వ్యవసాయ వాణిజ్యం

Sugarcane Harvester: యంత్రాలతో చెరకు కోత ఎంతో మేలు.!

1
Sugarcane Harvesting
Sugarcane Harvesting

Sugarcane Harvesting: యంత్రాలతో చెరకు నరికించటానికి అనువుగా నాట్లు వేయడం చాలా ముఖ్యం. గతంలోలాగా చెరకు నరికే కూలీలు లభ్యం కావటం లేదు. రైతుకు ఏడాది పాటు చెరకు పెంచడం ఇబ్బందిగా ఉండటం లేదు కానీ, పండించిన చెరకును నరికించి, ఫ్యాక్టరీకి తరలించటం కష్టంగా మారింది. తెలుగు రాష్ట్రాల్లో టన్నుకు రూ. 600 లు చెల్లించినా కూలీలు లభించని సందర్భాలు నెలకొన్నాయి. చివరికి పండించిన చెరకును తగలబెట్టి నరికించి, ఫ్యాక్టరీలకు తరలిస్తున్నారు. కూలీల కొరత చెరకు పెంచటానికి అదనపు ఖర్చుకు రైతు వెనకాడటం లేదు కాని, నరి కించి ఫ్యాక్టరీకి తరలించడానికి అనేక అవస్థలు పడాల్సివస్తుంది. దీంతో చెర కుసాగు పట్ల విముఖత కలుగుతోంది. కొందరు రైతులు చెరకు సాగుకు స్వస్తి పలుకుతున్నారు. అందుకు కారణం చెరకు నరికి, ఫ్యాక్టరీలకు తరలించే కూలీలు లభ్యం కాకపోవటమే. ఫలితంగా చెరుకుసాగు విస్తీర్ణం గణనీయంగా తగ్గి, చెరకు ఉత్పత్తి తగ్గిపోతుంది. క్రషింగ్కు అవసరమైన చెరకు లభ్యంకాక నిర్ణీత వ్యవధి వరకు ఫ్యాక్టరీలు కూడా క్రషింగ్ చేయడంలేదు. కొన్ని ఫ్యాక్ట రీలు పూర్తిగా మూతపడుతున్నాయి.

Sugarcane Harvesting

Sugarcane Harvesting

చెరకు సాగువల్ల లాభపడేది రైతు ఒక్కడే కాదు. క్రషింగ్ జరిపిన ఫ్యాక్టరీ, ప్రభుత్వాలు కూడా లాభపడతాయి. అలాంటి చెరకు విస్తీర్ణం రోజు రోజుకు తగ్గటం వల్ల, ఫ్యాక్టరీలకు, ప్రభుత్వా లకూ నష్టమే. రైతు చెరకును వదిలేసి మరో పంట పండించుకోగలడు. ఫ్యాక్టరీ చెరుకు లేకుంటే మూత పడడం తప్ప మరో పంటను క్రషింగ్ చేసే అవకాశం ఉండదు. అలాగే చెరకు ద్వారా లభించే ఆదాయం మరే పంటతో ప్రభుత్వానికి సమకూరదు. ఇన్ని విధాలా నష్టపరుస్తున్న చెరకు నరికే కూలీలకు ప్రత్యామ్నాయం చెరకు నరికే యంత్రాలే. వాటిని ప్రోత్సహించటం చాలా అవసరం.

Sugarcane Machine

Sugarcane Machine

యంత్రాలతో అనేక లాభాలు: యంత్రాలతో చెరకు నరికించడం వల్ల రైతుకు ఎన్నో లాభాలున్నాయి. మనుషులతో చెరుకు నరికించడం ఆలస్యంగా జరిగే ప్రక్రియ. 40 టన్నుల చెరకును మనుషులతో నరికించాలంటే 50 నుంచి 60 మంది అవసరమవు తారు. అంతమందిని ఒకేసారి సమకూర్చటం సాధ్యం కాదు. రైతులు 10 నుంచి 15 మంది కూలీలను సమకూర్చుకొని చెరకు నరికించి లారీలతో ఫ్యాక్ట రీకి తరలిస్తున్నారు. ఒకరిద్దరు నరికిన చెరుకును బండ్లతో ఫ్యాక్టరీకి తరలిం చినా, ఎక్కువమందితో నరికించి లారీలతో ఫ్యాక్టరీలకు తరలించినా, నరికిం చిన చెరకు కనీసం రెండు రోజుల తర్వాత గాని ఫ్యాక్టరీకి చేరదు. ఈ రెండు రోజులు చెరకు ఆరిపోవటం వల్ల బరువు తగ్గి, రసనాణ్యత క్షీణించి, పంచ దారి దిగుబడి శాతం తగ్గుతుంది. ఇలాంటి తరుగుదల రైతుకు, ఫ్యాక్టరీకి కూడా నష్టమే.

Also Read: Pest Management in Sugarcane: చెరకు పైరునాశించు తెగుళ్లు సమగ్ర యాజమాన్య చర్యలు.!

యంత్రాలతో చెరుకు నరికించటం వల్ల ఈ తరుగుదలేవీ ఉండవు. నరి కించిన చెరకు రెండు లేదా మూడు గంటల వ్యవధిలో ఫ్యాక్టరీకి చేరుతుంది. ఎకరంలోని చెరకు నరకటానికి సుమారుగా మూడు గంటలు పడుతుంది. ఒక చిన్నపాటి యంత్రం ఒక రోజులో 10 నుంచి 15 ఎకరాల్లోని చెరుకును నరికించి, ఫ్యాక్టరీకి తరలించే వీలుంది. యంత్రాలకు అనుబంధంగా ట్రాలీలుం టాయి. అవి నరికిన చెరకు ముక్కలను అందుబాటులో ఉన్న లారీలకు చేర్చు తాయి. రైతుకు శ్రమ తగ్గుతుంది. పని త్వరగా పూర్తవుతుంది. చెరుకు దవ్వ, పండిన, ఎండిన చెరుకు కూడా ఫ్యాక్టరీకి తరలిపోయి కొద్దో గొప్పో అదనపు తూకం రావటానికి వీలుంది.

యంత్రాలతో చెరకు నరికించటం వల్ల మరో లాభం కూడా రైతు కుంది. కూలీలతో చెరకు నరికించిన తర్వాత ప్రతి ఎకరంలోను 4 నుంచి 5 టన్నుల వరకు ఎండాకు పొలంలో మిగిలిపోతుంది. దాన్ని కాల్చి వేయటం మినహా రైతుకు మరో దారిలేదు. యంత్రాలతో నరికించిన పుడు ఎండాకు రెండంగుళాలు ముక్కలుగా నరకబడుతుంది.

Also Read: Climate Effects On Sugarcane Juice: చెరకు రస నాణ్యతపై వాతావరణ ప్రభావం.!

Also Watch:

Leave Your Comments

Benefits of Terrace Gardening: ఇంటి పంటతో ఆరోగ్యానికి మేలు.!

Previous article

Winter Nutrition for Cattle: చలికాలంలో దూడల పోషణ యాజమాన్యం.!

Next article

You may also like