Amla Powder Benefits: ఉసిరి కాయలు… ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే వాటిలో ఇవి ఒకటి. ఉసిరి కాయను మనం ఎన్నో విధాలుగా తీసుకుంటాం, పచ్చడిగా, జ్యూస్ లాగా, లేదా కేవలం ఉసిరి కాయలను కూడా తినే వాళ్ళుంటారు. అయితే ఉసిరి పొడి గురించి మనలో చాలా మందికి తెలియకపోవచ్చు. ప్రస్తుత కాలంలో ఉసిరి పొడికి ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీలో చాలా డిమాండ్ ఉంది. అయితే ఈ ఉసిరి పొడిని ఎలా వాడతారు, దాని వల్ల ఉపయోగాలు ఏంటి అనేది చాలా వరకు తెలియకపోవచ్చు. ఎండబెట్టిన ఉసిరి కాయల నుండి ఈ పొడిని తయారు చేస్తారు. ఈ ఉసిరి పొడిలో లభించే అనేక పోషకాల వల్ల మన ఆరోగ్యానికి ఎన్నో రకాల ప్రయోజనాలు చేకూరుతాయి.
ఉసిరి కాయల పొడి జీర్ణక్రియ పనితీరును మెరుగుపరచడంలో మరియు జీర్ణ సమస్యల నుండి ఉపశమనం పొందడంలో సహాయపడుతుంది. ఉసిరి పొడిని డైరెక్ట్ గా తీసుకోవచ్చు లేదా ఆహారం, పానీయాలలో చేర్చుకోవచ్చు. ఉసిరి పొడి మలబద్ధకం, అతిసారం మరియు ఇతర జీర్ణశయాంతర సమస్యల నుండి ఉపశమనం పొందడంలో కూడా తోడ్పడుతుంది. ఉసిరిలో లభించే అధిక విటమిన్ సి కంటెంట్ రోగనిరోధక శక్తిని పెంపొందించడంలో అద్భుతంగా సహాయపడుతుంది.
ఉసిరి పొడి ఇన్సులిన్ ఉత్పత్తిని ప్రేరేపించడం మరియు గ్లూకోస్ టాలరెన్స్‌ను మెరుగుపరచడం ద్వారా రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో ఉపయోగపడుతుంది. ఆమ్లా పౌడర్ సహజంగా బరువు తగ్గడాన్ని ప్రోత్సహిస్తుంది. ఇందులో ఉండే ఫైబర్ మరియు యాంటీఆక్సిడెంట్లు జీవక్రియను వేగవంతం చేయడానికి మరియు కొవ్వును కరిగించడానికి సహాయపడతాయి.
ఉసిరి పొడిలో విటమిన్ ఎ మరియు సి పుష్కలంగా లభిస్తాయి, ఇవి ఆరోగ్యకరమైన కంటి చూపుని నిర్వహించడానికి తోడ్పడతాయి. విటమిన్ ఎ కంటి కార్నియాను రక్షించడంలో మరియు రాత్రి అంధత్వాన్ని నివారించడంలో సహాయపడుతుంది. ఆమ్లా పౌడర్ ఒక అద్భుతమైన లివర్ టానిక్ లాగా పని చేస్తుంది, ఇది బైల్ జ్యూస్ ఉత్పత్తిని ప్రేరేపించడం మరియు నిర్విషీకరణను ప్రోత్సహించడం ద్వారా కాలేయ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది, అదేవిధంగా టాక్సిన్స్ నుండి కూడా కాలేయాన్ని రక్షిస్తుంది. జుట్టు ఆరోగ్యం విషయానికి వస్తే ఉసిరి పొడి జుట్టుకి ఎన్నో రకాలుగా ప్రయోజనాలు చేకూరుస్తుంది. చుండ్రు, పొడిబారడం, మురికిని తొలగించడం వంటి అనేక జుట్టు సమస్యలకు ఉసిరి పొడి అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది. ఉసిరిలో చర్మానికి మేలు చేసే యాంటీ ఆక్సిడెంట్లు మరియు పోషకాలు పుష్కలంగా ఉంటాయి, ఈ పొడిని క్రమం తప్పకుండా ఉపయోగించినప్పుడు, చర్మాన్ని కాంతివంతంగా మార్చడానికి మరియు చర్మపు రంగును సమం చేయడానికి సహాయపడుతుంది. ఇది చర్మంపై వచ్చే ముడతలు మరియు ఫైన్ లైన్లను కూడా నివారిస్తుంది.
Also Read: Coconut Plantations: శ్రీకాకుళం జిల్లా ఉద్దానంలో కొబ్బరి తోటల సాగు.!