Dry Fruits Health Benefits: చిన్నగా కనిపించే డ్రై ఫ్రూప్ట్స్ శరీరానికి కావాల్సిన అనేక పోషకాలు పుష్కలంగా ఉంటాయి.రుచితో పాటు అనేక విటమిన్లు ఖనిజాలలో డ్రై ఫ్రూప్ట్స్ మీ సొంతం. రోజుకి రెండు లేదా మూడు డ్రై ఫ్రూప్ట్స్ తినడం వల్ల ఆరోగ్యం మీ సొంతం.తినడం వల్ల ప్రయోజనాలను ఇప్పుడు చూదాం..
డ్రై ఫ్రూట్స్ గ్రేట్ ఎనర్జి ఫుడ్ అని చెప్పవచ్చు. ఒంట్లో శక్తి లేనప్పుడు బాగా నీరసం గా ఉన్నపుడు 3 లేదా 4 డ్రైఫ్రూట్స్ తీసుకోవడం ద్వారా వీటిలో ఉండే పోషకాలు శరీరానికి తక్షణ శక్తిని అందిస్తుంది.డ్రై ఫ్రూట్స్ తినడం వలన కలిగే ప్రయోజనాలలో ముఖ్యమైనది.అవి మన జీర్ణ క్రియను మెరుగుపరుస్తుంది. ఇందులో అధికంగా ఉండే ఫైబర్ అజిర్తి ని నివారించే మంచి బాక్టీరియా లను మాలబద్దక సమస్యలను దూరం చేస్తుంది.
ఆరోగ్యాన్ని ఇవ్వడంతో పాటు డ్రై ఫ్రూట్స్ రక్త కణాలను కూడా ఉత్పత్తి చేసేందుకు సహాయపడుతుంది. అంతే కాకుండా రక్తంలోని హిమోగ్లోబిన్ మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తుంది. డ్రై ఫ్రూట్స్ ను రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం వలన అది మన శరీరంలో కొలేస్ట్రాల్ బాలన్స్ చేస్తుంది.ఇందులో పుష్కలంగా ఉండే ఫ్యాట్టి ఆమ్లాలను శరీరంలో కోలేస్ట్రాల్ కంట్రోల్ చేయడం లో అద్భుతంగా పని చేస్తుంది.
Also Read: Coriander Health Benefits: కొత్తిమీర వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు మీకు తెలుసా.!
ప్రతి రోజు క్రమం తప్పకుండా డ్రై ఫ్రూట్స్ ని తీసుకుంటే జుట్టు సంరక్షణను ఇతర కాస్మోటిక్స్ వాడవలసిన పని లేదు.ఎందుకంటే ఇందులోని పోషకాలు జుట్టు పెరుగుదలకు సహాయం చేస్తుంది.అంతే కాకుండా జుట్టు దృఢంగా ఉంటుంది. అంతే కాకుండా ఇవి శరీరంలో వచ్చే అధిక రక్త పోటును మరియు రక్తం లో చక్కెర నిల్వలను క్రమబద్దికరిస్తుంది.
డ్రై ఫ్రూట్స్ లో కాల్షియం మరియు ఐరన్ అధికంగా ఉంటాయి. ఇవి మీ దంతాలను , ఎముకలను మెరుగుపరుస్తుంది.డ్రై ఫ్రూట్స్ లో ఉండే శక్తి వంతమైన యాంటీ ఆక్సిడెంట్స్ శరీరంలో వృద్ధి చెందే క్యాన్సర్ కణాల అభివృద్ధి ని నిరోధిస్తాయి.డ్రై ఫ్రూట్స్ తీసుకోవడం వలన ఇందులో ఉండే కేరోటినాయిడ్స్ మరియు విటమిన్ ఎ కంటి చూపును మెరుగుపరుస్తుంది. కంటి ఆరోగ్యాన్ని పెంచుతుంది.అంతే కాకుండా డ్రై ఫ్రూట్స్ వయసు పెరగడం వల్ల వృధాప్యఛాయలు దారికి రాకుండా చేస్తాయి.
Also Read: Mint Leaves Uses: పుదీనా వల్ల వచ్చే ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే అస్సలు వదిలి పెట్టరు.!