ఆరోగ్యం / జీవన విధానం

Bhringraj Health Benefits: కాటుక ఆకు గురించి తెలుసుకుందాం

0
Bhringraj Health Benefits
Bhringraj Health Benefits

Bhringraj Health Benefits: బృంగ్రాజ్, గుంటగలగరాకు లేదా కాటుక ఆకు ఆంగ్లంలో ఫాల్స్ డైసీ అని ఇలా అనేక పేర్లతో పిలువబడే ఈ మొక్క పొడవైన ఆకులు కలిగి ఉంటుంది. ఇది ఎక్కువగా వర్షాకాలంలో పంట పొలాల గట్లపైన, నీరు ఎక్కువగా ఉండే చోట కనిపిస్తుంది. ఇది పొద్దుతిరుగుడు కుటుంబానికి చెందిన మొక్క. దీని వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నెన్నో! గొంతులో గరగరగా ఉన్నప్పుడు 5 గ్రాముల ఎండిన భృంగరాజ పొడిని తేనెలో కలుపుకొని తాగాలి. ఇంతే కాకుండా జలుబు, దగ్గు చికిత్సలో, గొంతు చికాకు, రక్తహీనత, ఉబ్బసం వంటి సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది.

Bhringraj Health Benefits

Bhringraj Health Benefits

బృంగ్రాజ్ యొక్క తాజా రసాన్ని ఖాళీ కడుపుతో ప్రతీ రోజూ ఉదయాన్నే 10‒15 మి.లీ వరుసగా 7-12
రోజుల పాటు తాగడం వలన కాలేయ రుగ్మతలు మరియు కామెర్ల ను గణనీయంగా తగ్గిస్తుంది. 5 గ్రాముల బృంగ్రాజ్ పొడిని ఒకకప్పు నీటిలో మరిగించి కషాయం తయారు చేసుకోవాలి. ఈ కషాయాన్ని రోజుకు రెండు సార్ల చొప్పున తీసుకోవడం వలన దీర్ఘకాలిక చర్మ వ్యాధులు మరియు సోరియాసిస్‌ సమస్యల నుండి దూరంగా ఉంచుతుంది.

Also Read: Organic farming: సేంద్రీయ వ్యవసాయం ద్వారా 3 లక్షలు సంపాదిస్తున్న రైతు

ఈ రోజుల్లో జుట్టు ఊడిపొవుట సమస్య బాగా పెరగుతుంది. ఎన్ని ఖరీదైన షాంపూలు, నూనెలు వాడినా ఎలాంటి ప్రయోజనం లేదు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే దీని ఆకులను జుట్టు సంరక్షణలో భాగంగా ఉపయోగిస్తారు. అందువలన జుట్టు నల్లగా, కుదుళ్లు బలంగా ఆరోగ్యంగా అవ్వడానికి తోడ్పడుతుందని పరిశోధనలో తేలింది‌. 25 గ్రాముల భృంగరాజుపేస్ట్, నువ్వులు 100 ml లేదాకొబ్బరి నూనె మరియు 400 ml బృంగ్రాజ్ కషాయాన్ని కలిపి నూనె తయారీ చేయవచ్చు.

Bhringraj Oil

Bhringraj Oil

ఈ నూనెను జుట్టుకు ఉపయోగించడం వలన అనేక లాభాలు ఉన్నాయి. కొంత మందికి చుండ్రు సమస్య బాగా ఉంటుంది కావున ఈ తైలం వాడటం వలన ఇది తలలో వేడిని తగ్గించి దానిని తగ్గిస్తుంది. తలపై రక్త ప్రసరణ బాగా జరిగేలా చేస్తుంది. ఈ నూనెలో విటమిన్ E, D తో పాటుగా మెగ్నీషియం, కాల్షియం, ఐరన్ కూడా ఉంటాయి కావున ఈ తైలం వాడటం వలన తలనొప్పి తగ్గిబాగా నిద్రపట్టేలాచేస్తుంది. బృంగ్రాజ్ ఆకులు, నల్ల నువ్వులు ఉసిరి మరియు చెక్కర ఈ నాల్గింటిని సరైన పరిమాణంలో తీసుకోవడం వలన రోగనిరోధక శక్తిని పెంచి ఇది ఇమ్యునో మాడ్యులేటర్ గా పనిచేస్తుంది.

Also Read: Asafoetida Health Benefits: చిటికెడు ఇంగువతో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలలో!

Leave Your Comments

Asafoetida Health Benefits: చిటికెడు ఇంగువతో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలలో!

Previous article

Bendi Cultivation: బెండి విత్తే సమయంలో రైతులు తీసుకోవలసిన జాగ్రత్తలు

Next article

You may also like