Golden Rice: ఆసియా దేశాల్లో వరిని విస్తరంగా పండిస్తారు. అనేక ప్రాంతాలలో ప్రజల్లో విటమిన్ ‘‘ఎ’’ లోపం విస్తారంగా కనిపిస్తుంది. ఈ కారణంగా ఏటా 20`30 లక్షల మంది పిల్లలు కంటి చూపును కోల్పోతున్నారు. విటమిన్ ‘‘ఎ’’ బియ్యంలో ఉండదు. అందువలన విటమిన్ ‘‘ఎ’’ ను అందించేలా వరి వంగడానికి జన్యు మార్పిడి చేయటమే ఈ సమస్యకు పరిష్కారం.
బీటా కెరోటిన్ అనే యాంటీ ఆక్సిడెంట్‌ను అందిస్తే కావాల్సిన మేర విటమిన్ ‘‘ఎ’’ ను దేహమే తయారు చేసుకుంటుంది. ఇందు కోసం బీటా కెరోటిన్‌తో కూడిన వరిని రూపొందించడానికి ఇంగో పొట్రికాస్ మరియు పీటర్ బేయర్ శాస్త్రవేత్తలు 1999లో శ్రీకారం చుట్టారు. మట్టిలో మైక్రో జీవుల ద్వారా మొక్క జొన్న గింజలు నుండి తీసిన రెండు జన్యువుల ద్వారా వరి వంగడానికి జన్యుమార్పిడి ప్రకియ ద్వారా జోడిరచారు. జన్యుమార్పిడి బియ్యపు గింజలు లేత నారింజ రంగులో ఉంటాయి. కాబట్టి గోల్డెన్ రైస్ అనే పేరు వచ్చింది.
Also Read: జీవ నియంత్రణ పద్ధతుల ద్వారా హానికారక పురుగుల నివారణ.!
రాక్ ఫిల్లర్ ఫౌండేషన్, గేట్స్ ఫౌండేషన్, సింజేట ఫౌండేషన్ వంటి సంస్థలు గోల్డెన్ రైస్ రూపకల్పనకు 20 ఏళ్ల క్రితమే నడుం బిగించారు. ఫిలిప్పీన్స్‌లోని అంతర్జాతీయ వరి పరిశోధనా కేంద్రంగా గోల్డెన్ రైస్ పరిశోధనలు కొనసాగాయి.
రోజుకు 40 గ్రా. గోల్డెన్ రైస్ తినిపిస్తే పిల్లలు కంటి చూపును, ప్రాణాలను కాపాడటానికి మేలు చేస్తాయి అని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు.
బాల్యపోషకాహారలోపాన్ని తగ్గిచండంలో సహాయపడే గోల్డెన్ రైస్ యొక్క వాణిజ్య ఉత్పత్తికి అనుమతి పొందిన దేశాల్లో ప్రపంచంలో మొట్టమొదటి దేశంగా ఫిలిప్పీన్స్ నిలిచింది. అంతర్జాతీయ వరి పరిశోధనా సంస్థ భాగస్వామ్యంతో డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చరల్, ఫిలిప్పీన్స్ రైస్ రిసెర్చ్ ఇన్స్టట్యూట్ గోల్డెన్‌రైస్‌ను అభివృద్ధి చేసింది.
Also Read: మిరప నారుమళ్లు – తీసుకోవలసిన జాగ్రత్తలు.!