Jasmine Farming: రైతులు వరి, వేరుశనగ ఇలాంటి పంటల నుంచి కొత్త రకమైన పంటలు లేదా వ్యవసాయంలో యాంత్రికతతో కొత్త పంటలని పండించి లాభాలు పొందాలి అని అనుకుంటున్నారు. ఇలా కొత్తగా ప్రయత్నిచాలి అని కడప జిల్లా, ఓబుళాపురం రామానంద్ రెడ్డి రైతు మల్లె తోట సాగు చేస్తున్నారు.
రామానంద్ రెడ్డి గారు 10 గుంటల పొలంలో మల్లె తోటని 2 సంవత్సరాల నుంచి సాగు చేస్తున్నారు. వీటికి నీరు డ్రిప్ సహాయంతో అందిస్తున్నారు. ఒకొక్క మొక్క మధ్య దూరం 6 అడుగులు. సళ్ళ మధ్య దూరం కూడా 6 అడుగులు. ఈ పది గుంటలో 350 మల్లె మొక్కలని నాటుకున్నారు.
Also Read: Make Compost at Home: కంపోస్ట్ సులువుగా ఎలా తయారు చేసుకోవాలి… ?
ఈ మల్లె పూవ్వులు సీసొనాల్ పంటల పూస్తాయి. వీటి సువాసనకి అందరూ ఇష్టపడుతారు. సీసొనాల్ పంట కాబట్టి వీటికి మంచి డిమాండ్ ఉంటుంది మార్కెట్లో. ఈ మొక్కలు నాటుకొని ఇప్పటికి 2 సంవత్సరాలు పూర్తి అవుతుంది. ఈ మొక్కల నుంచి ఎక్కువ దిగుబడి మొక్కలు నాటక మూడు సంవత్సరాలు పూర్తి అయ్యాక వస్తుంది.
ఈ మల్లె పూవ్వుల తోటకి ఎలాంటి ఎరువులు లేకుండా సేంద్రియ వ్యవసాయం చేస్తున్నారు. ఈ తోట నుంచి రోజుకి 6-7 కిలోల దుగుబడి ప్రస్తుతం వస్తుంది. ఇంకా ఒక సంవత్సరం పూర్తి అవుతే 10 కిలోల పైన దిగుబడి వస్తుంది. ఈ పూవ్వలు మార్కెట్లో కిలో 300 రూపాయలుగా అమ్ముతున్నారు. వీటి నుంచి రోజు ప్రస్తుతం 1800-2100 రూపాయల వరకు ఆదాయం వస్తుంది.
ఈ మల్లె పూవ్వులు కోయడానికి కూలీలు ఎక్కువ మంది అవసరం ఉంటుంది. ఈ తోట పెట్టడం వల్ల రైతులకి మంచి ఆదాయం వస్తుంది. ఈ తోటకి ఎక్కువ పెట్టుబడి, మెయింటనెన్ అవసరం కూడా కాబట్టి మంచి లాభాలు వస్తాయి.
Also Read: Agriculture Trolley: వ్యవసాయ పనులు సులువు చేయడానికి ఈ ప్రత్యేకమైన ట్రాలీ…