Farmer Success Story : మహారాష్ట్రకు చెందిన ఆదర్శ మహిళా రైతు వనిత ఎకరా పొలంలో ఏడాది కాలంలో పదిహేను రకాల పంటలను సాగు చేస్తున్నారు. దీనికోసం ఒక ఎకరా నమూనా సేద్య పద్ధతిని ఆమె అనుసరిస్తున్నారు. మహారాష్ట్రలోని ఉస్మానాబాద్ జిల్లా చినీ వనిత స్వగ్రామం.. 35 ఏళ్ల వనితా బాల్ భీమ్ నెట్టి 2014 నుంచి ఒక ఎకరా నమూనా సేద్య పద్దతిలో పంటలను సాగు చేస్తున్నారు. తన కుటుంబానికి సరిపడా సేంద్రియ, పోషకాహారాన్ని అందిస్తున్నారు. దాంతోపాటు మంచి నికరాదాయాన్ని ఆర్జిస్తున్నారు. నలుగురు ఆడపిల్లలకు చదువు చెప్పిస్తున్నారు. స్తోమత లేకపోవడంతో ఎనిమిదో తరగతి వరకే చదువుకున్నారు. ఆ తరువాత ఆమెకు పెళ్లి చేశారు. అందుకే ఆడపిల్లలకు చదువు ఎంత అవసరమో వనితకు తెలుసు. అందుకే తన నలుగురు కూతుళ్లను పీజీ వరకూ చదివించి వారందరికీ ఉద్యోగాల్లో స్థిరపడేలా చేయాలనుకున్నారు. నలుగురు ఆడపిల్లల్లో పెద్ద కూతురు డిగ్రీ చదువుతోంది. చిన్న కూతురు ఏదో తరగతి చదువుతోంది. అయితే ఆమె కలను నిజం చేసింది ఎకరా నమూనా సేద్య పద్ధతి.
వనిత, ఆమె భర్త బాల్బీమ్ ఇద్దరూ రైతులే. పంటల సాగుతో పాటు కుటుంబానికి తగిన ఆదాయం కోసం పాడి పశువులను సాకేవారు. అయితే ఎంత కష్టపడినా కూడా కుటుంబాన్ని పోషించుకోవడమే కష్టమయ్యేది. 2014లో స్వయం శిక్షాన్ ప్రయోగ్ (ఎస్ఎస్పీ), కృషి విజ్ఞాన్ కేంద్రం (కేవీకే) సంస్థలు నిర్వహించిన ఒక శిక్షణా కార్యక్రమానికి వనిత హాజరయ్యారు. అక్కడే వనితకు ఈ ఒక ఎకరా నమూనా సేద్య పద్దతి గురించి తెలిసింది.
Also Read: Bamboo Farmer Success Story: ఎదురు లేని లాభం వెదురు సాగుతో సాధ్యం.!
గ్రామీణ మహిళలు తమ కాళ్ల మీద తాము నిలబడేలా చేసేందుకు ఎస్ఎస్పీ శిక్షణ ఇస్తుంది. ఆసక్తి ఉన్న మహిళలందరినీ సిద్దగిరిలోని సేంద్రియ వ్యవసాయ క్షేత్రానికి తీసుకెళతారు. అక్కడ ఒక ఎకరాలోనే వంద రకాల పంటలను సాగు చేయడాన్ని నేరుగా మహిళలకు చూపుతారు. కుటుంబంలోని సభ్యులందరికీ ఒక అవసరమైన పోషకాలను అందించేలా ఆ పంటలను ఎంపిక చేసి సాగు చేస్తున్నారు.
ఆ ఒక్క ఎకరా పొలంలోని పంటల వైవిధ్యం చూసి వనిత కూడా తన కుటుంబానికి అవసరమైన సేంద్రియ, పోషకాహారాన్ని అందించేందుకు ఒక ఎకరా నమూనా పద్దతిలో వీలయినన్ని పంటలను సాగు చేయాలని నిర్ణయించుకున్నారు. అలా నిర్ణయించుకోవడానికి కారణం ఉంది. వనిత భర్త మధుమేహం, అధిక రక్తపోటుతో జన్న బాధపడుతున్నాడు. అందుకే ఆమె కుటుంబ సభ్యుల ఆరోగ్యం గురించి ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నారు. కాల సేంద్రియ సేద్యం చేసి ఆరోగ్యకరమైన ఆహారాన్ని తన కుటుంబ సభ్యులకు అందించాలనుకున్నారు. పంట ఉత్పత్తులను మార్కెట్లో అమ్మటానికి కాదు. ఈ కారణాలన్నింటి రీత్యా ఆమె ఒక ఎకరా నమూన సేద్యపద్ధతిని పంటల సాగుకు ఎంచుకున్నారు.
2014 కంటే ముందు తమ ఎకరాతో పాటు మరో రెండెకరాలు కౌలుకు తీసుకొని సాగు చేసేవారు. అందులో రకరకాల పంటలను సాగు చేసేవారు. ఇప్పుడు ఈ మూడెకరాల్లో ఎకరా నమూనా సేద్య పద్ధతిలోనే మిశ్రమ పంటలను సేంద్రియ పద్ధతుల్లో సాగు చేస్తున్నారు. 2015లో మొత్తం 15 రకాల పంటలను సాగుచేశారు. అపరాలు, సిరిధాన్యాలు, కూరగాయల పంటలను ఎకరా నమూనా పద్ధతిలో సాగు చేశారు. ఎకరా పొలంలోనే రకరకాల పంటలను కలిపి సాగు వేయడం వల్ల పురుగుమందులు, ఎరువుల ఖర్చు తప్పింది. మరోవైపు భూసారం పెరిగింది. ఆ ఏడాది ఆమెకు మంచి దిగుబడి వచ్చింది. అందులో ఒక క్వింటా తమ ఇంటి అవసరాల కోసం ఉంచుకున్నారు. ఎకరాకు రూ.15 వేల ఖర్చయింది. ఖర్చులు పోను ఎకరాకు రూ. 20 వేల నికరాదాయం వచ్చింది. నా పొలంలో నీటి సంరక్షణ చేపట్టి భవిష్యత్తులో పళ్ల తోటలను సాగుచేయాలనేది నా ఆలోచన అంటారు వనిత.
Also Read: Farmer Success Story : సేంద్రియ పద్ధతిలో మామిడి సాగు చేస్తున్న రైతు.!
Must Watch: