వ్యవసాయ వాణిజ్యం

దేశంలో గణనీయంగా పెరిగిన చక్కెర ఉత్పత్తి..

0
Sugar Production 2021-22

sugar output up 4.75%

Sugar Production 2021-22 దేశంలో చక్కెర ఉత్పత్తి గణనీయంగా పెరిగింది. తాజాగా చక్కెర సహకార సంస్థ 2021-22 సీజన్‌లో అక్టోబర్-డిసెంబర్ మధ్య కాలంలో చక్కెర ఉత్పత్తిపై గణాంకాలు విడుదల చేసింది. చక్కెర సహకార సంస్థ తాజా లెక్కల ప్రకారం 4.75 శాతం పెరిగి 115.70 లక్షల టన్నులకు చేరుకుంది. 2020-21 సీజన్‌లో ఇదే కాలంలో చక్కెర ఉత్పత్తి 110.45 లక్షల టన్నులుగా ఉంది. సాధారణంగా చక్కెర సీజన్ అక్టోబర్ నుండి సెప్టెంబర్ వరకు ఉంటుంది. అయితే నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ కోఆపరేటివ్ షుగర్ ఫ్యాక్టరీస్ లిమిటెడ్ (NFCSFL) విడుదల చేసిన తాజా డేటా ప్రకారం, డిసెంబర్ 31 2021 నాటికి సుమారు 491 మిల్లులు 1227.17 లక్షల టన్నుల చెరకును క్రషింగ్ చేశాయి. ఇది గత సంవత్సరం కంటే ఎక్కువ.

 sugar output up 4.75%

Sugar Production 2021-22 దేశంలో చక్కెర ఉత్పత్తిలో ఉత్తరప్రదేశ్ అగ్రస్థానంలో ఉంది. కాగా..గత సంవత్సరం కంటే ఈ సీజన్లో ఉత్తరప్రదేశ్‌లో చక్కెర ఉత్పత్తి కొంచెం తగ్గుముఖం పట్టింది. 2021-22 సీజన్‌ అక్టోబర్-డిసెంబర్ మధ్యకాలంలో 30.90 లక్షల టన్నులు ఉండగా. గత సంవత్సరం కాలంలో చక్కెర ఉత్పత్తి 33.65 లక్షల టన్నులుగా ఉన్నది. ఇక దేశంలో రెండవ అతిపెద్ద చక్కెర ఉత్పత్తి Sugarcane Productivity రాష్ట్రమైన మహారాష్ట్రలో చక్కెర ఉత్పత్తి 39.85 లక్షల టన్నుల నుండి 45.75 లక్షల టన్నులకు పెరిగింది, అదే సమయంలో కర్ణాటకలో చక్కెర ఉత్పత్తి 24.15 లక్షల టన్నుల నుండి 24.90 లక్షల టన్నులకు పెరిగింది. sugar output up 4.75%

 sugar output up 4.75%

గుజరాత్‌లో చక్కెర ఉత్పత్తి ఈ ఏడాది అక్టోబర్-డిసెంబర్ మధ్య కాలంలో 3.35 లక్షల టన్నుల నుంచి 3.40 లక్షల టన్నులకు ఎగబాకింది. అటు మధ్యప్రదేశ్, పంజాబ్, తమిళనాడు, తెలంగాణ మరియు ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో ఉత్పత్తిలో స్వల్ప పెరుగుదల ఉందని చక్కెర సహకార సంస్థ డేటా చెప్తుంది.

Latest Agriculture News

Leave Your Comments

తామర పురుగు కట్టడికి హోమియో వైద్యం…

Previous article

చలికాలంలో పశుపోషణలో పాటించవలసిన జాగ్రత్తలు

Next article

You may also like