Backyard Poultry Farming: ఆరుగాలం కష్టపడినా అన్నదాతకు సాగు గిట్టుబాటు కావడం లేదు. వ్యవసాయంలో అతివృష్టి, అనావృష్టి పరిస్థితుల వల్ల సాగులో పెట్టిన పెట్టుబడి కూడా తిరిగిరాని పరిస్థితి నెలకొంది. వ్యవసాయానికి ఇలాంటి తరుణంలో పెరటికోళ్ల పెంపకాన్ని చేపట్టి సమీకృత వ్యవసాయంతో ఆర్థికంగా భరోసా పొందవచ్చు. అలాగే వారికి కావాల్సిన పౌష్టికాహారాన్ని కూడా కోడిగుడ్లు, మాంసం ద్వారా పొందవచ్చు. ఇందులో భాగంగా శ్రీ పి.వి. నరసింహారావు వెటరినరి విశ్వవిద్యాలయం, రాజేంద్రనగర్ వారు రాజశ్రీ కోళ్లను అభివృద్ధి చేశారు. గ్రామీణ ప్రాంతాల్లోని రైతన్నలకు ఆర్థికంగా భరోసా ఇవ్వడానికి ప్రభుత్వం పెరటికోళ్ల పెంపకాన్ని ప్రోత్సహిస్తోంది. ఆసక్తి గల రైతులు, నిరుద్యోగులు, మహిళలు రాజశ్రీ కోళ్ల పెంపకాన్ని చేపట్టి నమ్మకమైన ఆదాయాన్ని పొందవచ్చు.

Backyard Poultry Farming
రాజశ్రీ కోళ్ల పెంపకం: రాజశ్రీ కోళ్లు మాంసానికి, గుడ్లకు ప్రసిద్ది. వీటిని దేశవాళి కోళ్లలాగే పెరటిలో పెంచుకోవచ్చు. పొడవైన కాళ్లు కలిగి, చురుకుగా కదలడంతో కుక్కలు, పిల్లులు వంటి క్రూరజంతువుల నుంచి సులువుగా తప్పించుకుంటాయి. ఇవి ముదురు ఎరుపురంగులో ఉండి పూర్తిగా నాటుకోళ్లను పోలి ఉంటాయి. శరీర పరిమాణం మధ్యస్థంగా ఉండి మాంసం, గుడ్ల ఉత్పత్తికి అనువుగా ఉంటాయి. వీటి మాంసానికి మార్కెట్లో మంచి డిమాండ్ ఉంటుంది. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలు తమ పెరట్లో వీటిని సులభంగా పెంచుకోవచ్చు. వీటికి రోగనిరోధకశక్తి కూడా ఎక్కువే. ఇంట్లో మిగిలిన వ్యర్థాలు, గింజలు, పెరట్లో దొరికే కీటకాలను తింటాయి. మహిళలు, నిరుద్యోగులు, ఔత్సాహికులు వాణిజ్య సరళిలో కూడా రాజశ్రీ కోళ్లను పెంచవచ్చు. ఫారం పద్దతిలో పెంచినా కూడా రాజశ్రీ కోళ్ల మాంసం నాటుకోడిలాగే ఉంటుంది.
Also Read: Fowl Pox in Poultry: కోళ్ళలో ఫౌల్ పాక్స్ వ్యాధి వుందా అయితే ఇలా చెయ్యండి.!
మాంసం, గుడ్లకు ప్రసిద్ది: రాజశ్రీ కోళ్లు నాటుకోళ్లతో పోలిస్తే వేగంగా పెరుగుతాయి. కోళ పరిశోధన స్థానం వారు సరఫరా చేసే ఒకరోజు వయస్సున్న కోడిపిల్ల 28 నుంచి 35గ్రా.. బరువుంటుంది. ఆ తర్వాత 4 వారాలకు 140గ్రా., 8 వారాలకు 500గ్రా కు, 12 వారాలకు 890 గ్రా.. 16 వారాలకు 11 కిలోల నుంచి 1.2 కిలోల వరకు బరువు పెరుగుతుంది. 20 నుంచి 22 వారాలకు ఆడ కోడి ఒకటిన్నర కిలోల వరకు బరువు పెరిగి గుడ్లు పెట్టడం మొదలవుతుంది. ఏడాదికి 130 నుంచి 140 గుడ్లు పెడుతుంది.

Small Poultry Farm
రాజశ్రీ కోడిగుడ్లు కూడా కోడిగుడ్లలాగే ఉండటంతో నాటు ఉండటంతో వీటికి బాగా డిమాండ్ ఉంటుంది. రాజశ్రీ కోళ్లను ఏడాదిపాటు పెంచినా గరిష్ఠంగా 2 కిలోల వరకు బరువు పెరుగుతాయి. మగ కోళ్లు కొంచెం ఎక్కువ బరువు పెరుగుతాయి. అయితే వాణిజ్య సరళిలో పెంచే వారు 1.28. నుంచి బరువున్నప్పుడు అమ్ముకోవడమే లాభదాయకం.
Also Read: Poultry Diseases During Monsoon: వర్షా కాలములో కోళ్ళలో వచ్చే వ్యాధులు.!
Also Watch: