మారుతున్న వాతావరణ పరిస్థితులను తట్టుకుంటూ, కూలీల కొరతను అధిగమిస్తూ, అధిక దిగుబడిని సాధించే విధంగా మన దేశం అపరాలు, నూనె గింజ పంటల్లో స్వయం సమృద్ధి సాధించే దిశగా ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయము పరిశోధన జరుపుతుంది.
ఈ దిశలో దేశవ్యాప్తంగా అనుకూలమైన పెసర (ఎల్ జి జి 610), సెనగ (ఎన్ బి ఇ జి 1267), వేరుశనగ (టి సి జి ఎస్ 1707) పంటల్లో నూతన వంగడాలను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేతుల మీదుగా ఆగస్టు 11 న విడుదల చేసిన 109 వంగడాల్లో 3 వంగడాలు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ వర్శిటీవి కావడం గర్వ కారణంగా ఉందని ఉపకులపతి డా. శారద జయలక్ష్మి దేవి పేర్కొన్నారు.
Leave Your Comments