Tuna Fish: ట్యూనా చేప వలలో పడితే చాలు జాలరులు ఎగిరిగంతేస్తారు. అత్యంత ఖరీదైన ఈ చేప దొరికితే చాలు ఈ రోజుంతా మత్యకారులకు పండగే పండుగ, అలాంటి చేప విశాఖ తీరంలో మాయమైపోతుంది. సాగరతీరంలో విరివిరిగా దొరికే ఈ చేపను విదేశీ జాలరులు మాయం చేస్తున్నారు. మన జాలరులు నాటు పడవలు, బోల్టులో వీటిని పట్టుకో లేకపోవడంతో ట్యూనాను విదేశీ జాలరులు యధేశ్చగా ఎగరవేసుకుపోతున్నారు.
ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో వీటిని పట్టుకుంటున్నారు. మనదేశంలో దొరికే ట్యూనా చేపలపై విదేశీ కన్ను పడింది.. ఈ చేపను పట్టుకోవడం అంటే ఆషామాషీ విషయం కాదు. దీనికోసం ప్రత్యేక వలలు ఏర్పాటు చేసుకోవాలి. కానీ ప్రభుత్వం మనకు ఎటువంటి సదుపాయాలు కల్పించలేదు. అంతేకాకుండా 30 బోల్టులు ఒకేసారి వల వేయాలి. కానీ వేటకు సంబంధించిన పరికరాలు మనకు అందుబాటులో లేవు.
దేశాల్లో మంచి విపరీతమైన గిరాకీ
ట్యూనా చేప అన్ని సముద్రాలలో దొరుకుతున్న. మన సముద్ర జలాల్లో లభించే ట్యూనా చేపలకు అరబ్, ఫ్రాన్స్, జర్మనీ, యునైటెడ్ కింగ్ డమ్, యూరోపియన్ దేశాల్లో మంచి విపరీతమైన గిరాకి ఉంది. రుచితో పాటు దీనిలో అనేక పోషకాలు ఉన్నాయి. అందుకే మన దేశంలో దొరికే ఈచేపల్ని విదేశీయులు తీసుకొని వెళ్లిపోతున్నారు. ఈచేప 10 కేజీల నుంచి 80 కేజీల వరకు ఉంటుది. 2012-2015లో వీటి ఉనికిని గుర్తించాయి.
విదేశీయులు ఎక్కువగా ఈ చేపను తింటారు. అధిక ప్రోటీన్లు, తక్కువ కేలరీల తో కూడిన కొవ్వు ఉండటంతో నరాలు పటుత్వం, శరీరంలో ఉండే అవయవాలు బలంగా ఉండడానికి దోహదపడుతాయి. వారానికి ట్యూనా చేపను రెంటు సార్లు తింటే కాన్సర్ రాదని మత్స్య శాఖ అధికారులు అన్నారు. విదేశీయులు మన సముద్ర జాలాల్లోని ట్యూనా చేపలను దిగుమతి చేసుకుంటారు. మన రాష్ర్టం నుంచే కాకుండా తమిళనాడు, కేరళ, అండమాన్, లక్ష్యదీప్ నుండి ఎగుమతి చేసుకుంటున్నారు.
ఏటా 42 వేల టన్నుల ట్యూనా చేపలు ఎగుమతి
ట్యూనా చేపల్లో శ్రీలంక మొదటి స్థానంలో ఉండగా మనదేశం రెండవ స్థానంలో ఉంది. ఏటా 42 వేల టన్నుల ట్యూనా చేపలు ఎగుమతి అవుతున్నాయి. బంగాళాఖాతంలో పట్టుకున్న ట్యూనా చేపలను కాకినాడ, విశాఖపట్నం, నిజాంపట్నం, మచిలీపట్నం రేవులకు తీసుకువచ్చి అక్కడ నుంచి చైనా, కేరళ రాష్ట్రాలకు ఎగుమతి చేస్తారు. కిలో 1200 నుంచి 1500 వరకు పలుకుతుంది. విదేశాలలో ఎక్కువ డిమాండ్ ఉండటంతో 3000 దాకా పలుకుతుంది.
ఈ చేపల్లో రోగ నిరోధక శక్తి ఎక్కువగా ఉంటుంది. అందుకే విదేశాల్లో ఈ చేపను ఎక్కువగా ఆహారంగా తీసుకుంటారు. అంతేకాకుండా కాన్సర్ ను దరిచేరనీయదు. ముఖ్యంగా విదేశాల్లో మిలట్రీలో పనిచేసే సిపాయిలకు ఇది ఎక్కువగా పెడతారు. ప్రసుత్తం ట్యూనా చేపలు మనకు తక్కువగా ఉన్న విదేశాల్లో వీటికి డిమాండ్ ఎక్కువ ఉండటంతో వీటి వేట లాభదాయకంగా ఉంది.
Also Read: Collective Natural Farming: సామూహికంగా ప్రకృతి వ్యవసాయం.!