Mushroom Cultivation – పుట్టగొడుగుల ప్రాముఖ్యత: పుట్టగొడుగుల్లో మాంసకృత్తులు, పిండి పదార్ధాలు 60-70% ఉండడం వల్ల తేలికగా జీర్ణమవుతాయి. అధిక జిర్ణశక్తీని కలిగి ఉంటాయి. చిన్న పిల్లలకు, వృద్దులకు స్థూలకయాలకు మంచిది. కంటి చూపు దాంతల పటిష్టతాకి తోడ్పడుతుంది. మనం తినే పుట్ట గొడుగుల్లో 89-91% నీరు 0.97-1.26 % లవణాలు,2.78-0.65% కొవ్వు పదారర్ధాలు,0.09- 1.67% పీచు పదార్ధాలు,5.3-6.28%పిండి పదార్ధం కలిగి ఉంటాయి. ప్రతి వంద గ్రాముల తాజా పుట్టగొడుగుల నుంచి 43కిలోల కెలరీల శక్తిని అందిస్తాయి.
ఆయిస్టర్ పుట్టగొడుగులు : వీటిని 25-32సెం. గ్రే. ఉషోగ్రత్త , గాలిలో తేమ 75-85 % గల వాతావరణం లో సాగు చేయవచ్చు. జూన్ నుండి ఫిబ్రవరి మాసం వరకు వీటిని పెంచాలి. వీటికి తక్కువ పెట్టుబడి, సాధారణ సాంకేతిక పరిజ్ఞానం సరిపోతుంది.
సాగు చేసే విధానం: శుభ్రమైనా వరి గడ్డిని తీసుకొని 3-5 సెం. మీ ముక్కలుగా కత్తిరించి ,10కిలోల గడ్డి ముక్కలను 100లీటర్ల నీటిలో నానబెట్టాలి. తర్వాత మరుగుతున్న నీటిలో 100 డి. సెం. గ్రే ఉష్ణగ్రత మధ్య గంట సేపు ఉడకబెట్టి శుద్ధి చేయాలి. లేదా రసాయన పద్దతిలో 100 లీటర్లు నీటిలో బావిష్టన్ 250కిలో. గ్రా కలిపి దానిలో గడ్డి మొక్కలను నీటిలో మునిగే విధంగా 12-16 గంటల పాటు ఉంచి శుద్ధి చేసి , చల్లని ప్రదేశం లో అరబెట్టాలి. స్వచ్ఛమైన పుట్ట గొడుగుల విత్తనాన్ని డెటాల్ తో శుభ్రం చేసి ఇనుప ట్రేలో ఇనుప రాడ్తో తీసుకొని ఉండలు లేకుండా చేసుకోవాలి. తర్వాత 100గేజ్ మందంగాల పాలిదిన్ సంచులు తీసుకొని వాటిని ఒక మీ. మీ సైజు గల 12-15 రంద్రాలు చేయాలి.
ప్లాస్టిక్ కవర్ లో శుద్ధి చేసిన ముక్కల్ని 5సెం. మీ మందం వరకు వేసి, స్పాన్ని గడ్డి అంచుల చుట్టు వేయాలి. ఇలా అయిదారు వరుసలు వేసి ఉపరీతలం పైన గుప్పెడు విత్తన్నన్ని చల్లాలి. ఇలా చేసిన పాలిదిన్ సంచులను మూడో వంతు వరకు నింపి రబ్బరు బ్యాండ్ తో మూసివేయాలి. ఒక కిలో స్పాన్ 10సంచులకు వస్తుంది. ప్రతి సంచికి 100 గ్రా. విత్తనన్ని వేయాలి.ఎప్పటికప్పుడు తడిగా ఉండేలా నీళ్ళు చల్లాలి.. మూడు నాలుగు వారల్లో గడ్డి మొక్కలపై తెల్లని శీలింద్రం దట్టంగ వ్యాపిస్తుంది.
పాల పుట్ట గొడుగుల పెంపకం : పాల పుట్ట గొడుగులను మర్చి నుంచి అక్టోబర్ వరకు సాగు చేయవచ్చు. వీటి పెంపకానికి 30-35డి. సెం. గ్రే. ఉష్టనోగ్రత్త,85-95%తేమ, వెలుతురు అవసరం. పరిస్థితులకు అనుగుణంగా తాగు పాటి జాగ్రత్తలు తీసుకుంటే సంవ లో వీటిని సాగు చేయవచ్చు. ఈ పుట్ట గొడుగులు పెంపకం కొద్ది పాటి చిన్న మార్పులతో అయిస్టర్ పుట్ట గొడుగుల పెంపకం ను పోలి ఉంటుంది.
మార్కెటింగ్ : మార్కెటింగ్ అంచనా ప్రకారం ప్రతి రోజు పంట తీసుకునే విధంగా బెడ్లను ప్లాన్ చేసుకోవాలి.తాజా పుట్ట గొడుగుల్ని రెస్టారెంట్, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, సూపర్ మార్కెట్లకు, రైతు బాజార్లకు సరఫరా చేయాలి. మధుమేహం , ఉబకాయo, గుండె జబ్బులున్న వారికీ ఇది మంచి ఆహారం.
Also Read:Poisonous Mushrooms: మనుషుల ప్రాణాలు తీస్తున్న పుట్టగొడుగులు.!
Must Watch:
Also Watch: