Bajra Millets Health Benefits: ప్రపంచంలోని అత్యంత ముఖ్యమైన ఆరోగ్య సమస్యల్లో పోషక ఆహార లోపాలు ముఖ్యమైనవి. ప్రధానంగా మనం తీసుకునే ఆహారంలో విటమిన్ ‘ఎ’, సూక్ష్మధాతు పోషకాలైన ఇనుము, జింకు లోపాలు ముఖ్యమైనవిగా, ఎక్కువ మందిలో వచ్చే అనారోగ్యానికి కారణాలుగా ప్రపంచ ఆరోగ్య సంస్థ గుర్తించింది. ఈ పోషకాల లోప లక్షణాల తీవ్రత ఎక్కువగా గర్భిణీలు, చంటిబిడ్డలు, 10 సం. లలోపు పిల్లల్లో ఉంటుంది.
సజ్జలు పేదలకు వరం:
ఇదే విధంగా జింక, కాల్షియంల లోపాలు కూడా మన దేశ ప్రజల్లో అత్యధికంగా ఉన్నాయని గుర్తించారు. ఈ సూక్ష్మ పోషకాల లోపాలను ఆహార అనుబంధాలను మాత్రల రూపంలో ఇచ్చి సరిచేసుకోవచ్చు. కాని పేద ప్రజలకు ఈ మాత్రలను కొనుక్కొని వేసుకోగలిన స్థోమత లేనివారికి ముఖ్యంగా పల్లెప్రాంత ప్రజలకు ఇవి అందుబాటులో ఉండవు. కాబట్టి అలాంటి వారికి సూచించేది ఏమిటంటే మనం తినే ఆహారమే అత్యధిక పోషక విలువలు, తక్కువ ఖర్చుతో కూడుకున్నవి తీసుకోవటం వల్ల పోషకాహార లోప లక్షణాలను రాకుండా చూసుకోవచ్చు.
మన పూర్వీకులు చేస్తూ వచ్చిన పనికూడా ఇదే. మనమందరం తినే ఆహారంలో ప్రస్తుతం ఎక్కువగా వరి, గోధుమలను ఉపయోగిస్తున్నాం కాని పూర్వపు రోజుల్లో తృణధాన్యపు, చిరుధాన్యపు పంటలైన జొన్న, సజ్జ, రాగి, కొర్ర మొదలగువాటిని వరికి బదులుగా ఎక్కువగా తీసుకొనేవారు. మన రాష్ట్రంలోని పట్టణాల్లోనే కాకుండా పల్లెల్లో కూడా ఈ మధ్యకాలంలో ఎక్కువగా వరి మీద ఆధారపడి, దాన్నే ప్రధానమైన ఆహారంగా తింటున్నారు.
ఆహార అనుబంధాలను తగ్గించుకోవాలంటే వరికి బదులుగా ఈ తృణ ధాన్యాలను తినటం మంచిది. తృణ ధాన్యాలన్నింటిలోకెళ్ళ చవకగా దొరికే సజ్జలో ఉన్న పోషకాహర విలువలను గురించి తెలుసుకుందాం.
Also Read: Pearl Millet Management: సజ్జ పంటలో అధిక దిగుబడికి చేపట్టవలసిన యాజమాన్య పద్ధతులు.!
సజ్జల్లోని పోషకాహార విలువలు:
ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉన్నా, వర్షాధారం మీదే ఆధారపడే నీటి వసతిలేని భూముల్లో ఏ ఇతర ఆహార పంటలు సాధారణంగా పండించటానికి వీలులేని భూసారం తక్కువగా ఉన్న భూముల్లో కూడా పండించటానికి వీలయ్యే ఆహార ధాన్యపు, పశుగ్రాసపు పంట సజ్జ. మిగతా ధాన్యపు పంటలు, కూరగాయలతో పోల్చుకుంటే సజ్జ నుంచి అత్యంత చవకగా మనం సూక్ష్మపోషకాలను ఇనుము, జింకు, కాల్షియం, బి-విటమిను పొందవచ్చు. గోధుమతో తయారైన ఉప ఉత్పత్తుల కన్నా సజ్జతో తయారైన ఉప ఉత్పత్తులలు బ్రెడ్, బిస్కెట్లు వంటి వాటిలో “గ్లైసిమిక్ ఇండెక్స్” తక్కువగా ఉన్నందు వల్ల ఇది చక్కెర వ్యాధిగ్రస్తులకు ఎంతో మంచిది. ఇది పరిశోధనల ఫలితంగా కూడా నిరూపితమైంది.
Also Read: Bugga’s Organic Milk: బుగ్గ సేంద్రియ పాలు.!