ఆరోగ్యం / జీవన విధానంఉద్యానశోభ

Uses of Orchid: ఆర్కిడ్ పూలసాగు తో ఉపయోగాలు.!

0
Orchid Flowers
Orchid Flowers

Uses of Orchid: ఆర్కిడ్ పూలు ఎక్కువకాలం (దాదాపు 20 రోజు లకు పైగా) తాజాగా ఉండటం వీటి ప్రత్యేకత. ఈ పూలు అనేక రంగుల్లో, పరిమాణాల్లో, వివిధ రకాల వాతావరణ పరిస్థితుల్లో పెరిగే గుణాలు కలిగి ఉండడంతో వీటికి పూల ప్రపంచంలో ప్రత్యేక స్థానం ఉంది. ఆర్కిడ్ పూలు తేనెటీగలు, సీతాకోక చిలుకలు, కందిరీగలు, హంసలు, పావురాలు, మనుషుల ఆకారాలను అనుకరిస్తాయి. ఇటీవలి కాలంలో ఆర్కిడ్ పుష్పాల్లో కొత్త రకాలను రూపొం దించడంతో వీటికి అనేక దేశాల్లో డిమాండ్ పెరిగింది.

Orchid Farm

Orchid Farm

మనదేశంలో సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్లో, పశ్చిమ కనుమల్లో ప్రకృతిలో సహజంగా చెట్లపైన పెరుగుతాయి. వీటిని కేరళ, తమిళనాడు, గోవా, మహారాష్ట్ర, అండమాన్ నికోబార్, కర్నాటక రాష్ట్రా ల్లో కూడా సాగుచేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఏజెన్సీ ప్రాంతాలైన ఆరకులోయ, విశాఖపట్నం ప్రాంతాల్లో సాగుకు అనువైనవి.

మంచి డిమాండ్: ఆర్కిడ్ పూలకు మార్కెట్ లో మంచి డిమాండ్ ఉంటుంది. వీటిని ఎక్కువగా పూలవేజ్లలో, శుభ కార్యాల్లో, బొకేలలో, వేలాడే పూల కుండీల్లో అందంగా పెంచుకోవడానికి అధికంగా వాడుతుం టారు. వీటి ధర ఒక్కో పూవుకు రూ.20 నుంచి రూ.30 వరకు పలుకుతుంది. వీటికి హైదరాబాద్,

బెంగళూరు, ముంబై, ఢిల్లీ మార్కెట్లలో బాగా డిమాండ్ ఉంది. ఇటీవల కడియం నర్సరీలలో కుండీల్లో పెంచిన మొక్కలకు కూడా మంచి గిరాకీ ఉంది. కొందరు రైతులు వీటిని పాలీహౌజ్లలో సాగుచేసి లాభాన్ని పొందుతున్నారు. ఉదాహర ణకు సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం దేవుల పల్లి గ్రామ శివారులో 8 ఎకరాల్లో సమర్ భగత్, ప్రవీన్ గుప్తా రైతులు ఒక ఎకరంలో వీటిని సాగు చేసి లబ్దిపొందారు. ఈ పూలకు ఉన్న మార్కెట్ ను గమనించి ఎప్పుడూ ఒకే పద్ధతిలో పంటసాగు చేయకుండా వేరే పంటల సాగును చేపట్టితే రైతులు లాభాన్ని పొందవచ్చు

ఉపయోగాలు:

ఆర్కిడ్స్ అందమైన పూలకేగాక, వీటితో వివిధ రకాలైన ఉపయోగాలున్నాయి.అనోక్టో చిలజాతి ఆర్కిడ్ ఆకులను ఇండోనే షియా, మలేషియాదేశాల్లో కూరల్లో వంటకానికి వాడతారు. సైప్రస్ దీవుల్లో ఆర్చిస్ అనటోలికను పానీయాల రూపంలో వాడతారు.

ఔషధాలు: చాలా దేశాల్లో అర్కిడ్లను ఔషధాల తయారీలో వాడతారు. వీటి దుంపలను (ఆర్చిస్ లాటిఫోలియా, హాబనేరియా) సాలిప్ అనే ఔషధ తయారీకి వివిధ రకాలైన వ్యాధులను నివారించడంలో ఉపయోగి స్తారు. వీటి విత్తనాల పొడిని గాయాలను నయం చేయడంలో వాడతారు.

Also Read: Summer Flowers: వేసవిలో వికసించే అందమైన పువ్వులు

 కర్మాగారాల ఉత్పత్తులు: గ్రామాల్లో వ్యాపార కుటీరాల్లో కొన్ని ఆర్కిడ్ జాతులైన జియోడోరమ్ నూతన్స్, బెటిలా వంటి జాతుల నుంచి జిగురును తయారు చేస్తారు.

ఆర్కిడ్ జ్యువెలరీ: ఈశాన్య రాష్ట్రాల్లో రైనోకోస్టిలిస్ రెటుసా ఆర్కిడా జాతి పూలను మహిళలు తల కొప్పుల్లో, ఆభరణాలు ధరిస్తారు. డెండ్రోబియం యుటిలే జాతి పుష్పాలను చెవి పోగులుగాను, చేతికి తగి లించే గాజుల రూపంలో ధరిస్తారు.

Uses of Orchid

Uses of Orchid

అనువైన రకాలు:

కటవర్స్: సింబిడియం హైబ్రిడ్లు, డెండ్రోబియం హైబ్రిడ్లు, ఫెలోనా ప్సిస్, వేండా, మొకారా, ఆరండా.

కుండీల్లో పెంచుకోవడానికి: ఫెలోనాప్సిస్, పాపియో పెడెలియం, ఎరేడి డెండ్రోబియం జాతులు, రెంకో స్టైలిస్, వేండా స్పాలో గ్లాటిస్ ఫ్లికాట.              ఆర్కిడ్ రకాల వివరాలు

మోనోపోడియల్స్: అరాక్నిస్: వీటిని స్కార్పియన్ ఆర్కిడ్లు అంటారు. వీటి పూల కాడలు 75 100 సెం. మీ. లేదా అధికంగా ఉండి దాదాపు 8 నుంచి 15 వరకు పూలను కలిగి ఉంటాయి. ఉదా॥ మాగీ ఓయిరెడ్ రిబ్బన్

మొక్కల ఉత్పత్తి: మోనోపోడియల్ ఆర్కిడ్స్: బాగా ఎదిగిన రెండు వేర్లను కలిగిన 40 – 50 సెం. మీ. పొడవు కలిగిన కటింగ్సు అనువైనవి. పిలనాప్సిస్, కలాండీ, తునియా వంటి రకాల్లో పూలకాడలు కూడా అనువైనవి. కొన్ని సందర్భాల్లో పూలకాడల నుంచి కూడా కాండాలు పుడతాయి.

సింపోడియల్ ఆర్కిడ్స్: మొక్క గుత్తులను విడగొట్టి చిన్న పరిమాణాల్లో వాడవచ్చు. ఒక్కొక్క యూనిట్ (గుత్తి) సుమారు 4-5 శాఖలను కలిగి ఉండాలి. ఈ పద్ధతి క్యాటెలియా, డెండ్రోబియంలకు అనువైనది. కొన్ని సమ యాల్లో డెండ్రోబియం రకాలు సూడో బల్బు కణుపుల వద్ద చిన్నపాటి మొక్క లకు వేర్లతో పుడతాయి. వీటిని కైకీలు అంటారు. ఇవి ఏపుగా పెరిగిన తర్వాత తల్లి మొక్కల నుంచి వేరు చేసి కుండీల్లో నాటుకోవచ్చు. వయస్సు పైబడిన శాఖలు లేదా కేన్లను తల్లి. మొక్కల నుంచి వేరుచేసి తేమతో కూడిన మీడియాలో సమతలంగా పేర్చి వేర్లు పుట్టే పరిస్థితి కలిగించాలి.అహార పదార్థాల్లో విరి విగా ఉపయోగిస్తారు.

Also Read: Importance of Floriculture: పూల పెంపకం ప్రాముఖ్యత.!

Also Watch: 

Leave Your Comments

Natural Farming and Organic Farming: సేంద్రియ మరియు సహజ వ్యవసాయానికి మధ్య తేడా ఏమిటి ?

Previous article

Benefits of Terrace Gardening: ఇంటి పంటతో ఆరోగ్యానికి మేలు.!

Next article

You may also like