Polished vs Unpolished Rice: Polished vs Unpolished Rice: మనుషుల జీవనం, అలవాట్లు అని ఒక క్రమ పద్దతిలో జరుగుతుంటాయి. అలాగే మన పూర్వీకులు వరి ధాన్యాన్ని పాలిష్ చేయకుండా, కేవలం పైన ఉన్న పొట్టు తీసి తినే వాళ్ళు. కొంత కాలం తర్వాత బియ్యం సన్నగా, వంట చేశాక అన్నం పొడిగా రావడానికి బియ్యాన్ని పాలిష్ చేసే తిన్నారు. ఇప్పుడు మన పూర్వీకుల బియ్యాన్ని పాలిష్ చేయకుండా, పంటలని సేంద్రీయ పద్దతిలో పండిస్తున్నారు. ఎక్కువగా పాలిష్ చేసిన బియ్యంలో తీపి పదార్థం మొత్తం తీసివేస్తారు. వీటికి ఎలాంటి పురుగు పట్టదు. పై పొట్టు మాత్రమే తీసిన బియ్యానికి త్వరగా పురుగు పడుతుంది.
ఇప్పుడు ఇంకా నేరుగా వంట చేసుకోవడానికి సిద్ధంగా ఉండే బియ్యం ఉన్నాయి మార్కెట్లో. వీటిని మళ్ళీ శుభ్రం చేయాల్సిన అవసరం కూడా ఉండదు. ఈ సన్న పాలిష్ చేసిన బియ్యానికి అని రోజులు ఉన్న కూడా పురుగు పట్టదు. కనీసం పురుగులు కూడా తీయలేని బియ్యాన్ని మనం ఎలా తింటున్నాము ఒక్కసారి ఆలోచించండి.
నిజానికి బియ్యానికి పురుగు పడితేనే మంచిది. బియ్యాన్ని ప్రతి ఆరు నెలలకి ఒకసారి శుభ్రం చేసుకోవాలి. ఇలా శుభ్రం చేసుకుంటే బియ్యం నాణ్యత కూడా పెరుగుతుంది. పురుగులు తింటున్నాయి అంటే అవి మనుషులు కూడా వాటిని తినడం మంచిది. ఎక్కువ పాలిష్ చేసిన బియ్యంలో అన్ని విటమిన్, పోషక విలువలు పొట్టు రూపంలో పోతాయి. ఈ పాలిష్ చేసిన అన్నం తిన్నడం ద్వారా మనకి ఇంకా ఏమి ఉపయోగం ఉంటుంది. ఈ బియ్యం తినడం ద్వారా మన ఆరోగ్యం కూడా చాలా వరకు దెబ్బ తింటుంది.
పాలిష్ బియ్యం తింటే రోగనిరోధక శక్తి కూడా తగ్గుతుంది. రైతులు ఒక సంవత్సరం పండించిన వరి పంటని దాచి, మళ్ళీ వచ్చే సంవత్సరం ఆ వరిని తినడానికి వాడుకుంటారు. ఒక సంవత్సరం పంట మళ్ళీ సంవత్సరం తిన్నడం ద్వారా కూడా అందులో పోషక విలువలు పెరుగుతాయి.
ప్రస్తుతం రైతులు పంట కోతలు పూర్తి అయిన తర్వాత వెంటనే వరి ధాన్యాన్ని బియ్యంగా మారుస్తున్నారు. దీని వల్ల బియ్యం నాణ్యత కూడా తగ్గుతుంది. ఈ బియ్యాన్ని వంట చేసిన కూడా ఆ బియ్యం రుచి తగ్గుతుంది. ఈ మధ్య కాలంలో బియ్యానికి, పప్పులకి కూడా గడువు ముగింపు తేదీ ఇస్తున్నారు. ఒక్కసారి పండించిన బియ్యానికి 10 సంవత్సరాలు వరకు తిన్నా కూడా ఏమి కాదు.
ఎక్కువ సంవత్సరాలు నిల్వ ఉంచినా కూడా వాటి రుచి, సువాసన, విటమిన్ లో ఎలాంటి లోపాలు ఉండవు. పప్పులు, బియ్యానికి గడువు ముగింపు తేదీ అసలు ఉండదు. ఎన్ని సంవత్సరాలు పూర్తి అయితే అంత మంచి రుచి వస్తుంది. ఇలా పాలిష్ చేయని బియ్యాన్ని తినడం ద్వారా అందరి ఆరోగ్యాలు కూడా మెరుగు అవుతాయి. ఒకే సారి పాలిష్ లేని బియ్యాన్ని తినడం కూడా కష్టం. అందుకని ప్రతి సారి కొంత వరకు పాలిష్ తగ్గించి బియ్యాన్ని కొనుగోలు చేయడం మంచిది.
Vegetable Solar Dryer: ఒరుగులు తయారు చేసుకునే వాళ్ళ కోసం కొత్త పరికరం…