Benefits of Coriander : వంటగదిలో ఉన్న ఔషధాల మేలు గురించి మనం చెప్పాల్సిన అవసరం లేదు. ఎన్నో రకాల సుగంధ ద్రవ్యాలు మన ఆరోగ్యానికి మేలు చేస్తాయి. అందులో ధనియాల పాత్ర ఎంతో ఉంది. ధనియాలను నీటిలో మరిగించి ఆ నీళ్లను తాగితే ఇంకా ఎక్కువ ప్రయోజనం ఉంటుంది అంటున్నారు ఆరోగ్య నిపుణులు. మరి ధనియాలు మరిగించి ఆ మిశ్రమాన్ని తాగితే కలిగే ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
మన పూర్వీకులు జ్వరం, దగ్గు లేదా పొట్టలో అనీజీగా వుంటే ధనియాలు, మిరియాలతో చేసిన కషాయం తాగమని చెప్తుంటారు. ప్రస్తుతం అందరికి ఆరోగ్యంపై శ్రద్ధ పెరగడంతో అందరూ మన పూర్వీకుల సలహాలు పాటిస్తున్నారు. ధనియాల నీటిని తయారు చేసుకోడానికి ఒక పాత్రలో నీటిని తీసుకుని అందులో కొన్ని ధనియాలను వేసి బాగా మరిగించాలి. నీరు బాగా మరిగాక స్టవ్ ఆర్పి నీటిని వడకట్టాలి. అనంతరం అందులో అవసరం అనుకుంటే తేనె, నిమ్మరసం కలపవచ్చు. ఇలా తయారు చేసుకున్న మిశ్రమాన్ని రోజూ ఉదయం, సాయంత్రం తాగాలి. దీంతో పలు అనారోగ్య సమస్యల నుంచి బయట పడవచ్చు.
- కిడ్నీల్లో ఉండే వ్యర్థాలు బయటకు పోతాయి. కిడ్నీలు శుభ్రంగా మారుతాయి.
- శరీరంలోని వేడి తగ్గుతుంది.
- ధనియాల నీటిని తాగడం వల్ల లివర్ ఆరోగ్యంగా ఉంటుంది. జీర్ణవ్యవస్థలోని వ్యర్థాలు బయటకు వెళ్లిపోతాయి.
- సులువుగా బరువు తగ్గవచ్చు.
- ఉదర సమస్యలు కూడా తగ్గుతాయి.
- శరీర నొప్పుల నుంచి విముక్తి పొందవచ్చు
- శరీరంలో నీటిశాతాన్ని తగ్గకుండా డీహైడ్రేషన్‌కు గురికాకుండా చేస్తుంది.
- నీరసం, బలహీనతను పారద్రోలుతుంది.
- కిడ్నీ, చర్మ, జట్టు సంబంధిత వ్యాధులను దూరం చేస్తాయి.

Health Tips From Eruvaaka
అందుకే వైద్య నిపుణులు ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం రెండు పూటలా దనియాల నీటిని తాగాలని సూచిస్తున్నారు. దీంతోపాటు ధనియాల పౌడర్ కూడా వాడవచ్చు. అయితే.. ఉదయాన్నే పరిగడుపున ధనియాల నీరు తాగితే మంచి ఫలితం ఉంటుంది.
Health Tips, Benefits of Coriander, Agriculture News, Eruvaaka