Asafoetida Health Benefits: ఇంగువ దీనినే హింగ్ ఆంగ్లంలో అసాఫోటిడా అని అంటారు. ఇంగువకి యాంటీ వైరల్, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు జీర్ణక్రియకు సంబంధించిన వ్యాధులను నయం చేయడం, రక్తపోటును తగ్గించే లక్షణాలు ఉన్నాయి. ఆనాటి నుండే మన భారతీయ వంటకాల్లో సుగంధ ద్రవ్యాలను విరివిగా వాడుతారు. అలాంటి పదార్థాలలో ఇంగువ ఒకటి. ఇవి ఆహారానికి మంచి రుచిని ,సువాసనని అందిస్తాయి.ఇంగువలోని సహజ లక్షణాలు అనేక వ్యాధులను నయం చేయడానికి సహాయపడతాయి. కావున ఇంగువను ఆయుర్వేద, యునాని, సిధా మందుల తయారీలోనూ ఉపయోగిస్తారు.

Asafoetida Health Benefits
దీంట్లో ఉండే యాంటీ వైరల్, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు జీర్ణక్రియకు సంబంధించిన వ్యాధులను నయం చేయడంలో, రక్తపోటును తగ్గించడంలో సహాయపడుతుంది. వంటకాల్లో ఇంగువ వాడటం వల్ల కలిగే ప్రయోజనాలను మనం తెలుసుకుందాం.
Also Read: Weed Management in Castor: ఆముదం సాగు లో కలుపు యాజమాన్యం
డిస్మెన్నోహెయా సమస్యకు: 100ml మజ్జిగలో చిటికెడుఇంగువ (హింగ్), 1/2 టీస్పూన్
మెంతి (మెంతి) పొడి వేసి రోజుకు రెండుసార్ల చొప్పున మూడు రోజుల పాటు తీసుకోవడం వలన ప్రయోజనం ఉంటుంది.
పంటి నొప్పి నివారణకు: రెండు టీస్పూన్ల నిమ్మరసంలో అరచెంచా ఇంగువ (హింగ్) పొడి కలిపి గొరువెచ్చగా వేడిచేయాలి. ఈ మిశ్రమంలో పత్తిని ముంచి నొప్పి ఉన్న చోట 20-30 నిమిషాల పాటు ఉంచితే ఉపశమనం కలుగుతుంది.

Asafoetida Benefits
తలనొప్పికి చెక్: ఒక భాగం హింగు, ఒక భాగం అల్లం, ఒక భాగం కర్పూరం పొడి మరియు రెండు భాగాల తోక మిరియాలు కొన్ని పాలు వేసి మెత్తటి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఈ రోజుల్లో పని వలన కలిగే ఒత్తిడికి వాటి వలన కలిగే తలనొప్పికి మైగ్రేన్ సమస్య ఉన్న వారు దీని నుదిటిపై రాసుకుంటే నివారణ కలుగుతుంది.
కడుపు ఉబ్బరం సమస్య నివారణకు: 100ml వెచ్చని నీటిలో లేదా మజ్జిగలో 1గ్రా. అల్లం పొడి చిటికెడు హింగ్ పొడిని వేసుకొని రోజుకు రెండు సార్లు తాగాలి.
అజీర్ణతకు చెక్: 5గ్రా ఎండిన అల్లం పొడి, పొడవు మిరియాలు, కరివేపాకు, అజ్వైన్, తగినంత ఉప్పు, నల్ల మిరియాలు, జీలకర్ర మరియు ఇంగువ (హింగ్) కాస్త నెయ్యితో కలిపి తినే అప్పుడు మొదటి రెండు నుండి మూడు ముద్దలు తినడం వలన అజీర్ణతను నివారించవచ్చు.
పైల్స్ సమస్యకు చెక్: 100 ml మజ్జిగలో చిటికెడు హింగ్ వేసి తరచూ రోజుకు రెండు లేదా మూడు సార్లు తీసుకోవడం వలన పైల్స్ సమస్య నుండి బయటపడవచ్చు.
Also Read: Date Palm Cultivation: ఖర్జూరం సాగు ద్వారా 7 లక్షలు సంపాదిస్తున్న రైతు