ఆరోగ్యం / జీవన విధానం

Punarnava: పునర్నవతో పుష్కలమైన లాభాలు.!

1
Punarnava Plant
Punarnava Plant

Punarnava: పునర్నవ… దీనినే తెల్ల గలిజేరు మొక్క అని కూడా పిలుస్తుంటారు. మన గ్రామాల్లో కొంతమంది పెద్దలకు దీని గురించి తెలిసి ఉండచ్చు, కానీ చాలా వరకు దీని ప్రయోజనాల గురించి మనందరికీ తెలియదు. ఈ పునర్నవ మొక్క యొక్క శాస్త్రీయ నామం “బోయర్‌హావియా డిఫ్యూసా”. సాధారణంగా ఈ పునర్నవను గడ్డి మొక్కగా పరిగణిస్తారు. కానీ ఆయుర్వేదంలో మాత్రం దీన్ని అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాల కొరకు ఉపయోగిస్తున్నారు. పునర్నవను త్రిదోషిక మూలిక అని పిలుస్తుంటారు, ఎందుకంటే ఇది వాత, పిత్త మరియు కఫ దోషాలను శాంతిపజేసే గుణాలను కలిగి ఉంటుంది. ఆయుర్వేదంలో ఈ మొక్కను రసాయనంగా పరిగణిస్తుంటారు.

పునర్నవలో ప్రోటీన్లు, విటమిన్ సి, సోడియం, కాల్షియం, ఐరన్ మరియు పునర్నవోసైడ్, సెరాటాజెనిక్ యాసిడ్, హైపోక్సాంథైన్, బోయవినోన్ ఎ నుండి ఎఫ్, లిరియోడెండ్రాన్, ఉర్సోలిక్ యాసిడ్ మరియు ఒలేనోలిక్ యాసిడ్ వంటి అనేక బయోయాక్టివ్ సమ్మేళనాలు లభిస్తాయి. పునర్నవ జీర్ణవ్యవస్థను ప్రోత్సహించడంలో, గుండె సమస్యలను నిర్వహించడంలో, కంటిచూపును మెరుగుపరచడంలో మరియు మధుమేహం, మూత్ర నాళాల ఇన్ఫెక్షన్, కీళ్లనొప్పులు, నపుంసకత్వము, గౌట్ మరియు రక్తహీనత వంటి వ్యాధులను నివారించడంలో అధిక ప్రాముఖ్యతను కలిగి ఉంది.

Also Read: Stevia: షుగర్ రోగులకు చక్కటి శుభవార్త.. చక్కర బదులు స్టీవియా!

Punarnava

Punarnava

పునర్నవలో శక్తివంతమైన అనాల్జేసిక్ మరియు యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉంటాయి, ఇవి కీళ్ల మరియు కండరాల నొప్పిని తగ్గించడంలో తోడ్పడతాయి, తద్వారా రుమటాయిడ్ ఆర్థరైటిస్ వంటి దీర్ఘకాలిక ఆటో ఇమ్యూన్ ఇన్ఫ్లమేటరీ వ్యాధుల అవకాశాలను తగ్గిస్తుంది. సాధారణ జలుబు మరియు ఫ్లూ చికిత్సలో కూడా ఈ మూలిక ప్రయోజకరంగా ఉపయోగపడుతుంది.

పునర్నవలోని అద్భుతమైన హైపోగ్లైసీమిక్ గుణం శరీరంలోని రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఈ పునరుజ్జీవన మూలిక శరీరంలోని అదనపు కొవ్వును తగ్గించి బరువును నియంత్రణలో ఉంచడానికి సహాయపడుతుంది. పునర్నవ గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరిచే అద్భుతమైన మూలిక, అలాగే ఇది కిడ్నీ మరియు కాలేయ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో కూడా కీలక పాత్ర పోషిస్తుంది. పునర్నవ పురుషులలో సంతానోత్పత్తిని పెంచడానికి అద్భుతంగా ఉపయోగపడుతుంది. ఈ మొక్కను గాయలను నయం చేయడంలో మరియు కామెర్ల చికిత్సలో కూడా ఉపయోగిస్తారు. అలాగే ఇది కొన్ని రకాల కాన్సర్ కణాలను నివారిస్తుందని పరిశోధకులు చెబుతున్నారు. పునర్నవ జీర్ణవ్యవస్థకు సంబంధించిన సమస్యలు రాకుండా కాపాడుతుంది. పునర్నవ ఊపిరితిత్తులోని శ్లేష్మాన్ని తొలగించి ఆస్తమాను మరియు ఇతర శ్వాస సంబంధిత సమస్యలు రాకుండా నివారించడంలో కీలక పాత్ర పోషిస్తుంది.

Also Read: Sorrel Fruit Benefits: గోంగూర కాయల వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసా?… అయితే ఇది మీ కోసమే!

Leave Your Comments

Stevia: షుగర్ రోగులకు చక్కటి శుభవార్త.. చక్కర బదులు స్టీవియా!

Previous article

Watermelon: పోషకాలమయం పుచ్చకాయ- ఆశించు చీడ పీడలు `సస్య రక్షణ చర్యలు.!

Next article

You may also like