ఆరోగ్యం / జీవన విధానం

Medicinal Plant Nela Usiri Benefits: నేల ఉసిరిలో దాగున్న నమ్మలేని ఔషధ గుణాలు!

2
Nela Usiri Benefits
Nela Usiri Benefits

Medicinal Plant Nela Usiri Benefits: ప్రకృతిలో మనకు తెలియని ఎన్నో రకాల ఔషధ మొక్కలు ఉన్నాయి, అలాంటి మొక్కల్లో ఒకటే “నేల ఉసిరి”. కేవలం ఈ ఒక్క మొక్కతో ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు సమకూరుతాయి. ఆకులు, పువ్వులు, కాయలు, కాండం, వేర్లు ఇలా దాదాపు నేల ఉసిరి మొక్క యొక్క అన్ని భాగాల్లో ఔషధ గుణాలను కలిగి ఉంటుంది. దీనిలో లభించే ఎన్నో రకాల ఔషధ గుణాల వల్ల పూర్వ కాలం నుండి దీన్ని ఆయుర్వేదంలో వివిధ జబ్బులను, వ్యాధులను నయం చేయడానికి ఉపయోగిస్తున్నారు. అందువల్ల ఆయుర్వేదంలో నేల ఉసిరికి ప్రత్యేక స్థానం ఉంది. ఈ నేల ఉసిరిని చాలా రకాల మందుల తయారీలో వినియోగిస్తారు.

నేల ఉసిరి మొక్క యొక్క ఆకులు, చిగుళ్ల వాపు, పంటి నొప్పి, చిగుళ్ల నుండి రక్తం కారడం వంటి నోటి సమస్యలకు అద్భుతమైన నివారిణిగా పని చేస్తుంది. చర్మంపై వచ్చే దురదను నయం చేయడంలో కూడా నేల ఉసిరి ఆకులు మంచి ఫలితాన్ని ఇస్తాయి. కాలేయ ఆరోగ్యాన్ని కాపాడడంలో నేల ఉసిరి కీలక పాత్ర పోషిస్తుంది. హెపటైటిస్ మరియు కామెర్లు వంటి కాలేయ సంబంధిత సమస్యలను నివారించడంలో ఈ మొక్క ప్రయోజకరంగా ఉంటుంది.

Also Read: Tikka Leafspot in Rabi Groundnut: రబీ వేరుశనగలో ‘‘తిక్కాకు మచ్చ’’ తెగుళ్ల యాజమాన్యం

Medicinal Plant Nela Usiri Benefits

Medicinal Plant Nela Usiri Benefits

ఎసిడిటీ వంటి జీర్ణ సమస్యలను నివారించడంలో కూడా ఈ నేల ఉసిరి దివ్యమైన ఔషధంగా పని చేస్తుంది. శరీరంపై అయే గాయాలను నయం చేయడానికి నేల ఉసిరి ఆకుల రసాన్ని ఉపయోగించవచ్చు. కిడ్నీల్లో వచ్చే రాళ్లు మరియు ఇతర కిడ్నీ సంబంధిత సమస్యలను నివారించడంలో కూడా నేల ఉసిరి ప్రయోజకరంగా ఉంటుంది.

మధుమేహం ఉన్నవారు నేల ఉసిరితో చేసిన జ్యూస్ ని సేవిస్తే మంచి ఫలితం ఉంటుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. నేల ఉసిరిలో రక్తంలోని గ్లూకోస్ స్థాయిలను నియంత్రించగల సామర్థ్యం ఉంటుంది. నేల ఉసిరి యొక్క ఆకులు ఆకలిని పెంచడంలో కూడా తోడ్పడతాయి. నేల ఉసిరి మలబద్దకాన్ని తగ్గించి జీవక్రియను మెరుగుపరచడంలో కూడా సహాయపడుతుంది. నేల ఉసిరి యాంటిబ్యాక్టీరియల్ మరియు యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంటుంది, కావున జ్వరాలను నయం చేయడంలో కూడా ఇది ఎంతగానో తోడ్పడుతుంది. కేవలం మనుషులకే కాకుండా పశువులకు కూడా ఈ నేల ఉసిరి ఎంతగానో తోడ్పడుతుందని నిపుణులు చెబుతున్నారు. పశువుల్లో వచ్చే కంటి నీరు సమస్యను నివారించడానికి నేల ఉసిరి యొక్క ఆకుల రసాన్ని వాటి కళ్ళలో వేస్తే ఆ సమస్య తగ్గుతుందని నిపుణులు సూచిస్తున్నారు.

Also Read: Jaggery Value Addition Products: ఆధునిక బెల్లం తయారీ, విలువ ఆధారిత బెల్లం ఉత్పత్తులు.!

Leave Your Comments

Jaggery Value Addition Products: ఆధునిక బెల్లం తయారీ, విలువ ఆధారిత బెల్లం ఉత్పత్తులు.!

Previous article

PM Kisan FPO Yojana: రైతుల కోసం 15 లక్షల రూపాయలను అందిస్తున్న కేంద్ర ప్రభుత్వం.!

Next article

You may also like