Neera Health Benefits: నీరా… అచ్ఛం చూడడానికి కొబ్బరి నీళ్ళ వలె ఉండే ఈ నీరా రుచి పరంగా తియ్యగా ఉంటుంది. నీరాని తాటి, ఈత, ఖర్జూర చెట్ల నుండి తీస్తారు. తాజా నీరాలో ఆల్కహాల్ కంటెంట్ ఉండదు కాబట్టి నీరాలో మత్తు కలిగించే గుణాలు ఏవి ఉండవు. కావున ఈ నీరాను పెద్ద చిన్న అని తేడా లేకుండా ఎవరైనా తాగావచ్చు. ప్రకృతి ప్రసాదించిన ఈ నీరాలో మన ఆరోగ్యానికి కావాల్సిన ఎన్నో రకాల పోషకాలు లభిస్తాయి. నీరాను ఎక్కువగా గ్రామంలో ఉండే ప్రజలు సేవిస్తూ ఉంటారు, అయితే పట్టణ ప్రజలకు కూడా దీన్ని అందుబాటులోకి తీసుకురావాలనే ఉద్దేశ్యంతో తెలంగాణ ప్రభుత్వం నీరా కేఫ్ లను ప్రారంభించింది. కాబట్టి ఇప్పుడు ఈ నీరా అందించే ఆరోగ్య ప్రయోజనాలను అందరూ పొందవచ్చు.
100గ్రా. నీరాలో: కార్బోహైడ్రేట్లు – 15 గ్రా, ప్రోటీన్ – 0.06 గ్రా, కేలరీలు – 55 కిలో కేలరీలు, ఫ్యాట్ – 0 గ్రా, విటమిన్ సి – 20 mg, తయామిన్ – 77 mg, మెగ్నీషియం – 2.9 mg, ఐరన్ – 0.05 mg, పొటాషియం – 168.4 mg, సోడియం – 90.6 mg, జింక్ – 0.02 mg, కాపర్ – 0.03 mg లభిస్తాయి. సాధారణంగా నీరాను సూర్యోదయం కాకముందే సేకరిస్తారు.
Also Read: Rythu Bandhu: రైతన్నలకు శుభవార్త చెప్పిన తెలంగాణ ప్రభుత్వం… జూన్ నెలలో రైతుబంధు నగదు జమ!
నీరాలో లభించే విటమిన్ సి మరియు ఇతర పోషకాలు రోగనిరోధక శక్తిని పెంపొందించడంలో అద్భుతంగా సహాయపడతాయి. మధుమేహం ఉన్నవారు రోజు ఈ నీరాని తాగితే మంచి ఫలితం ఉంటుందని పరిశోధనలో తేలింది. నీరాలో విటమిన్ సి వంటి ఫైటోకెమికల్స్ మరియు యాంటీఆక్సిడెంట్ల కంటెంట్ అధిక మొత్తంలో ఉంటుంది, ఇది మన శరీరంలోని ఊపిరితిత్తుల క్యాన్సర్, నోటి కుహరం క్యాన్సర్ మరియు పెద్దప్రేగు క్యాన్సర్ వంటి వివిధ రకాల క్యాన్సర్లను నిరోధించడంలో సహాయపడుతుంది.
నీరాలో పొటాషియం పుష్కలంగా ఉంటుంది, ఇది మన శరీరంలో రక్త ప్రసరణ సరిగ్గా జరిపి రక్తపోటును నియంత్రణలో ఉంచడానికి సహాయపడుతుంది. నీరాలో యాంటీ బ్యాక్టీరియల్ మరియు యాంటీ ఆక్సిడెంట్ గుణాలు కూడా ఉన్నాయి, ఇవి వివిధ రకాల చర్మ సంబంధిత సమస్యలను నివారించడంలో ప్రయోజకరంగా ఉంటాయి. ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే ఆక్సీకరణ నష్టం నుండి మన చర్మాన్ని రక్షించడంలో నీరా సహాయపడుతుంది. నీరాలో పుష్కలంగా లభించే విటమిన్ సి మన కళ్ళ ఆరోగ్యానికి చాలా మంచిది మరియు అలాగే ఇది కంటి చూపును మెరుగుపరచడంలో సహాయపడుతుంది. నీరాను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల కంటి చూపు మెరుగుపడుతుందని మరియు కంటిశుక్లం మరియు మచ్చల క్షీణత వంటి వివిధ రకాల కంటి సంబంధిత వ్యాధులను నివారించడంలో సహాయపడుతుందని చాలా అధ్యయనాలు వెల్లడించాయి. ఆస్తమా, టీబీ మరియు ఇతర ఊపిరితిత్తుల సమస్యలున్న వారికి కూడా ఈ నీరా మంచి ఫలితాలను ఇస్తుంది.
Also Read: Summer Sunstroke in Cattles: వేసవిలో పశువులకు వడదెబ్బ తగలకుండ ఉండడానికి తీసుకోవలసిన జాగ్రత్తలు.!