ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న నాన్ కమ్యూనికబుల్ (ఒకరి నుండి ఒకరికి సంక్రమించని వ్యాధి) వ్యాధులలో మధుమేహం అతి పెద్ద సమస్య. దీనిని షుగర్, డయాబెటిస్ మరియు చక్కెర వ్యాధి అని కూడా పిలుస్తారు. ప్రస్తుత కాలంలో ఏర్పడిన జీవన మరియు ఆహారంలోని మార్పుల వల్ల సమాజంలో మధుమేహంతో బాధపడే వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతుంది. ఇంటర్నేషనల్ డయాబెటిస్ ఫెడరేషన్ ప్రకారం ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 540 మిలియన్ల ప్రజలు మధుమేహంతో బాధపడుతున్నారు. ఈ సమస్య 2045 సంవత్సరం నాటికి ప్రతి ఎనిమిది మందిలో ఒక్కరికి ఉంటుందని, క్రమంగా మధుమేహంతో బాధపడే వారి సంఖ్య 783 మిలియన్లకు చేరుతుందని నిపుణుల అభిప్రాయం. దాదాపు 90% ప్రజలు టైప్-2 డయాబెటిస్ తో జీవిస్తున్నారు. మధుమేహంతో బాధపడుతున్న వారి సంఖ్యలో భారతదేశం రెండవ స్థానంలో ఉంది.
మధుమేహ లక్షణాలు: మధుమేహం అనేది అని యం 1 తిత మెటబాలిజం వలన కలిగే ఒక దీర్ఘకాలిక సమస్య. ఇన్సులిన్ ఉత్పత్తి, జన్యువులలో లోపాలు, శారీరక శ్రమ లేకపోవడం, స్థూలకాయం, జీవన మరియు ఆహారపు అలవాట్లలో మార్పులు వంటి అనేక మధుమేహా కారణాలు ఉన్నాయి. ఈ సమస్యతో బాధపడుతున్న వారిలో కారణం లేకుండా బరువు పెరగడం, అతిగా దాహం మరియు ఆకలి వేయడం మరియు అతిగా మూత్రవిసర్జన వంటి లక్షణాలు ఉంటాయి. మధుమేహం ఒక్కసారి వస్తే దానిని నియంత్రణలో ఉంచుకోవడం తప్ప పూర్తిగా నయం చేసే వీలుండదు. మధుమేహాన్ని సకాలంలో గుర్తించి నియంత్రించకపోతే, ఇతర కంటి, గుండె, నరాలు మరియు మూత్రపిండ వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది. అందుకే మధుమేహాన్ని “సైలెంట్ కిల్లర్” గా పిలుస్తారు. ప్రతి సంవత్సరం మధుమేహంపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు నవంబర్ 14వ తేదీ ప్రపంచ మధుమేహ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు.
మధుమేహాన్ని కంట్రోల్ చేయడంలో ఆహారం ప్రధాన పాత్ర పోషిస్తుంది. మధుమేహం కలవారు తక్కువ పిండి పదార్థాలు, ఎక్కువ ప్రోటీన్లు మరియు ఆరోగ్యకరమైన కొవ్వు పదార్థాలు ఆహారంలో తీసుకోవడం ద్వారా రక్తంలో చక్కెర స్థాయి అదుపులో ఉంటుంది.
చిరుధాన్యాలు – ఇవి నిజానికి ఆరోగ్యాన్ని ఇచ్చే సిరి ధాన్యాలని చెప్పవచ్చు. గతంతో పోల్చితే ప్రజల్లో చిరుధాన్యాల పైన అవగాహాన బాగా పెరిగింది. రోజువారి ఆహారంలో మిల్లెట్స్ని చేర్చుకోవాలని జాతీయ పౌష్టికాహార పరిశోధన సంస్థ (NIN) కూడా సూచించింది. చిరుధాన్యాలను ఆహారంలో తీసుకోవడం ద్వారా ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. మధుమేహంతో బాధపడుతున్న వారికి మిల్లెట్స్ ఒక సూపర్ ఫుడ్ అని చెప్పవచ్చు. వీటిలో ఉండే అధిక పీచు పదార్థాలు, తక్కువ గ్లైసమిక్ ఇండెక్స్, రక్తంలోని షుగర్ లెవెల్స్ నియంత్రణలో ఉంచుతాయి.
