Acacia Tree Medicinal Uses: సాధారణంగా తుమ్మ చెట్టుని మనం వంట చెరుకుగానే ఉపయోగిస్తాం, కానీ ఈ చెట్టుని భారతదేశ ఆయుర్వేదంలో పూర్వం నుండి అనేక రకాల రోగాలను నయం చేయడానికి ఉపయోగిస్తున్నారు. ఈ తుమ్మ చెట్టు యొక్క శాస్త్రీయ నామం “అకేసియా నిలోటికా”. దాదాపుగా ఈ చెట్టు యొక్క అన్ని భాగాలను మందుల తయారీలో వాడుతారు. ఈ చెట్టు యొక్క అన్ని భాగాల్లో మన శరీరానికి కావాల్సిన విటమిన్లు, ఖనిజాలు, మినరల్స్ లభిస్తాయి.
ముఖ్యంగా తుమ్మ చెట్టు అన్ని భాగాల్లో పీచు పదార్థం, ఫైబర్, ప్రోటీన్లు మరియు టానిన్లు కూడా లభిస్తాయి. తుమ్మ చెట్టు యొక్క గమ్ సహజంగా అంటుకునే ఆకృతిని కలిగి ఉంటుంది. ఈ గమ్ తో కూడిన పదార్థాలు చికాకు మరియు వాపును తగ్గించడంలో తోడ్పడతాయి. కడుపు లేదా గొంతు అసౌకర్యాన్ని తగ్గించడంలో కూడా ఈ గమ్ ముఖ్యంగా ప్రభావవంతంగా పని చేస్తుందని పరిశోధనలు చూపిస్తున్నాయి.
Also Read: Tunikaku Collection: తునికాకు సేకరణకు వేళాయెరా.!

Acacia Tree Medicinal Uses
తుమ్మ చెట్టు యొక్క ఉత్పత్తులను తరచుగా గాయాలను నయం చేయడానికి ఉపయోగిస్తారు. దీనిలో ఉండే ఆల్కలాయిడ్లు, ఫ్లెవనాయిడ్లు గాయాలను నయం చేయడంలో కీలక పాత్ర పోషిస్తాయి. దంతాల సంరక్షణలో తుమ్మ చెట్టు ఉత్పత్తులను ఎక్కువగా ఉపయోగిస్తారు. దంతాల సంరక్షణకు ఉపయోగించే పేస్ట్ మరియు ఇతర ఉత్పత్తులలో ఈ తుమ్మ చెట్టు యొక్క పొడిని ఉపయోగిస్తారు.
Also Read: Broccoli Health Benefits: వేసవిలో తప్పక తినాల్సిన కూరగాయల్లో ఇది ఒకటి.!
తుమ్మ చెట్టు యొక్క గమ్ మొత్తం శరీర కొవ్వును తగ్గించి, మీ బరువుని నియంత్రణలో ఉంచుతుంది. అలాగే వీటి ఉత్పత్తులను దగ్గుని నియంత్రించడంలో కూడా ఉపయోగిస్తారు. గాయాలైనప్పుడు వచ్చే రక్త ప్రవాహాన్ని ఆపడానికి తుమ్మ చెట్టు యొక్క గమ్ తో చేసిన టీని పోస్తే ప్రభావవంతంగా పని చేస్తుంది.
Also Read: Arjuna Tree Medicinal Uses: అర్జున చెట్టు వల్ల కలిగే అద్భుతమైన ఔషధ ఉపయోగాలు తెలుసా?

Medicinal Properties and Benefits of Acacia Tree
తుమ్మ చెట్టు యొక్క ఆకుల నుండి తీసిన సారం కంటి నొప్పిని నివారించడంలో సహాయపడుతుంది. దీని పువ్వుల నుండి తీసిన పొడిని కామెర్లను తగ్గించడానికి ఉపయోగిస్తారు. దీని ఆకుల యొక్క సారం వీరేచనాలను నయం చేయడంలో సహాయపడుతుంది. గర్భంతో ఉన్న మహిళలలో శారీరక శక్తిని పెంపొందించడానికి దీని పౌడర్ ని వాడుతారు. దీని పువ్వుల యొక్క పౌడర్ ని ఎక్జిమా వంటి చర్మ సమస్యలను తగ్గించడానికి కూడా వాడుతారు.
Also Read: Bael Tree (Maredu) Sharbat: వేసవి కాలంలో మంచి ఉపశమనం కలిగించే మారేడు కాయ షర్బత్ గురించి తెలుసా?
Also Watch: