Bonsai Plants Business: జీవితంలో మనం ఏదైనా సాధించాలంటే, కలను నిజం చేసుకోవాలన్న స్వయంకృషి అనేది చాలా అవసరం. మనం అనుకున్న విజయం సాధించాలి అంటే జీవితంలో ఒడిదుడుకులు అనేవి ఉంటాయి. అయితే ఇది అనుకున్నంతా సులభమైతే కాదు, కానీ మనిషి అనుకుంటే ఏదైనా సాధించగలడు. గత కొన్నేళ్లుగా బోన్సాయ్ మొక్క ట్రెండ్.. క్రేజ్ పెరిగింది. పెద్ద నగరాలతో పాటు చిన్న పట్టణాల్లో బోన్సాయ్ మొక్కలను ఇంటి పైకప్పుపై బాల్కనీల్లో పెట్టుకుంటున్నారు. ఇప్పుడు గ్రామాల్లో కూడా ప్రజలు తమ ఇంటి అందం కోసం బోన్సాయ్‌లను ఉపయోగిస్తున్నారు. ఈ నేపథ్యంలో కొంతమంది రైతులు బోన్సాయ్ మొక్కలను పెంచి లక్షలు ఎలా సంపాదిస్తున్నారో ఆ వివరాలు చూద్దాం.
మార్కెట్లో వీటి ధర రూ. 200 నుంచి రూ. 2500 వరకు
మనం ఎప్పుడైనా బయటకు వెళ్లినప్పుడు లేదా నర్సరీకి వచ్చినప్పుడు చిన్నగా ఎంతో ముద్దుగా కనిపించే బోన్సాయ్ మొక్కలు చూసి మనం కూడా పెంచుకుంటే బాగుంటుందని అనుకుంటాము. అయితే వాటిని మొక్కలను పెంచి వాటి ద్వారా మనం లక్షల్లో లాభం పొందవచ్చు. జపనీస్ కళాకృతి మాదిరిగా ఉండే మొక్కలు చూడటానికి చాలా అందంగా కనిపిస్తాయి. అంతేకాదు ఎంతోమందిని ఆకర్షిస్తాయి. వీటిని ఇంట్లో కుండీలో ఉంచి కూడా సులభంగా పెంచుకోవచ్చు.
Also Read: Crop Loan Waiver: కేసీఆర్ ఆదేశాలిచ్చిన 24 గంటల్లోనే పంట రుణాల మాఫీకి బడ్జెట్ రిలీజ్.!
ప్రపంచవ్యాప్తంగా గ్రీనరీని ఇష్టపడే చాలామంది మొక్కలను ఎంతో ఇష్టపడి మరీ కొనుగోలు చేస్తుంటారు. మార్కెట్లో వీటి ధర రూ. 200 నుంచి రూ. 2500 వరకు ఉన్నాయి. వీటి పెంపకం సాధారణ మొక్కల పెంపకం కంటే కూడా కొంత భిన్నంగా ఉంటుంది. అయితే దీని పెంపకం గురించి కొంత అవగాహన కలిగి మొదలు పెడితే చాలా సులభంగా పెంచుకోవచ్చు.
బోన్సాయ్ ప్లాంట్ వ్యాపారం..
బోన్సాయ్ మొక్కలకు చాలా డిమాండ్ ఉంది. పెద్ద నగరాలతోపాటు చిన్న పట్టణాల్లోనూ కూడా వీటికి డిమాండ్ ఎక్కువగా ఉంది. చాలా మంది తమ బాల్కనీ లేదా గార్డెన్‌లో అలంకరణ కోసం బోన్సాయ్‌లను ఉపయోగిస్తారు. బోన్సాయ్ మొక్కను పెళ్లిళ్లలో లేదా ఏదైనా చిన్న లేదా పెద్ద వేడుకలో ప్రజలకు బహుమతిగా అందజేస్తారు. ప్రస్తుతం పాఠశాలలు, కళాశాలలు, ఆసుపత్రులు, హోటళ్లు వంటి చోట్ల అలంకరణకు వినియోగిస్తున్నారు. కాబట్టి దాని వ్యాపారం చాలా లాభదాయకంగా ఉంటుంది. గత కొన్ని సంవత్సరాలుగా, చాలా మంది దీనికి సంబంధించి నర్సరీని కూడా ప్రారంభించారు. చాలా మంది దీనిని ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా కూడా మార్కెటింగ్ చేస్తున్నారు.
Also Read: Coriander Farming Profit: కొత్తిమీర సాగు తో రూ. కోటి సంపాదన..