ఈ విధంగా ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నప్పటికీ, వీటిని రోజువారి ఆహారంలో తీసుకునే వారి సంఖ్య చాలా తక్కువ అని చెప్పవచ్చు. ఎందుకనగా, చిరుధాన్యాలను ఎక్కువగా కాలం నిలువ చేయడం మరియు వండుకోవడం ఒక పెద్ద సవాలు. వీటిపై అవగాహనమరియు ఆసక్తికరమైన ఉత్పత్తులు తయారీ చేసే విధంగా యునైటెడ్ నేషన్స్ 2023 సంవత్సరంని “ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ మిల్లెట్స్” గా గుర్తించింది. దీని ద్వారా చిరుధాన్యాల ఉత్పత్తి భారతదేశంలో బాగా పెరిగింది. చిరుధాన్యాల ఆధారిత ఉత్పత్తులు కూడా మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. సాధారణంగా మధుమేహం అనగానే అన్నం తినకూడదు కేవలం గోధుమలు, రాగిజావ వంటివి మాత్రమే తీసుకోవాలని అంటారు. కానీ, అది కేవలం అపోహ మాత్రమే. అన్నం, గోధుమలు మరియు చిరుధాన్యాల్లోనూ ఉండేవి పిండి పదార్థాలు మాత్రమే. కావున చిరుధాన్యాలను కూడా సరైన విధానంలో ప్రాసెసింగ్ చేయడం, సరైన మోతాదులో మరియు సరైన పదార్థాలలో వాడడం ద్వారా వీటిలోని సంపూర్ణ ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. మార్కెట్లో లభించే అన్ని చిరుధాన్యాల ఆధారిత ఉత్పత్తులు మధుమేహంతో జీవించే వారికి ఉపయోగకరం కాదు. కావున వాటిని ఆహారంగా తీసుకునే ముందు గ్లైసిమిక్ ఇండెక్స్ (GI), మరియు గ్లైసిమిక్స్ లోడ్ (GL) అని రెండిటిని ప్రామాణికంగా చేసుకొని ఆహార పదార్థాలను ఎంచుకోవాల్సి ఉంటుంది. ఉదా:- గ్లైసిమిక్ ఇండెక్స్ 0-55 ఉంటే తక్కువ, 55-69 ఉంటే మధ్యస్తం మరియు 69-100 ఉంటే ఎక్కువ అని వర్గీకరించారు.
చిరుధాన్యాలు మరియు వివిధ చిరుధాన్యాల ఉత్పత్తుల గ్లైసేమిక్ ఇండెక్స్ తక్కువ అనగా 0-55 ఉండే ఫుడ్స్ ని మాత్రమే మధుమేహంతో జీవించేవారు తీసుకోవాలి. చిరుధాన్యాల ఉత్పత్తులలో ఎక్కువ గ్లైసిమిక్ ఇండెక్స్ ఉంటే వాటిని తీసుకోవడం ద్వారా ఎటువంటి ప్రయోజనం ఉండదు. కావున సరైన ఆహార పద్ధతులలో పాటు వ్యాయామం మరియు జీవన శైలిలో కొన్ని మార్పులు చేర్పులు చేయటం ద్వారా మధుమేహం నివారణకు మరియు నియంత్రణకు సహాయపడతాయి.
గ్లైసేమిక్ ఇండెక్స్ 0-55 (↓) 55-69 (—) 69-100(↑) | ||
చిరుధాన్యాలు
|
చిరుధాన్యాల ఉత్పత్తులు | గ్లైసిమిక్ ఇండెక్స్
|
1. చిరుధాన్యాలతో చేయబడిన రవ్వ
|
జొన్న రవ్వ (36-40) | ↓ |
రాగి రవ్వ (38-42) | ↓ | |
సజ్జ రవ్వ (65-69) | — | |
కొర్ర రవ్వ (55-60) | — | |
కిచిడి (42-48) | ↓ | |
మిల్లెట్ ఇడ్లీ (50-50) | — | |
రైస్ ఇడ్లీ (72-78) | ↑ | |
2. చిరుధాన్యాల పిండి
|
జొన్న రొట్టె (58-65) | — |
గోధుమ రొట్టె (60-65) | — | |
మల్టీ గ్రైన్ రోటి (45-52) | ↓ | |
రాగి మాల్ట్ (44-68) | — | |
రాగి సంగటి (50-55) | ↓ | |
3. బేకరీ ఉత్పత్తులు
|
సజ్జ బిస్కెట్స్ (52-55) | ↓ |
జొన్న బిస్కెట్స్ (34-38) | ↓ | |
కొర్ర బిస్కెట్స్ (26-32) | ↓ | |
4. చిరుధాన్యాల ఆధారిత ఎక్స్ ట్రూజనల్ ఉత్పత్తులు
|
రాగి సేమ్యా (70-75) | ↑ |
జొన్న సేమ్యా (65-72) | ↑ | |
కొర్ర సేమ్యా (75-85) | ↑ | |
పాస్తా (78-85) | ↑ | |
నూడిల్స్ (65-70) | ↑ |