Pulses Adulteration Test: ప్రపంచం మొత్తంలో పప్పులు ఎక్కువగా మన దేశంలోనే పండిస్తారు. పప్పులో ఎక్కువ ప్రోటీన్ ఉంటుంది. దాని వల్ల పప్పులు ఎక్కువగా తింటారు అందరు. కానీ ఇప్పుడు ఈ పప్పులు కూడా కల్తీ పద్దతిలో తయారు చేస్తారు. ఈ కల్తీ పద్దతిలో తయారు చేసిన పప్పుని గుర్తు పట్టడం కూడా చాలా కష్టంగా మారింది ఈరోజుల్లో. ఈ కల్తీ పప్పు సాధారణమైన పప్పులనే కనిపిస్తుంది. కానీ వంట చేశాక రుచిలో మాత్రమే తేడ తెలుస్తుంది. ముఖ్యగా ఈ కల్తీ కంది పప్పులో జరుగుతుంది.
మీరు కొనుకునే పప్పు నాణ్యంగా ఉంది అని గుర్తు పట్టడానికి ఆ పప్పుని వంట చేశాక కొంచం పప్పుగా ఉంటే అది మంచి కంది పప్పు. వంట చేసే సమయంలో కంది పప్పు చాలా తక్కువ సమయంలో మెత్తగా మారి, కొంచం కూడా పప్పుగా ఉండక పోతే అది కల్తీ పప్పు. ప్రస్తుతం ఈ కల్తీ పప్పును చాలా ప్రాసెసింగ్ వ్యాపారులు, మిల్ వ్యాపారులు తయారు చేస్తున్నారు.

Pulses Adulteration Test
Also Read: Poultry Farms: వర్షాకాలంలో కోళ్ల ఫారాల్లో తీసుకోవలసిన జాగ్రత్తలు.!
రైతులు కంది పంటని మిల్లో వేసి పప్పుగా మారుస్తారు. అందులో కొంత భాగం పప్పు విరిగిపోతుంది, చిన్న చిన్న రవ్వగా కూడా పప్పు వస్తుంది. ఈ పప్పు ఎక్కువగా ఎవరు తినరు, కొనడానికి కూడా ఇష్టపడరు. ఈ పప్పుని ఎక్కువగా పశువులకు ఆహారంగా వాడుతారు. కానీ వ్యాపారులు వినూత్నమైన ఆలోచనతో విరిగిపోయిన పప్పుని మళ్ళీ నాణ్యమైన పప్పు కనిపించేలా తయారు చేస్తున్నారు.

Pulses Adulteration Test
ఈ విరిగిపోయిన పప్పును పిండిగా తయారు చేస్తారు. ఆ పిండిలో నీళ్లతో కలిపి ఒక మిశ్రమంగా తయారు చేస్తారు. కంది పప్పు అకారంలో ఉండే మౌల్డ్స్ లో ఈ మిశ్రమాన్ని వేస్తారు. మౌల్డ్ మిశ్రమం ఆరడానికి ఒవేన్లో 10 నిముషాలు పెడతారు. ఆ తర్వాత మౌల్డ్స్ నుంచి పప్పుని తిస్తారు. ఈ పప్పు చూడానికి నాణ్యమైన పప్పుల ఉంటుంది కానీ రుచిలో తేడా ఉంటుంది.
రుచిలో తేడా గుర్తు పడుతున్నారు అని నాణ్యమైన పప్పు 50 శాతం, ఇలా తయారు చేసిన పప్పు 50 శాతం కలిపి కూడా అమ్ముతున్నారు. దాని వల్ల పప్పు నాణ్యమైనదా కదా అని గుర్తు పట్టడం కూడా ప్రజలకి ఇబ్బందిగా మారింది.
Also Read: Camphor Banana: కొబ్బరిలో అంతర పంటగా కర్పూర రకం అరటి – రూ.18 లక్షల ఆదాయం