LEAFY VEGETABLES:ఆకుకూరలనగానే మనకు పాలకూర, తోటకూర, గోంగూర, మెంతికూర వంటివి గుర్తుకొస్తాయి. వీటితోపాటు అనేక ఔషధ, పోషక గుణాలున్న బచ్చలి కూర కూడా ఉంది. ఈ బచ్చలి కూరలో ఎ, సి, ఇ, కె విటమిన్లు, మెగ్నీషియం, ఫోలేట్, పొటాషియం, ఐరన్, కాపర్, కాల్షియం వంటి పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. దీనిలో ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు, పీచుపదార్థం , ఫ్లేవనాయిడ్స్ ఎక్కువగా ఉంటాయి. బచ్చలి కూరను తరచూ తీసుకోవడం వల్ల శరీరంలో అదనంగా పేరుకుపోయిన కొలెస్ట్రాల్ కరిగిపోతుంది. రక్తపోటు అదుపులో ఉంచుతుంది. గుండెపోటు ప్రమాదాన్ని తగ్గిస్తుంది. రక్తహీనతతో బాధపడే వారికి బచ్చలి కూర మంచి ఔషధంగా పని చేస్తుంది.
దీనిలో ఉండే కాల్షియం వల్ల ఎముకలు బలంగా తయారవుతాయి. బచ్చలికూర కాండంలో జీర్ణవ్యవస్థకు మేలు చేసే జిలాటినస్ ఉంటుంది. కావున డయేరియా సహా, జీర్ణ రుగ్మతల చికిత్సలో ఉపయోగపడుతుంది. బచ్చలి కూరలో అధికంగా ఉండే ఓమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు, నియాసిన్, సెలీనియం వంటివి మెదడు, నరాల ఆరోగ్యానికి తోడ్పడతాయి. కీళ్ళ నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, పైల్స్ వంటి సమస్యలతో బాధపడేవారు బచ్చలికూరను తింటే వీటి నుంచి మంచి ఉపశమనం లభిస్తుంది.
ALSO READ: Health Benefits Of Leafy Greens: ఆకుకూరలు`ఆరోగ్య ప్రయోజనాలు