ఆరోగ్యం / జీవన విధానంవ్యవసాయ వాణిజ్యం

Black Tea Unknown Facts: బ్లాక్ టీ గురించి మనకు తెలియని విషయాలు.!

4
Black Tea Unknown Facts
Black Tea Unknown Facts

Black Tea Unknown Facts: టీ ప్రపంచంలోకి కొత్తగా వచ్చిన ఎవ్వరికైనా బ్లాక్ టీ గురించి మాత్రం తెలుసే ఉంటుంది. లిప్టన్ లేదా టెట్లీ వంటి బ్రాండ్లతో టీబ్యాగ్‌ల గురించి మనం కిరాణా దుకాణాల్లో మరియు టీవి అడ్వర్టైజ్ లో చూస్తూ ఉంటాం. ఇంగ్లీష్ బ్రేక్ ఫాస్ట్ మరియు ఐరిష్ బ్రేక్ ఫాస్ట్ వంటి ప్రసిద్ధ అల్పాహారాలో బ్లాక్ టీ అనేది ఒకటి. బ్లాక్ టీలో కెఫీన్‌ శాతం చాలా ఎక్కువగా ఉంటుంది, ఒక కప్పు కాఫీ లో దాదాపు సగం శాతం కెఫీన్ ఉంటుంది. బ్లాక్ టీ ముదురైన రాగి రంగు కలిగి ఉంటుంది. సాధారణంగా ఇతర రకాల టీ ల కంటే బలమైన రుచిని కలిగి ఉంటుంది.

Black Tea Unknown Facts

Black Tea Unknown Facts

Also Read: ICRISAT Best Watershed Project: మహీంద్రా- ఇక్రిసాట్ చెక్ డ్యాం ‘బెస్ట్ వాటర్‌షెడ్’ ప్రాజెక్ట్ గా గుర్తింపు

బ్లాక్ టీ ఎలా తయారవుతుందో తెలుసుకుందాం!
బ్లాక్ టీ ఉత్పత్తిలో భాగంగా టీ ఆకులను కోసి, ఎండబెట్టి, ఆపై కొద్దిగా క్రశ్ చేస్తారు. ఐరిష్ బ్రేక్‌ఫాస్ట్ వంటి కొన్ని రకాల బ్లాక్ టీలను క్రష్-టియర్-కర్ల్ లేదా CTC అని పిలవబడే పద్ధతి ద్వారా మరింత చిన్న ముక్కలుగా చేస్తారు. టీ ఆకులు ఆక్సీకరణకు గురవుతాయి, కావున అవి గోధుమ-నలుపు రంగులోకి మారుతాయి.

బ్లాక్ టీ ఎక్కడి నుంచి వచ్చిందో చూద్దాం!
బ్లాక్ టీని ముఖ్యంగా చైనా మరియు భారతదేశంలో ఉత్పత్తి చేస్తారు. శ్రీలంక, నేపాల్, వియత్నాం మరియు కెన్యాలు వంటి దేశాలు ఈ రోజుల్లో బ్లాక్ టీని ఉత్పత్తి చేసి ఎగుమతులు చేస్తున్నాయి. సాధారణంగా, భారతీయ బ్లాక్ టీలు ఘాటైన రుచిని కలిగి ఉంటాయి మరియు తరచూ దీనిలో పాలు ఇంకా స్వీటెనర్‌ వేసి చాలా ఇష్టంతో బ్రేక్‌ఫాస్ట్ గా తీసుకుంటారు. అనేక రకాల భారతీయ బ్లాక్ టీలను ఒక ప్రత్యేకమైన టీ గ్రేడింగ్ పద్ధతిని ఉపయోగించి వాటి నాణ్యతను బట్టి అనేక రకాలుగా వర్గీకరించబడ్తుంది.చైనీస్ బ్లాక్ టీలు తేలికగా ఉంటాయి మరియు దానిలో పాలు,చెక్కర వంటివి కలపకుండా అలిగే తాగుతారు. వాటిలో భారతీయ బ్లాక్ టీల కంటే కెఫిన్ కొంచెం తక్కువగా ఉంటుంది. చైనా కీమున్ & గోల్డెన్ యునాన్ అనేవి ప్రసిద్ధమైన చైనీస్ బ్లాక్ టీలోని రకాలు.

Also Read: Bamboo Farmer Success Story: ఎదురు లేని లాభం వెదురు సాగుతో సాధ్యం.!

Leave Your Comments

ICRISAT Best Watershed Project: మహీంద్రా- ఇక్రిసాట్ చెక్ డ్యాం ‘బెస్ట్ వాటర్‌షెడ్’ ప్రాజెక్ట్ గా గుర్తింపు

Previous article

Agriculture in British Era: బ్రిటిష్ వ్యవస్థలో వ్యవసాయం ఇలా ఉండేది.!

Next article

You may also like