ఆంధ్రా వ్యవసాయం

Red Sandalwood Cultivation: ఎర్ర చందనం సాగు

0
Red Sandal Wood
Red Sandal Wood

Red Sandalwood Cultivation: ఫాబేనీ కుటుంబానికి చెందిన ఎర్ర చందనము లేదా రక్త చందనముగా ప్రసిద్ధి చెందినది. ఈ మొక్క ఆకులు రాల్చు అడవులకు(డెసిడియోస్ ) సంభందించినది. ఇది మధ్యస్థ ఎత్తు వరకు పెరుగు వృక్షము. ఇది 10 మీ. ఎత్తు వరకు ఎదగగలదు. దీని అనుకూల వరిస్థితులలో చెట్టు యొక్క కైవారము(చుట్టుకొలత), 0.9 మీ. నుండి 1.5 మీ వరకు అభివృద్ధి చెందుతుంది.

Red Sandalwood Cultivation

Red Sandalwood Cultivation

సాధారణ నామము : రక్త చందనము
శాస్త్రీయ నామము : టీరోకార్పస్ సాంటాలినస్
కుటుంబము : ఫాబేసి
ప్రాంతీయ నామము : ఎర్ర చందనము
వాణిజ్య నామము : ఎర్ర చందనము

దీని యొక్క బెరుడు(బార్క్) నలుపు-గోధుమ వర్ణము కలిగి మొసలి చర్మము మాదిరిగా ఉంటుంది. లోపలి బెరుడు ఎర్రటి రంగు “సంటోలిన్ డై” ని ఉత్పత్తి చేస్తుంది. ఎర్ర చందనము పువ్వులు పసుపు రంగులో ఉంటాయి. ఇది ఫిబ్రవరి నుండి ఏప్రిల్ వరకు పూలు పూస్తుంది, ఎరుపు-గోధుమ రంగు కలిసిన కాయలు 1 సెం.మీ. – 1.5 సెం.మీ. పొడవు ఉంటాయి.చేవ దేరిన దుంగ ఉపయోగపడు భాగము.

Red Sandalwood Plants

Red Sandalwood Plants

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములొని తూర్పు కనుమలలో ఈ మొక్క సహజముగా పెరిగి అత్యధిక నాణ్యత కలిగి ఉంటుంది. తెలంగాణా మరియు ఇతర రాష్ట్రాల్లో కూడా దీనిని రైతు పొలాలలో పెంచుతున్నారు. ఎర్ర చందనము నీరు నిలవని ఎర్ర నేలలలో మంచి ఎదుగుదలను కనబరుస్తుంది. ఎర్ర చందనము పెరుగుదలకు సగటున 800 మి.మీ. నుండి 1000 మి.మీ. వర్షపాతము అవసరము.దీని పంటకాలము కనీసము 15 నుండి 20 సంవత్సరముల మధ్య ఉంటుంది.

నర్సరీ : పరిపక్వత చెందిన ఎర్ర చందనము విత్తనములు సేకరించి మార్చి, ఏప్రిల్ లేదా మే నెలలలో నర్సరీ మడులలో విత్తుకోవాలి. నారుమడులను ఎండు గడ్డితో పలుచగా కప్పుకోవాలి. విత్తనములు 10-15 రోజులలో మొలకెత్తును. 10మీ.X1మీ. నారుమడిని 10-12 కిలోల విత్తనము అవసరమవుతుంది. సంవత్సరము తరువాత స్టంప్స్ తయారుచేసి ఫిబ్రవరి, మార్చి నోలలలో పాలిథీన్ సంచులలో నాటుకొనవచ్చును.

Also Read: ఎర్రచందనానికి విదేశాల్లో ఎందుకంత గిరాకీ?

ప్లాంటేషన్: భూమిని ఇరువైపుల లోతుగా దున్నాలి. 4మీ.X4మీ. దూరం లో 45 సెం.మీX 45 సెం.మీ.X45 సెం.మీ. గుంతలు తవ్వుకోవాలి. గుంతలలో లిండేన్ పౌడరును చల్లడం వలన చెదలు తాకిడి అరికట్టవచ్చు. వెర్మికంపోస్టు తో కవర్ ఫిల్లింగ్ చేసిన మొక్క మొదట్టి దశ ఆరోగ్యంగా ఉంటుంది.

ఎరువులు : ఒక చెట్టుకు సంవత్సరానికి 10 నుండి 15 కిలోల పశువుల పేడ 150:100:100 గ్రా. (N:P:K) 5 సంవత్సరములు వేసుకోవాలి. రెండు విడతలుగా వేసుకొనుటకు సిఫారసు చేయడమైనది. మొదటి విడత జూన్, జులైలలో రెండవ విడత అక్టోబర్, నవంబర్ లలో వేసుకోవాలి.

అంతర కృషి : చెట్లు నాటిన వెంటనే నీరు పోయాలి. చెట్టు నాటుకున్న తరువాత 10-15 రోజులకొకసారి వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా నీరు అందించాలి. ఎరువులు వేసే ముందు చెట్టు చుట్టూ కలుపు తీయాలి. తరుచుగా చెట్టు చుట్టూ మట్టిని త్రవ్వుతూ పాదులు చేస్తూ ఉండాలి.

సస్యరక్షణ : ఆకులను తినివేసే బొంతపురుగు సాధారణంగా కనిపిస్తుంది, 0.2% మోనోక్రోటోఫోస్ ఒక వారము అంతరముతో రెండుసార్లు పిచికారీ చేసుకోవాలి.

Red Sandalwood

Red Sandalwood

దిగుబడి : 15-20 సంవత్సరముల తరువాత ఒక చెట్టు నుండి 250 కిలోల కలప లభించును.ఎర్రచందనం గ్రేడింగ్ 750 మీటర్లు (2,460 అడుగులు) ఎత్తులో మరియు పాక్షిక-శుష్క వాతావరణ పరిస్థితులలో పొట్టు భూగర్భాలపై పెరిగిన ఎర్ర చందనం ఒక ప్రత్యేకమైన అలల ధాన్యపు అంచుని ఇస్తుంది. ఉంగరాల ధాన్యం అంచుతో కలప ముక్కలు “A” గ్రేడ్‌గా గ్రేడ్ చేయబడ్డాయి. ఉంగరాల ధాన్యం మార్జిన్‌లతో కూడిన ఎర్రచందనం ప్రామాణిక కలప కంటే ఎక్కువ ధరలకు విక్రయించబడుతుంది.

గమనిక: నేల స్వభావం, వాతావరణ పరిస్తితులు, మార్కేట్ సరళి ఆర్థికాంశాలను ప్రభావితం చేస్తాయి.

ఉపయోగములు : చేవదీరిన దుంగలు మధుమేహ, ఉదరములో పుండ్లు, చర్మవ్యాధులు ప్రేగులలోని క్రిములను హరించడానికి, బల ఔషధిగా, తాపనివారణ కారిగా ఉపయోగపడుతుంది. కాయలు ఉపయోగించి చేసిన కాషాయము తీవ్రముయిన రక్త విరోచనాలను అరికట్టడానికి ఉపయోగిస్తారు. దుంగులు నుండి తీసిన నూనె సుగంధ పదార్థాలలో ఉపయోగించ బడుతున్నది.

Also Read: అధిక ఆదాయాన్ని అందించే “అగర్ వుడ్”

Leave Your Comments

Farmers Suicides: దేశంలో రైతన్నల ఆత్మహత్యల నివేదిక

Previous article

Climate Requirement for Sesame: నువ్వుల పంటకు అనుకూలమైన పరిస్థితులు

Next article

You may also like