Hazards of Drinking Tea/Coffee in paper Cups: టీ లేదా కాఫీ…. ప్రపంచంలో అధికంగా తీసుకునే రెండవ పానీయంగా ఇది మన అందరికి తెలుసు. ముఖ్యంగా మన భారతదేశంలో చాలా మందికి పొద్దుపొద్దున్నే ఒక కప్పు వేడి గా కాఫీ లేదా టీ పొందే వరకు రోజు ప్రారంభం కాదు. ఇప్పుడున్న బిజీ పనుల్లో చాలా మంది ఏ పనైనా తొందరగా పూర్తి చేసుకోవాలనుకుంటున్నారు, ఇదే అనువుగా తీసుకొని వ్యాపారస్తులు కూడా టీ లేదా కాఫీలను పేపరుతో తయారుచేసిన కప్పులలో విక్రయిస్తున్నారు. పేపర్ కప్పులు కూడా శుభ్రపరచాల్సిన అవసరం లేదు అందువలన వ్యాపారస్తుల పని కూడా సులువుగా అయిపోతుంది.
కానీ టీ లేదా కాఫీ తాగడానికి ఉపయోగించే పేపర్ కప్పులు కాన్సర్ కి కారణమయ్యే పదార్థాలతో తయారవుతాయని ఇటీవల జరిపిన పరిశోధనలో శాస్త్రవేత్తలు వెల్లడించారు. మనం వేడి వేడి టీ లేదా కాఫీని పేపర్ కప్పులో పోసిన వెంటనే ఆ టీ యొక్క వేడి వలన పేపరులో ఉన్న కాన్సర్ కారకాలు మనం తాగే టీలోకి ప్రవేశిస్తాయి. ఈ పేపర్ కప్పులు టీ లేదా కాఫీలోకి పదుల నుండి వేల సంఖ్యలో హానికరమైన ప్లాస్టిక్ కణాలను విడుదల చేస్తాయి. ఒక సగటు వ్యక్తి ప్రతిరోజూ మూడు సార్లు టీ లేదా కాఫీని ఒక పేపర్ కప్పులో త్రాగితే, కంటికి కనిపించని 75,000 చిన్న మైక్రోప్లాస్టిక్ కణాలు అతని శరీరంలోకి వెళ్తాయి.దాదాపు కంటికి కనిపించని ఈ మైక్రోప్లాస్టిక్స్ మానవ ఆరోగ్యానికి పెద్ద ముప్పుగా మారుతున్నాయని పరిశోధకులు చెబుతున్నారు.
Also Read: Green Tea for Weight Loss: బరువు తగ్గాలనుకునే వాళ్ళ కోసం గ్రీన్ టీ.!
ఇటీవలి పరిశోధనలో శాస్త్రవేత్తలు మొదటిసారిగా మానవ అవయవాల లోపల మైక్రోప్లాస్టిక్స్ను కనుగొన్నారు,ఇది క్యాన్సర్ లేదా సంతానలేమికి దారితీస్తుందని వెల్లడించారు.అవి సాధారణంగా 0.2 అంగుళాల కంటే తక్కువగా,మానవ జుట్టు యొక్క వెడల్పులో యాభై వంతు వరకు చిన్నవిగా ఉంటాయి. ఇవి ఏకంగా 52 రకాల క్యాన్సర్లు రావడానికి కారణం అవుతాయి. ముఖ్యంగా మహిళల్లో వీటివల్ల రొమ్ము కాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువ.
అయితే, అన్ని పేపర్ కప్పులు కాన్సర్ కలిగించే కారకాలను కలిగి ఉండవు.కొన్ని పర్యావరణ-స్నేహపూర్వక పేపర్ కప్పులు కూడా ఉన్నాయి, ఇవి ఆహార-సురక్షితమైన పదార్థాలతో తయారు చేయబడతాయి మరియు వీటిలో శరీరానికి హాని కలిగించే ఉత్పత్తులు చాలా తక్కువగా ఉంటాయి.కాబట్టి మీరు మీ కాగితపు కప్పులను కొనుగోలు చేయడానికి ముందు, లేబుల్ పై పర్యావరణ-స్నేహపూర్వక మరియు ఆహార-సురక్షిత గుర్తును చూసి కొనాలి.
కాబట్టి,ఈ పేపర్ కప్పులను వీలైనంత తక్కువగా ఉపయోగించండి మరియు వీలైతే గాజు లేదా స్టీల్ లేదా ఏదైనా ఇతర హానిచేయని పదార్థంతో తయారు చేసిన కప్పును ఉపయోగించండి.
Also Read: Purple Leaf Tea: పర్పుల్ టీ రహస్యం