Arjuna Tree Medicinal Uses: భారతదేశంలో, అర్జున చెట్టుని అత్యంత మతపరమైన మరియు పవిత్రమైన చెట్టుగా భావిస్తాము. ఈ చెట్టు యొక్క ఆకులు మరియు పువ్వులు విష్ణు మరియు వినాయకుని పూజ కోసం ఉపయోగిస్తారు. ఈ చెట్టు యొక్క శాస్త్రీయ నామం “టెర్మినేలియా అర్జున”. పురాతన కాలం నుండి ఈ మూలికని అనేక ప్రయోజనాల కోసం ఆయుర్వేద తయారీలో ఉపయోగిస్తున్నారు. మనందరికీ తెలిసినట్లుగా, ప్రస్తుత ఉరుకుపరుగుల కాలంలో ఒత్తిడి కూడా మన జీవితంలో ఒక భాగంగా మారిపోయింది. దీని వల్ల గుండెపోటు, డయాబెటిస్ వంటి అనేక అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి.
అర్జున చెట్టులో ఉండే ప్రత్యేక లక్షణాలు గుండెపై మంచి ప్రభావం చూపించి, గుండె సంబంధిత అనారోగ్య సమస్యలు తలెత్తకుండా కాపాడుతుంది. భారతీయ ఆయుర్వేదంలో అర్జున చెట్టు కీలక పాత్ర పోషిస్తుంది. దాదాపుగా ఈ చెట్టు యొక్క అన్ని భాగాలు, ముఖ్యంగా బెరడు, వేరు యొక్క బెరడు, ఆకులు, గింజలు మరియు పండ్లు వివిధ ఔషధ గుణాలను కలిగి ఉంటాయి వీటిని సాంప్రదాయ ఆయుర్వేద వైద్యంలో విస్తృతంగా ఉపయోగిస్తున్నారు.

Arjuna Tree Medicinal Uses
Also Read: Bael Tree (Maredu) Sharbat: వేసవి కాలంలో మంచి ఉపశమనం కలిగించే మారేడు కాయ షర్బత్ గురించి తెలుసా?
అర్జున చెట్టు యొక్క బెరడులో మెగ్నీషియం (4000 μg/g), కాల్షియం (3133 μg/g), జింక్ (119 μg/g) మరియు రాగి (19 μg/g) వంటి వివిధ ఖనిజాలు మరియు ట్రేస్ ఎలిమెంట్స్ పెద్ద మొత్తంలో లభిస్తాయి. వీటితో పాటు ట్రిప్టోఫాన్, టైరోసిన్, హిస్టిడిన్ మరియు సిస్టీన్ వంటి కొన్ని అమైనో ఆమ్లాలు కూడా ఇందులో లభిస్తాయి. అర్జున చెట్టు యొక్క సారం జీర్ణ వ్యవస్థ పొరను ఆక్సీకరణ నష్టం నుండి రక్షిస్తాయి, తద్వారా అల్సర్లు రాకుండా నివారించవచ్చు. దీని సారంలో ఉండే పోషకాలు యాంటిబ్యాక్తీరియల్ లక్షణాలు కలిగి ఉంటాయి, తద్వారా కడుపులో పుండ్లు మరియు ఇతర ఇన్ఫెక్షన్లు రాకుండా నివారిస్తాయి. అర్జున యొక్క సారం అతిసారం మరియు విరేచనాల చికిత్సకు కూడా తోడ్పడుతుంది.

Arjuna Tree
అర్జున చెట్టు యొక్క సారం రక్తంలో షుగర్ లెవెల్స్ ని మరియు రక్తపోటుని కూడా నియంత్రణలో ఉంచుతుంది. అలాగే ఇది రక్తంలో కొవ్వు స్థాయిలను నియంత్రణలో ఉంచి మధుమేహ రోగులకు చాలా ఉపయోగాలను అందజేస్తుంది. అర్జునలో ఉండే పోషకాలు గుండె ఆరోగ్యాన్ని మెరుగు పరచడంలో కీలక పాత్ర పోషిస్తాయి, వీటితో పాటు ఇవి కిడ్నీ సంబంధిత వ్యాధులు సంక్రమించకుండా కూడా సహాయపడతాయి. అర్జున చెట్టు యొక్క పౌడర్, టాబ్లెట్స్ మరియు ఇతర ఉత్పత్తులు మార్కెట్లో చాలా సులభంగా లభిస్తాయి.
Also Read: Apricots Health Benefits: ఆప్రికాట్ల వల్ల కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసా?
Also Watch: