Amchur Powder Recepie: వేసవి వచ్చిందంటే పచ్చళ్ళు, పళ్ళు, పిల్లల తుళ్ళింతలు. అయితే బామ్మలు మాత్రం మామిడితో ఎదో ఒక కొత్త రకం వంటక, చేస్తూనే ఉంటారు. ఈ సారి ఆమ్ చూర్ పొడి తయారీతో మీముందు ఉన్నాం. పంజాబీ వంటకాలలో ఆమ్‌చూర్ అనేది అత్యంత ముఖ్యమైన పదార్ధం. పంజాబీ వంటకాల్లో అనగా చోలే, రాజ్మా, ఆలూ పరాఠా మొదలైన అనేక ప్రసిద్ధి ఉన్న రుచికరమైన పంజాబీ వంటకాలలో ఈ పొడిని వాడుతారు.
ఉత్తర భారతీయ వంటకాలలో పులుపు మరియు కమ్మటి రుచి రావడం కొరకు ఆమ్‌చూర్ పొడిని లేదా ఎండిన దానిమ్మ గింజల పొడిని వేస్తారు. సాధారణంగా పులుపు కోసం ఉత్తర భారతదేశంలో సున్నం, చింతపండు మరియు కోకుమ్ వంటి పుల్లని పదార్థాలను ఉపయోగించరు. కాని పశ్చిమ భారతదేశంలో కోకుమ్ ఇంకా చింతపండును వాడతారు, కాని దక్షిణ భారతదేశంలో సున్నం మరియు చింతపండు సాధారణంగా పులుపు కోసం కలుపుకుంటారు.
Also Read: ముల్లంగి సాగులో మెళుకువలు
సాధారణంగా, వండటం అయిపోయె సమయంలో ఈ ఆమ్చూర్ ని వేసుకుంటారు. కూర దాదాపుగా సిద్ధం అయ్యే సమయంలో ఆమ్చూర్ మరియు గరం మసాలానం జోడిస్తారు. మనం ఆమ్‌చూర్ వేయక ముందు మరియు ఆమ్‌చూర్ కలిపిన తర్వాత కూర లేదా సబ్జీకి ఉన్న రుచిలో తేడాను గమనించవచ్చు. అనేక పంజాబీ వంటకాలలో మాత్రం, సరైన రుచిని పొందాలంటె ఆమ్చూర్ చాలా అవసరం.ఆమ్‌చూర్ పొడికి బద్ధులు గా నిమ్మరసం లేదా చింతపండు వంటి వస్తువులతో భర్తీ చేయవచ్చు, కానీ రుచి మాత్రం మారుతుంది.
ఆమ్‌చూర్ పొడిని చేయడానికి పచ్చి ఇంకా పండని మామిడి పండ్లను ఉపయేగిస్తారు వాటిని కేరీ/కైరీ అని అంటారం. ఆమ్చూర్ చేయడానికి, పండని మామిడి కాయలు సన్నగా పొడవాటి ముక్కలుగా కోసి కొన్ని రోజుల పాటు అవి గట్టిగా మరియు స్ఫుటంగా మారేంత వరకు ఎండలో వాటిని ఎండబెట్టాలి. అప్పుడు ఈ ఎండిన మామిడి ముక్కలను మెత్తగా పొడి చేసుకోవాలి. అందుకే ఆమ్‌చూర్‌ని ఆంగ్లంలో డ్రై మ్యాంగో పౌడర్ అని అంటారు. ‘ఆమ్’ అనగా ఆమ్‌కి సంక్షిప్త పదం, అంటే హిందీలో మామిడి ఇంకా చూర్ అంటే చూర్ణం, అర్థం పొడి చేయడం.మామిడి చిప్స్ లేదా స్ట్రిప్స్ పొడిగా చేయడానికి ఎండబెట్టడానికి రెండు పద్ధతులు ఉన్నాయి.
మొదటిది: ఎండలో ఎండబెట్టే విధానం – మామిడి పండ్లను ఎండలో ఎండబెడతారు. సూర్యరశ్మి యొక్క తీవ్రత మరియు వ్యవధిని బట్టి మామిడి పండ్లను సుమారు 2-3 రోజుల వరకు ఎండలో ఉంచుతారు.
రెండవది: ఓవెన్లో ఎండబెట్టే పద్ధతి – వాటిని ఎండబెట్టడానికి సరిపడ సూర్యకాంతి లేకపోతె మరియు ఇంట్లో ఓవెన్ అందుబాటులో ఉంటే ఈ పద్ధతిని ఆవశ్యకత ఉంటుంది. ఓవెను చాలా ఉష్ణోగ్రతలో పెట్టాలి. అంటే ఉష్ణోగ్రత 50 డిగ్రీల సెల్సియస్/122 డిగ్రీల ఫారెన్‌హీట్ నుండి 90 డిగ్రీల సెల్సియస్/194 ఫారెన్‌హీట్ మధ్య ఉంచవచ్చు. ఎండే సమయంలో ఉష్ణోగ్రతను బట్టి, మామిడి చిప్స్ ఎండటానికి సుమారు 10 గంటల నుండి 24 గంటల వ్యవధి పడుతుంది. రాత్రి సమయంలో ఆ ముక్కలని మస్లిన్ గుడ్డతో కప్పి, గది ఉష్ణోగ్రతలో ఉంచాలి. ఇలా 3రోజుల పాటు 7 గంటలు ఉంచాలి.
కావున మామిడి చిప్స్ పూర్తిగా ఎండబడి గట్టిగా మారడానికి 21 గంటలైనా పడుతుంది. వాటిని నొక్కినప్పుడు లేదా విరగొట్టినప్పుడూ అవి చాలా సులభంగా పొడిలా అవుతుంది. ఆమ్‌చూర్ పౌడర్‌ను గ్రైండింగ్ చేయగానె మంచి సువాసన వస్తుంది. ఒకవేల వాతావరణం కనుక వేడిగా ఉంటె, ఈ తొక్క తీసె ముందు నీటిలో 2 నుండి 3 గంటల పాటైనా నానబెట్టాలి.అలా చేస్తే మామిడి పండ్ల నుండి కొంత వేడిని దూరం చేయవచ్చు.
ఆ తరువాత తొక్క తీసి వాటిని 2 నుండి 3 రోజుల వరకు ఎండలో ఆరనివ్వాలి. మూడు చిన్న మామిడికాయల నుండి సుమారు 75 గ్రాముల మామిడి పొడి వస్తుంది. కావున మామిడికాయల సంఖ్యను బట్టి, పొడి పరిమాణం ఆధారపడి ఉంటుంది. ఇంటి కొరకు 2 నుండి 5 మధ్యస్థ మామిడిపండ్లు తో వచ్చిన పొడి సరిపోతుంది. ఈ తయారు చేసుకున్న పొడిని ఇంట్లో సులభంగా రెండు నెలల పాటు ఉపయోగించవచ్చు.
Also Read: ఈ నెలలోనే పీఎం కిసాన్ యోజన 11 విడత