Home Remedies: ప్రతి నిత్యం మనం వంటింట్లో వాడే దినుసుల్లో ఎన్నో ఔషధగుణాలున్నాయి. వాటిలో కొన్ని ముఖ్యమైనవి…. అల్లాన్ని బెల్లంతో సమాపాళ్ళలో కలిపి నూరి తింటే అజీర్ణం, పైత్యపు వాంతులు తగ్గుతాయి.
అజీర్ణంతో బాధ పడే వారు భోజనానికి ముందు చిన్న అల్లం ముక్కను ఉప్పుతో కలిపి తినడం మంచిది. ప్రయాణాల్లో వాంతులు వచ్చే వారికి 2చెంచాల అల్లం రసం లేదా చెంచా శొంఠి రసాన్ని నీటిలో కలిపి తీసుకోవాలి.
Also Read: Dairy farming : పాడి పశువుల పెంపకం లాభాసాటిగా ఉండాలంటే ?
వెలుల్లి: శరీరంలో కొవ్వు పెరగుకుండా చేసి రక్తపోటు, గుండెనొప్పి నుంచి రక్షిస్తుంది. రోజు 2 వెలుల్లి పాయలు కాల్చి చెక్కెరతో కలిపి రెండు పూటలు వాడితే కీళ్ళనొప్పులు తగ్గుతాయి.. జీర్ణ శక్తిని పెంచడమే గాక తల్లికి పాలు పట్టడంల్లో, శరీరంపై వచ్చే గడ్డల నుంచి ఉపశమనానికి పనిచేస్తుంది.
ఉల్లి: ఉల్లి రసాన్ని తేనెతో కలిపి తీసుకుంటే జీర్ణం, కడుపు నొప్పి తగ్గుతుంది.
పసుపు పొడిని వేడి పాలలో కలిపి రోజు పడుకొనే ముందు 4రోజులు తాగితే జలుబు, దగ్గు తగ్గుతాయి. పాదాలకు పసుపు రాస్తే తడివల్ల పాదాలకొచ్చే చర్మ వ్యాధులు తగ్గుతాయి.
ఆవాలు: ఆవాలపొడిని కొద్దిగా ఉప్పు కలిపిన నీటిలో వేసి తాగితే కడుపునొప్పి, రాత్రి పడుకునే ముందు కంటి కింద అవనూనెతో మెల్లగా రుద్దితే నల్లటి వలయాలు పోతాయి.
జీలకర్ర: జీలకర్ర పొడి మంచి జీర్ణకారి, జీర్ణసాయంలో వచ్చే కాలేయ వ్యాధులు, రక్తవిరోచనాలకు పనిచేస్తుంది. జీలకర్ర, మజ్జిగ కలిపి తాగితే అతిసారా వ్యాధికి పనిచేస్తుంది.వేయిచిన జీలకర్ర పొడిని తేనెతో కలిపి తీసుకుంటే వాంతులు తగ్గుతాయి.
మిరియాలు: మిరియాలు పొడిని వేడిపాలలో కలిపి తాగితే దగ్గు నిద్రలేమి, వంటి సమస్యలు, మిరియాల కషాయంలో జలుబు, దగ్గు, గొంతునొప్పి తగ్గుతాయి . మిరియాల పొడిని నీటిలో కలిపి వంటికి రాస్తే దురద తగ్గుతుంది.
మెంతులు: మెంతులు పొడిగా చేసి ప్రతి రోజు 10-15గ్రా. తింటే మాధమేహం అదుపులో ఉంటుంది. నూరిన మెంతుల్ని పెరుగులో నానబెట్టి తలకు పట్టిస్తే చుండ్రు తగ్గి , జుట్టు ఆరోగ్యంగా పెరుగుతుంది. ప్రసవo తరువాత వచ్చే నొప్పులు తగ్గిచేందుకు వేయించిన మెంతులు, బెల్లంతో కలిపి ఇస్తారు.
లవంగాలు: లవంగాలు దంత సంరక్షణలో, నోటి దుర్వాసన నివారణలో తోడ్పడుతుంది.
యాలుకలు దంత సంబంధిత వ్యాధులను తగ్గించడమే కాకుండా వీటి వాసన పీల్చితే తలనొప్పి తగ్గుతుంది.
గసగసాలు: గసగసాలు గ్లాస్ వేడి నీటికి గంట పాటు నానపెట్టి ఆ నీటిని తాగితే నీళ్ల విరోచనాలు తగ్గుతాయి.
వాము జీర్ణ శక్తిని పెంచి, కడుపు లో క్రిముల్ని నాశనం చేస్తుంది. బాలింతలకు పాలు బాగా పడతాయి.
పుదీనా: పుదీనా ఆకులని ఎండపెట్టి పొడి చేసి వాడితే మూత్ర పిండాలకు పనిచేస్తుంది.
ఇంగువ గోరు వెచ్చని నీటిలో బఠాణి గింజ అంత మోతాదులో కలిపి మింగితే విరోచనాలు, కడుపు నొప్పి, ఎక్కిళ్లు తగ్గుతాయి.
దాల్చిన చెక్క: దాల్చిన చెక్క పొడిని నీటిలో కలిపి తాగితే విరోచనాలు, పేగుల్లో, క్రిములు కడుపు నొప్పి తగ్గుతాయి.
Also Read: Insect Pests in Leafy Greens: వివిధ ఆకుకూరల్లో తెగుళ్ల సమస్యలు -నివారణ