ఆరోగ్యం / జీవన విధానం

తెలంగాణాలో పప్పు ధాన్యాల కొరత…

0
Pulses
Pulses

Shortage of pulses in Telangana ఆరోగ్యంగా లేని ఇల్లు ఆస్పత్రితో సమానం అంటుంటారు మన పెద్దలు. ఆరోగ్యంగా ఉంటేనే ఏదైనా చేయగలం, ఏదైనా సాధించగలం. అయితే ఆరోగ్యంగా ఉండాలంటే రోజు జిమ్ములు, ఎక్సరసైజులు చెయ్యాల్సిన అవసరం లేదు. మనం చేయాల్సిందల్లా మనం తీసుకునే ఆహారంలో కొన్ని రకాల మార్పులు చేస్తే సరిపోతుంది. రోజు ఒకే ఆహారం తీసుకోవడం వల్ల శరీరంలో ఎటువంటి మార్పులు జరగవు. మానవ శరీరానికి రోజుకి దాదాపు 54 గ్రాముల పప్పు ధాన్యాలు అవసరం. రోజుకి 54 గ్రాముల పప్పు ధాన్యాలు ఆహారంలో తీసుకోవడం వల్ల మనిషి పూర్తి ఆరోగ్యంగా ఉంటాడని చెప్తుంది జాతీయ వైద్య పరిశోధన మండలి.

Shortage of pulses

Telangana Pulses Issue రోజుకి ఆహారంలో 54 గ్రాముల పప్పు ధాన్యాలను ఉండేలా చూసుకోవాలి. కానీ మన దేశంలో ప్రస్తుతం అలంటి పరిస్థితి కనిపించడం లేదు. ప్రస్తుతం దేశంలో తలసరి లభ్యత రోజుకు 42 గ్రాములని కేంద్ర వ్యవసాయశాఖ పేర్కొంది. ఇందుకు కారణాలు చూస్తే ప్రధానంగా విత్తనాల కొరత స్పష్టంగా కనిపిస్తుంది. తెలంగాణాలో పప్పు ధాన్యాల సాగుకు విత్తనాలు కావాలంటే ప్రైవేటు కంపెనీలపైన ఆధారపడాల్సి ఉంది. గత ఖరీఫ్ సీజన్ లో పప్పు ధాన్యాల పంటల సాగుకు రాష్ట్ర రైతులకు 14 లక్షల క్వింటాళ్ల విత్తనాలు అవసరం ఉండగా.. ప్రభుత్వ సంస్థల్లో కేవలం 5.90 లక్షల క్వింటాలే అందుబాటులో ఉన్నాయి. దీంతో ప్రైవేటు కంపెనీలే దిక్కయ్యాయి. Health Benefits Of Pulses

Shortage of pulses

భోపాల్‌లో శుక్రవారం పప్పుధాన్యాల్లో స్వయం సమృద్ధి పేరుతో జాతీయ సదస్సు జరిగింది. ప్రజలకు అందుబాటులో ఉన్న పప్పుధాన్యాలు రాష్ట్రాల వారీగా ఈ పంటలకు అందుబాటులో ఉన్న నాణ్యమైన విత్తనాల లెక్కలను ఈ సదస్సులో వివరించారు.

icmr

గతేడాది(2020-21)లో దేశవ్యాప్తంగా 2.57 కోట్ల టన్నుల పప్పుధాన్యాల పంటల దిగుబడి వచ్చింది. కానీ, దేశ ప్రజల అవసరాలకు 2.79 కోట్ల టన్నులు అవసరమని తేలింది. 24.70 లక్షల టన్నులను విదేశాల నుంచి దిగుమతి చేసుకున్నారు. 2025 నాటికల్లా 2.94 కోట్ల టన్నులు, 2030 నాటికి 3.20 కోట్ల టన్నుల పప్పుధాన్యాలు దేశప్రజలకు అవసరం పడనున్నాయి. అంతమేర ఈ పంటలను పండించేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. Shortage of pulses in Telangana

Leave Your Comments

రైతులకు గుడ్ న్యూస్ చెప్పిన సీఎం కేసీఆర్

Previous article

ఆరోగ్యానికి అమృతంగా పని చేసే కాకరకాయ

Next article

You may also like