పశుపోషణ

Advantages and Disadvanatges of Artificial Insemination: కృత్రిమ గర్భధారణ ప్రయోజనాలు మరియు ప్రతికూలతలు

0
Artificial Insemination
Artificial Insemination
  • Advantages and Disadvanatges of Artificial Insemination: పాడి పశువుల్లో మేలుజాతి లక్షణాలను పెంపొందించేందుకు అవసరమయే సాంకేతిక పద్ధతుల్లో కృత్రిమ గర్భధారణ ముఖ్యపాత్ర పోషిస్తుంది. ఉత్తమ లక్షణాలు కలిగిన దున్నపోతులు, ఆంబోతుల నుంచి వీర్యాన్ని సేకరించి ద్రవరూప నత్రజని కంటైనర్లలో -196 ఉష్ణోగ్రత లో నిల్వ ఉంచుతారు. ఆవులు, గేదెలు, గర్భధారణకు సరియైన సమయంలో ఉన్నపుడు ప్రత్యుత్పత్తి నాళంలో ఈ వీర్యాన్ని ప్రవేశపెడతారు. పశువు ఎదకొచ్చిన సమయంలో లక్షణాలను గమనించి ఈ పరిజ్ఞానంతో ఎద సూదిని ఇస్తారు. ఆవుల్లో ఎదకు వచ్చిన తర్వాత 12 నుంచి 14 గంటల మధ్య గర్భ ధారణ చేస్తారు. ఇలా చేస్తే పశువుకి ఒక్క సారికే నిల్వవచ్చు. లేదంటే అవి మళ్ళీ 21 రోజుల తర్వాత ఎదకు వచ్చే అవకాశం ఉంది.
    మొదటి సారి ఎద కు వచ్చిన పశువు యొక్క బరువును అంచనా వేసుకొని, మూడడుగుల ఎత్తు ఉంటే కృత్రిమ గర్భధారణ చేయాలి. అలా చేయకపోతె పశువులు ఆరోగ్య సమస్యలతో బాధ పడే ప్రమాదం ఉంటుంది.

    Advantages and Disadvanatges of Artificial Insemination

    Advantages and Disadvanatges of Artificial Insemination

    కృత్రిమ గర్భధారణ వల్ల ప్రయోజనాలు:

  • సహజ కలయిక లేదా సర్వీసింగ్ కన్నా కృత్రిమ గర్భధారణ ద్వారా చాలా ప్రయోజనాలు కలవు.
    కృత్రిమ గర్భధారణలో ఒక మంద కోసం బ్రీడింగ్ ఎద్దు ఒక్క అవసరం రాదు; దాని వలన బ్రీడింగ్ ఎద్దు నిర్వహణ ఖర్చు కూడా తగ్గుతుంది.
  • ఇది కొన్ని వ్యాధుల వ్యాప్తిని మరియు జననేంద్రియ వ్యాధుల వల్ల కలిగే వంధ్యత్వాన్ని రానీయకుండా ఉపయేగపడుతుంది .ఉదాహరణకు:గర్భస్రావం, వైబ్రియోసిస్.
  • వీర్యాన్ని సేకరించిన తర్వాత క్రమం తప్పకుండా దానిని పరీక్షించడం మరియు తరచుగా సంతానోత్పత్తిపై దృష్టి ఉంచడం ద్వారా ముందుగానే అంతర్గత మగవారిని గుర్తించడం వీలవుతుంది.
  • ఇంకా మెరుగైన సంతానోత్పత్తి సామర్థ్యని పెంచవచ్చు.

Also Read: మేలు జాతి పశువుల్లో పిండమార్పిడి

  • చిన్న వయస్సులోనే సంతాన పరీక్ష కూడా చేసుకోవచ్చు.
  • నిర్దిష్ట సార్ చనిపోయిన తర్వాత కూడా కావలసిన వీర్యాన్ని కావాల్సిన పరిమాణంలో ఉపయోగించుకోవచ్చు.
  • కాన్పు కోసం సేకరించిన వీర్యాన్ని ఎక్కుడికైనా అనగా పట్టణ ప్రాంతాలకు లేదా గ్రామీణ ప్రాంతాలకు తీసుకెళ్లవచ్చు.
  • పరిమాణంలో చాలా తేడాలు ఉన్నా ఏ జంతువుకు గాయం కాకుండా జంతువుల సంభోగం జరగడం సాధ్యమవుతుంది.
  • ఈస్ట్రమ్ సమయంలో మగవారిని నిలబడటానికి లేదా అంగీకరించని జంతువులకి కూడా కాన్పు చేయడం సులభమవుతుంది.
  • ఇది బ్రీడింగ్ మరియు కావింగ్ రికార్డులను మేన్ టేన్ చేయడానికి ఉపయొగపడుతుంది.
    ఇది గర్భధారణ శాతాన్ని పెంచుతుంది.
  • ఇది మెరుగైన రికాడ్లను ఉంచడానికి సహాయపడుతుంది.
  • ముసలి, భారీ మరియు గాయపడిన సైర్లను కూడా వినియో గించవచ్చు.మేలుజాతి ఆంబోతుల వీర్యాన్ని
  • స్థానిక పశువుల్లో ఉపయొగించడం ద్వారా మేలు జాతి పశువులు అభివృద్ధి చెందుతాయి.
  • దీని వల్ల స్థానిక పశువుల్లో మేలుజాతి లక్షణాలు వస్తాయి.
  • దీని వల్ల రైతులకు పాల ఉత్పత్తిలో, వ్యవసాయంలో కూడా చాలా ఉపయోగాలు ఉంటాయి.
Artificial Insemination

Artificial Insemination

కృత్రిమ గర్భధారణ యొక్క ప్రతికూలతలు:

  • దీనికి ప్రత్యేక పరికరాలు మరియు శిక్షణ తో కూడిన కార్యకలాపాల అవసరం ఉంటుంది.
  • సహజ కలయిక కన్నా ఎక్కువ సమయం పడుతుంది.
  • ఆపరేటర్కీ పునరుత్పత్తి గురించి నిర్మాణం మరియు పనితీరు గురించి జ్ఞానం అవసరం.
    సానిటరీ పరిస్థితులను మరియు శుభ్రతను పాటించకపోతె తక్కువ సంతానోత్పత్తి కలిగె ప్రమాదం ఉంది.
  • ఎద్దును సరిగ్గా పరీక్షించకపోతే, జననేంద్రియ వ్యాధులు సోకె ప్రమాదం ఉంది.
  • ఎద్దుల మార్కెట్ తగ్గిపోతుంది, ఇంకా ఉన్నతమైన ఎద్దుల మార్కెట్ పెరుగుతుంది.

Also Read: పాడి పశువులకు పాషకాలు అందించండిలా?

Leave Your Comments

Importance of Groundnut Stripper: వేరుశనగ స్ట్రిప్పర్ ఆవశ్యకత

Previous article

Silk Glands: పట్టు గ్రంథి – పట్టు తయారు చేసే కారాగారం

Next article

You may also like