజొన్న పిండి, పల్లీల చెక్క, తవుడు, సాల్ట్ లతో కూడిన ప్రత్యేక దాణను ఏర్పాటు చేసుకొని కుందేళ్లకు ఆహారంగా ఇచ్చినట్లయితే త్వరితగతిన కుందేలు వెయిట్ పెరిగి ఆరోగ్యంగా ఉంటాయి. ఈ దాణాలో ఎక్కువగా ప్రోటీన్ ఉండటం వల్ల కుందేళ్లు ఆరోగ్యంగా పెరుగుతాయి.
Also Read: Tomato Price: కోటీశ్వరులు అవుతున్న టమాట రైతులు.!
కుందేళ్లను ఇంట్లో కూడా పెంచుకోవచ్చు
ఎక్కువ రకాల కుందేళ్లు పెంచుకుంటే అత్యంత లాభం అర్జించే అవకాశాలు ఉంటాయి. కుందేళ్ళలో కొన్నింటిని ల్యాబ్ పర్పస్, మీద మరికొన్నింటిని ఇంట్లో పెంచుకునేందుకు, మరికొన్నింటిని మీట్ కట్ చేసి వ్యాపారం చేసే విధంగా పెంచుకుంటే అధిక లాభాలు పొందే వీలుంటుంది. వర్షాకాలంలో కుందేళ్ళ పెంపకం లో చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన ఉంటుంది ముఖ్యంగా కుందేళ్ళకు అందించే ఆహారంలో ఆర్గానిక్ గడ్డి తడి లేకుండా చూసుకుంటే కుందేళ్ళకు ఎటువంటి రోగాలు వచ్చే అవకాశం ఉండదు. రోగాల బారిన పడిన కుందేళ్ళ కు సరైన సమయంలో వైద్యం అందించకపోతే వ్యాధిబా రిన పడ్డ రెండు, మూడు రోజుల్లోనే చనిపోయే ప్రమాదం లేకపోలేదు.
క్రాస్ బ్రీడ్ తో మంచి ఫలితం
కుందేళ్ళ పెంపకం లో పలు జాతుల కుందేళ్లను ఇతర జాతుల కుందేళ్ళతో క్రాస్ బ్రీడ్ చేస్తే ఉత్తమ ఫలితాలు ఉంటాయి. ఎక్కువగా క్రాసింగ్ బ్రీడ్ తో పుట్టిన కుందేళ్ళకు అధిక శాతం ప్రోటీన్ అంది ఎక్కువ ఆరోగ్యంగా కొద్ది కాలంలోనే వెయిట్ పెరగడం ఆరోగ్యంగా ఉండటం, ఎక్కువ సంతానం కలగటం జరుగుతుంది. ఆరోగ్యంగా ఉండే కుందేళ్ళకు రూ.250 నుంచి రూ. 300 వరకు, క్రాస్ బ్రీడ్ తో పుట్టిన కుందేలు పిల్లలకు రూ.300 నుంచి రూ.400 వరకు కుందేలు మాంసం రూ.400 నుంచి రూ .500 వరకు రేటు పలుకుతుంది. కుందేళ్ళ పెంపకం చేపట్టేవారు ఆయా ప్రాంతాల్లో ఉన్న పరిస్థితులను అనుగుణంగా నిష్ణాతులైన వైద్యులను సంప్రదించి వారిచ్చే సూచనలకు అనుగుణంగా కుందేళ్ళ పెంపకాన్ని చేపడితే మంచి ఫలితాలు దక్కి తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు ఆర్జించే వీలు ఉంటుంది.
Also Read: Turmeric Price: పసుపు పండించిన రైతులకి శుభవార్త… రికార్డు స్థాయిలో పెరిగిన పసుపు ధర…