Broccoli Health Benefits: ఆరోగ్యకరమైన ఆహారాల గురించి ఆలోచించినప్పుడు మొదటగా గుర్తొచ్చే ఆహారాలలో బ్రకోలి ఒకటి. ఈ బ్రకోలి వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి చాలా మందికి తెలియకపోవచ్చు, కానీ దీని వల్ల కలిగే ప్రయోజనాల గురించి తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే. బ్రకోలి యొక్క శాస్త్రీయ నామం “బ్రాసికా ఒలేరాసియా”. ఇది క్యాబేజీ, బ్రస్సెల్స్ మొలకలు, కాలే మరియు కాలీఫ్లవర్లకు దగ్గరి సంబంధం కలిగి ఉన్న కూరగాయల్లో ఒకటి. దీనిని మీరు భోజనం, స్నాక్స్ మరియు పానీయాలలో కూడా చేర్చుకొని తినవచ్చు. వేసవి కాలంలో తప్పక తీసుకోవాల్సిన కూరగాయల్లో బ్రకోలి కూడా ప్రధానమైనది, ఎందుకంటే ఇది మిమ్మల్ని హైడ్రేటెడ్ గా ఉంచుతుంది, అలాగే మీ మెదడు ఆరోగ్యానికి మద్దతు కూడా ఇస్తుంది.
బ్రకోలి యొక్క అతిపెద్ద ప్రయోజనాల్లో ఒకటి దాని పోషక విలువల సామర్ధ్యం. దీనిలో మన శరీరానికి కావాల్సిన అనేక రకాల విటమిన్లు, ఖనిజాలు మరియు మినరల్స్ పుష్కలంగా లభిస్తాయి. ఒక కప్పు (91 గ్రాములు) బ్రకోలీలో : పిండి పదార్థాలు: 6 గ్రాములు, ప్రోటీన్: 2.6 గ్రా, కొవ్వు: 0.3 గ్రాములు, ఫైబర్: 2.4 గ్రాములు, విటమిన్ సి: RDIలో 135%, విటమిన్ A: RDIలో 11%, విటమిన్ K: RDIలో 116%, విటమిన్ B9 (ఫోలేట్): RDIలో 14%, పొటాషియం: RDIలో 8%, భాస్వరం: RDIలో 6%, సెలీనియం: RDIలో 3% లభిస్తాయి. బ్రకోలిని వండుకొని లేదా పచ్చిగా కూడా తినవచ్చు. బ్రకోలిలో ఉన్న వివిధ బయోయాక్టివ్ సమ్మేళనాలు, శరీరంలో కలిగే వివిధ మంటలను, వాపులను తగ్గించడంలో సహాయపడతాయి, అలాగే దీర్ఘకాలిక వ్యాధుల నుండి కూడా సంరక్షిస్తాయి. అనేక అధ్యయనాల ప్రకారం బ్రకోలి రొమ్ము, ప్రోస్టేట్, గ్యాస్ట్రిక్/కడుపు, మూత్రపిండము, మూత్రాశయం క్యాన్సర్లను తగ్గిస్తుందని నిరూపించబడింది.
Also Read: Arjuna Tree Medicinal Uses: అర్జున చెట్టు వల్ల కలిగే అద్భుతమైన ఔషధ ఉపయోగాలు తెలుసా?

Broccoli Health Benefits
బ్రకోలి ఫైబర్ మరియు యాంటీఆక్సిడెంట్లకు మంచి మూలం – ఈ రెండూ ప్రేగు పనితీరు మరియు జీర్ణ ఆరోగ్యానికి తోడ్పడతాయి. బ్రకోలిలోని కొన్ని పోషకాలు మరియు బయోయాక్టివ్ సమ్మేళనాలు మానసిక క్షీణతను నివారించడానికి మరియు ఆరోగ్యకరమైన మెదడు, నాడీ కణజాల పనితీరుకు తోడ్పడతాయి. ఇందులో లభించే కీలక బయోయాక్టివ్ సమ్మేళనం అయిన సల్ఫోరాఫేన్, త్వరగా వృధాప్యం రాకుండా సహాయపడుతుంది. రోగనిరోధక శక్తి పెంపొందించుకోవడానికి బ్రకోలి చాలా మంచి ఆహరం. ఇది ఎముకల, కీళ్ల ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో తోడ్పడుతుంది. గర్భంతో ఉన్న మహిళలకు బ్రకోలి చాలా ప్రయోజనాలు చేకూరుస్తుంది, అలాగే చర్మ ఆరోగ్యాన్ని పెంపొందించడంలో కూడా సహాయపడుతుంది.
Also Read: Bael Tree (Maredu) Sharbat: వేసవి కాలంలో మంచి ఉపశమనం కలిగించే మారేడు కాయ షర్బత్ గురించి తెలుసా?
Also Watch: