Tea Tree Oil Uses: ఈ టీ ట్రీ ఆయిల్‌ని కేవలం బాహ్యఅవసరాలకే మాత్రమే ఉపయోగించాలి. వాడినప్పుడు 1, 2 చుక్కలను మాత్రమే వాడాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా నోటిలోపలికి తీసుకోకూడదు. ఈ టీ ట్రీ ఆయిల్ ప్రతి ఆయుర్వేదషాపుల్లో దొరుకుతుంది.
ముఖ్యగమనిక : ఈ టీ ట్రీ ఆయిల్‌ని చంటి పిల్లలకు దూరంగా ఉంచాలి. పొరపాటున పిల్లలకు ఇది నోటి ద్వారా లోపలికి వెళితే అనర్ధాలకు దారితీస్తుంది.
ఆడవారికి, మగవారికి ముఖం మీద మొటిమలు సర్వసాధారణం. వీటిని పోగొట్టుటకు ఎన్నెన్నో క్రీమ్స్ రాసి అవి తగ్గక విసుగిపోయి ఉండి ఉంటారు. టీ ట్రీ ఆయిల్ రెండు చుక్కలు, రెండు చుక్కల తేనె కలిపిన మిశ్రమాన్ని దూదితో ముఖం మీద ఉన్న మొటిమల మీద అద్దాలి అవి అంతటితో అదృశ్యం అయిపోయి మరలా తిరిగి రావు. మొటిమలు మానిన తరువాత మచ్చలు వస్తాయి అవి కూడా రావు.
కాలిగోళ్ళకి, చేతి వేళ్ళకి ఫంగస్ లాంటివి ఏర్పడి గోర్లు పుచ్చిపోతాయి అలాంటప్పుడు రెండు చుక్కల టీ ట్రీ ఆయిల్ ను రెండు చుక్కల ఆలివ్ ఆయిల్‌తో కలిపి గోళ్ళ మీద దూదితో రాయాలి. లేదా గోరువెచ్చటి నీళ్లను ఒక బేసిన్లో తీసుకుని రెండు చుక్కల టి ట్రీ ఆయిల్ వేసి అందులో చేతులు కాళ్లు ముంచాలి.
చుండ్రుని శాశ్వతంగా పరిష్కరించడానికి టీ ట్రీ ఆయిల్ ఎంతగానో ఉపయోగపడుతుంది. కొంచెం షాంపూలో రెండు చుక్కల టీ ట్రీ ఆయిల్‌ని వేసుకొని తలంటుకున్నట్లయితే చుండ్రుని శాశ్వతంగా నివారించవచ్చు మరియు తలపై ఉన్న చర్మం కూడా పొడిగా ఉంటుంది.
Also Read: సీజన్ తో సంబందం లేకుండా ఏడాది పొడువునా సాగు.!
ఒంటి మీద వచ్చే గుల్లలు, సెగ్గడ్డలకు రెండు చుక్కల టీ ట్రీ ఆయిల్ మరియు రెండు చుక్కల ఆలివ్ ఆయిల్ వేసి కలిపి మిశ్రమాన్ని రోజుకి రెండు మూడు సార్లు దూదితో రాయాలి. (రాసిన ప్రతిసారీ రెండు చుక్కల టీ ట్రీ ఆయిల్ మరియు రెండు చుక్కల ఆలివ్ ఆయిల్ వేయాలి) శరీరం మీద, ముఖం మీద, మెడ మీద, జననేంద్రియాల మీద ఉన్న పులిపుర్లు పోవాలంటే టీ ట్రీఆయిల్ 2 చుక్కలు, ఆలివ్ ఆయిల్ 2 చుక్కలు కలిపి దూదితో వాటిపై రాయాలి.
శరీరంలోని చెమట పట్టి దుర్గందం అధికంగా వచ్చేవారికి టీ ట్రీ ఆయిల్ ఎంతగానో ఉపయోగపడుతుంది. టీ ట్రీఆయిల్ 2 చుక్కలు, ఆలివ్ ఆయిల్ 2 చుక్కలు కలిపి ఏఏ భాగాలలో చెమట అధికంగా పడుతుందో అక్కడ దూదితో అద్దడం ద్వారా శరీరంలో ఉన్న దుర్వాసన్ని, ఎక్కువగా చెమటలు పట్టే గుణాన్ని కూడా అరికట్టవచ్చు.
నోటి దుర్వాసన ఉన్న వాళ్ళు టూత్ పేస్టు మీద ఈ టీ ట్రీ ఆయిల్‌ని వేసుకొని పళ్ళు తోముకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ టీ ట్రీ ఆయిల్‌ని మింగకూడదు. అదే కాకుండా గోరువెచ్చటి నీళ్ళలో ఈ టీ ట్రీ ఆయిల్‌ని 2 చుక్కలు వేసి నోట్లో పుక్కిలించడం వల్ల కూడా నోటి దుర్వాసనను అరికట్టవచ్చు.
Also Read: పత్తి పంటలో సమగ్ర యాజమాన్య విధానాలను పాటిస్తే మేలు.!