Animal Husbandry: సండే వచ్చిందంటే చాలు ఇంట్లో కచ్చితంగా చికెన్ వండాల్సిందే.. ముక్క నోట్లో దిగాల్సిందే. షాపుకు వెళ్లి చికెన్ తెచ్చుకుని రోస్ట్, కర్రీ, ఫ్రై, పకోడి ఇలా రకరకాలుగా వండుకుని లొట్టలేసుకుంటూ మరి తింటుంటాం. అయితే మీకు ఈ విషయం తెలుసా?.. కోళ్ల పెంపకంలో యాంటీబయాటిక్స్ ఎక్కువగా ఉపయోగించడం వల్ల సమస్యలు ఎదురవుతున్నాయట. బంగ్లాదేశ్ (Bangladesh) లో ఇటీవలే మితిమీరిన యాంటీ బయాటిక్‌ల వినియోగంతో సూపర్‌బగ్స్ ఏర్పడుతున్నాయని నిపుణలు తెలిపారు. సంప్రదాయ చికిత్సా పద్దతిలో దీన్ని నివారించడం అసాధ్యమని అంటున్నారు.
తాజా అధ్యయనం ప్రకారం.. ఈ డోస్‌లో ఇమ్యునిటీ పవర్ 6.7 నుంచి 100 శాతం వరకు ఉంటుంది. అది ఇంజెక్ట్ చేసిన కోళ్లను తింటే.. ప్రజలు ఆరోగ్యంతో చెలగాటం అడుకున్నట్లే. పౌల్ట్రీ, జంతువుల పేగుల్లో నివసించే ఇటువంటి బ్యాక్టీరియా.. మనషి శరీరంలో చేరితే చావు తప్పదని అధ్యయనాలు చెబుతున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ వివరణ ప్రకారం.. సాల్మొనెల్లా అనే బ్యాక్టీరియా మనిషికి చాలా ప్రమాదరకం.. అయితే, బాయిలర్ కోళ్లకు యాంటీబయాటిక్స్ అధికంగా ఉపయోగించడం వల్ల.. వాటిల్లో ఈ బ్యాక్టీరియా విస్తరిస్తుంది. అలా వాటినే మనం కూడా తింటున్నాం.
Also Read: కివీ ఫ్రూట్ తో ఎన్నో రకాల ఆహారపదార్ధాల తయారీ
నిజానికి యాంటీబయాటిక్స్ ప్రజల ప్రాణాలను కాపాడేందుకు ఉపయోగపడతాయి. 1940లో వచ్చిన పెన్సిలిన్ మొదలుకుని.. అనేక యాంటీ బయాటిక్స్ ప్రస్తుతం వైద్య చికిత్సలో ఎంతో ఉపయోగపడుతున్నాయి. ఇవే శరీరంలోని వైరస్, ఫంగస్‌లను నాశనం చేస్తుంటాయి. అయితే, కాలక్రమంలో చెడు బ్యాక్టీరియా యాంటీ బయోటిక్స్‌ను కూడా తట్టుకుంటూ.. మరింత శక్తివంతంగా మారుతున్నాయి.
మరికొంత కాలానికి అసలు చిన్న చిన్న జబ్బులకు కూడా మందు కనిపెట్టలేని స్థాయికి చేరుకుంటాయని అధ్యయనాలు హెచ్చరిస్తున్నాయి. ఇలా వైద్యానికి కూడా లొంగని బ్యాక్టీరియానే సూపర్‌బగ్స్ అని పిలుస్తుంటారు. ఇప్పటికే కరోనా ప్రపంచాన్నే అతలాకుతలంచేసి పడేసింది. ఇప్పుడు స్వలాభం కోసం మనిషి చేసే యుద్ధంలో మనిషే చివరకు బలైపోతున్నాడన్న విషయం మాత్రం తెలుసుకోలేకపోతున్నాడు.
Also Read: వేడి కారణంగా భారీగా తగ్గిన కోడిగుడ్ల ధరలు