Food Poisoning in Rainy Season: ఫుడ్ పాయిజనింగ్ అనేది చాలా సాధారణ వ్యాధి. చాలా మందికి ఇది సాధారణంగా తేలికపాటిది, అయితే ఫుడ్ పాయిజనింగ్ తీవ్రంగా ఉంటుంది మరియు కొంతమందికి ప్రాణాంతకం కూడా కావచ్చు. కలుషితమైన ఆహారం తినడం వలన లేదా కలుషితమైన నీరు తాగడం వల్ల ఫుడ్ పోయిజనింగ్ జరుగుతుంది. ప్రతి సంవత్సరం సుమారు 4 మిలియన్ల మంది ఆహార విషాన్ని అనుభవిస్తున్నారని అంచనా. వృద్ధులు, గర్భిణీ స్త్రీలు, చిన్న పిల్లలు మరియు శిశువులు మరియు దీర్ఘకాలిక వైద్య పరిస్థితులు (ఉదా. మధుమేహం, ఎయిడ్స్, కాలేయ వ్యాధి) ఉన్నవారు ఎక్కువ ప్రమాదం ఉన్న వ్యక్తులు.
వంట సరిగ్గా చెయ్యనప్పుడు, ప్రాసెసింగ్, లేదా ప్యాకేజింగ్ లో లోపాల ఉన్నప్పుడు ఆహారాన్ని బ్యాక్టీరియా, వైరస్, లేదా ఇతర క్రీములు కలుషితం చేసే అవకాశం ఉంటుంది. సాధారణంగా బ్యాక్టీరియాలలో సాల్మోనెల్లా టైఫీ, విబ్రియో కలరా , క్లోస్ట్రిడియం డిఫెసిల్ , స్టాఫైలోకోకస్ ఆరియస్ ఇంకా వైరస్లలో నోరో వైరస్ వంటివి ఆహారాన్ని కలుషితం చేస్తాయి. ఫుడ్ పోయిజనింగ్ వలన విరేచనాలు, జ్వరం,వాంతులు,కడుపు నొప్పి,ఆకలి తగ్గుదల వంటి లక్షణాలు కనిపిస్తాయి.
Also Read: Tobacco Cultivation: పొగాకు సాగుకు అనువైన నేలలు.!
ఇప్పుడు మనం ఫుడ్ పాయిజనింగ్ యొక్క చికిత్స, నివారణ గురించి తెలుసుకుందాం!ఫుడ్ పాయిజనింగ్ చికిత్స రెండు అంశాలపై ఆధారపడి ఉంటుంది ఒకటి దానికి కారణం మరొకటి దాని తీవ్రత. చాలా మందికి, ఫుడ్ పాయిజనింగ్ అనేది ఎలాంటి చికిత్స లేకుండానే నయమవుతుంది. కొంతమందికి తేలిక పాటు విరేచనాలతో 24 గంటల కంటే తక్కువ సమయం బాధపడుతున్నట్లయితే చికిత్సలో భాగంగా ORS వంటి ద్రవణాలను త్రాగించాలి. ఈ ద్రావణాలలో తేలికపాటి నిర్జలీకరణాన్ని నివారించేందుకు తగినన్ని నీరు, లవణాలు మరియు చక్కెర సరైన సమతుల్యంలో కలిగి ఉంటాయి. ఒకవేల ఏది అందు బాటులో లేక పోతే 1/2 టీస్పూన్ ఉప్పు, 6 టీస్పూన్ల చక్కెరను 1 లీటరు నీటిలో కలిపి ఇలా ద్రావణాన్ని తయారుచేసి త్రాగవచ్చు.
విరేచనాలు మరియు వాంతులు సమయంలో గట్టిగా ఉండే ఆహారానికి దూరంగా ఉండటం మంచిది. సాధ్యమైనంత వరకు ద్రవణాలను తీసుకోవాలి ఆ తర్వాత నెమ్మదిగా ఎలాంటి మసాలాలు,కారం ఎక్కువగా లేని ఆహారాన్ని తినడం ప్రారంభించాలి. అనారోగ్యంతో ఉన్నప్పుడు ఆల్కహాల్ మరియు కెఫిన్ వంటి పదార్థాలకు దూరంగా ఉండాలి. ఈ సమస్య తీవ్రత ఎక్కువగా ఉన్నా లేదా తీవ్రమైన నిర్జలీకరణ ఉంటే ఆ వ్యక్తులు ఆసుపత్రిలో చేరవలసి ఉంటుంది, తద్వారా వారికి రీహైడ్రేషన్ సొల్యూషన్‌లను ఇంట్రావీనస్ (సిరలోకి) ద్వారా ఇస్తారు.
చాలా శాతం బాక్టీరియా ద్వారా కలిగే ఫుడ్ పాయిజనింగ్‌లకు యాంటీబయాటిక్స్ అవసరం ఉండదు. కానీ కొన్ని రకాల ఇన్ఫెక్షన్‌లకు యాంటీబయాటిక్ చికిత్స అవసరం కావచ్చు. ఒకవేళ ఫుడ్ పాయిజనింగ్ అనేది నాడీ వ్యవస్థ పై ప్రభావం చూపినట్లతే, దానికి ఇతర మందులు లేదా విరుగుడులను ఉపయోగించాల్సిన అవసరం ఉంటుంది. ఉదాహరణకు, మష్రూమ్ (మస్కారిన్) మరియు క్రిమిసంహారన వలన విషప్రయోగం అయితే , విష ప్రభావాలను అధిగమించడానికి అట్రోపిన్ అనే ఔషధాన్ని ఇవ్వాల్సి ఉంటుంది.
విషప్రయోగం అనేది చాలా తీవ్రంగా ఉంటే, ఆ రోగికి వెంటిలేటర్ (కృత్రిమ శ్వాస యంత్రం), కిడ్నీ డయాలసిస్ మరియు ఆసుపత్రి లో ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లో చేర్చే అవసరం ఉంటుంది.
Also Read: Integrated Farming: సమీకృత వ్యవసాయం తో రూ. 12 లక్షలు సంపాదిస్తున్నా రైతు