Mushroom Farming: వ్యవసాయంతో పాటు వ్యవసాయ అనుబంధ రంగాలకు రైతులు ఎక్కువగా మక్కువ చూపుతారు. అనుబందరంగం అయినా పుట్టగొడుగులకు రైతులు ఆసక్తి చూపుతున్నారు. అయితే ఇంటి దగ్గర ఖాళీగా ఉన్న మహిళలు, నిరుద్యోగ యువకులు ఎక్కువగా దీని సాగు చేయడానికి ముందుకు వస్తున్నారు. ముందుగా పుట్టగొడుగులు గురించి తెలుసుకొని అవగాహన పెంచుకుంటున్నారు. దీనికి ప్రభుత్వం కూడా ప్రోత్సహకాలు అందిస్తోంది.
అందుకే ఈ మధ్యకాలంలో కొందరు ఈ సాగును ఎంచుకుంటున్నారు. అందులో ఇంట్లోనే కొద్దిపాటి పెరట్లో ఈసాగుకు మహిళలు ముందుకు వచ్చారు. ఈనేపద్యంలో ఒడిశాలోని సంబల్ పూర్ జిల్లాలోని ఖలియాముండా గ్రామానికి చెందిన లూరీ కిషన్ పెరట్లో దాదాపు 8 నుంచి 10 కిలోలు ఉండే పుట్టగొడుగు కనిపించింది. ఇంత పెద్ద పుట్టగొడుగును గతంలో ఎప్పుడూ చూడలేదని స్థానికులు చెబుతున్నారు. ఇది ఒక అరుదైన జాతిగా భావిస్తున్నారు.
Also Read: Tomato Crop Protection: నైలాన్ తెరలు నుంచి టమాటా పంటను కాపాడుకుంటున్న రైతులు..
మార్కెట్లో వీటికి మంచి డిమాండ్
పుట్టగొడుగులు అనేది ఆరోగ్య పరంగా పోషకాలు కలిగిన ఆహారం. ఆరోగ్య సంరక్షణ, పోషక ఆహారంపై ప్రజల్లో అవగాహన అనేది రోజురోజుకీ పెరుగుతోంది. అధిక పోషకాలు కలిగిన పుట్టగొడుగలు లాంటి ఆహార పదార్థాల వినియోగం ప్రజల్లో ఎక్కువ అవుతుంది. మార్కెట్లో వీటికి మంచి డిమాండ్ ఉండటంతో ఎక్కువ మంది యువకులు సాగు చేసేందుకు ముందుకు వస్తున్నారు. చిన్న చిన్న పరిశ్రమలను ఏర్పాటు చేసుకుని వివిధ రకాల పుట్టగొడుగులు పెంచి మార్కెట్ చేసుకుంటున్నారు.
కొత్తగా ఈ రంగంలోకి రావాలని అనుకునే వారికి పుట్టగొడుగుల పెంపకంపై సమగ్ర అవగాహన కల్పించేందుకు ఆధికారులు శిక్షణ తరగతులు ఏర్పాటు చేస్తున్నారు. దీనిలో పుట్టగొడుగుల పెంపకాన్ని గురించి తెలుసుకోవచ్చు. వ్యవసాయ, అనుబంధ రంగాల్లో లాభసాటి విధానాలపై అవగాహన కల్పించి రైతుల ఆదాయాన్ని పెంచే లక్ష్యంతో ఆధికారులు తరగతులను ఏర్పాటు చేశారు. దీని ద్వారా ఆధునిక విధానంలో, లాభసాటి పద్ధతులు తెలుసుకొని సాగులో లాభాలు పొందవచ్చు.
చూడటానికి గ్రామస్థులు క్యూ
పుట్టగొడుగు ఎంత బరువు ఉందో తెలుసా. 10 కేజిల పుట్టగొడుగులు పెరట్లో కాయడం మరింత విశేషం. పుట్టగొడుగు వెడల్పు 2అడుగులు, తెలుపురంగు లో ఉంది. ఎందుకంటే ఇది చాలా అరుదుగా ఉంటుంది. దీనిని చూడటానికి గ్రామస్థులు క్యూ కట్టారు. ఇంత పెద్ద పుట్టగొడుగును ఎప్పుడు చూడలేదని అంటున్నారు. అయితే ఇది తినచ్చా, తినకూడదా అనే సందేహం అందరికీ కలుగుతుంది. అధికారులు, శాస్త్రవేత్తలు దానిని చూసి ఆశ్చర్యపోతున్నారు.
Also Read: Flower Cultivation: రైతులకు పరిమళాలు పంచుతున్న పూలసాగు.!