Adulteration in Black Pepper: బ్లాక్ పెప్పర్, నల్ల మిరియాలు మనకు చాలా ఆరోగ్యకరమైన మసాలా దినుసులు. దీనిలో ఉండే పైపెరిన్ అనే రసాయనం జీర్ణక్రియను ప్రేరేపించడం, దగ్గు మరియు జలుబు నుండి ఉపశమనం ఇవ్వడం, క్యాన్సర్‌ను నివారించడం వంటి ప్రయోజనాలు పుష్కలంగా ఉన్నాయి. నల్ల మిరియాలు మనం పొడి చేసి లేదా పూర్తి మిరియాల రూపంలో తీసుకుంటారు. దురదృష్టవశాత్తు, ఈ రెండు రూపాలలో ఆహార కల్తీకి గురయ్యే అవకాశం ఉంది. మిరియాలు ఏ విధంగా కల్తీకి గురవుతాయో తెలుసుకుని చేడు ఆహారాం నుండి దూరంగా ఉండవచ్చు.
ఆహార కల్తీకి గురయ్యే సాధారణ ఆహార పదార్ధం నల్ల మిరియాలు. దీనిలో కల్తీ నమ్మే దాని కన్నా విస్తృతంగా వ్యాపించింది. 2013లో, NCDEX (నేషనల్ కమోడిటీ & డెరివేటివ్స్ ఎక్స్ఛేంజ్)కి చెందిన ఆరు గిడ్డంగులలో ఆహార కల్తీ పరీక్షలు నిర్వహించగా,42% మిరియాలు నకిలీ అని తేలింది. అవి మానవ వినియోగానికి పనికిరానివిగా గుర్తించారు. NCDEXతో నిల్వ చేయబడిన 900 టన్నుల నల్ల మిరియాలను నాశనం చేయాలని ఆదేశించినాట్లు పత్రికా ప్రకటనలో తేలింది. దీన్ని చూసి కల్తీ ఏ విధంగా ఉందో చూడవచ్చు.
Also Read: Mid Season Drainage In Paddy: వరి లో మిడ్ సీజన్ డ్రైనేజ్ యొక్క ప్రాముఖ్యత.!
నల్ల మిరియాలలో కల్తీలు ఏ విధంగా గుర్తుపట్టాలి ?
బొప్పాయి గింజలు: మొదటిగా బొప్పాయి గింజల గురించి చెప్పుకుందాం. ఎండిన బొప్పాయి గింజలు పెప్పర్ గింజల ఆకారం మరియు పరిమాణంలో ఏ మాత్రం తేడా లేకుండా కనిపిస్తాయి. బొప్పాయి గింజలు, ఎండిన రూపంలో మరియు పొడి రూపంలోనూ నల్ల మిరియాలలో ఎక్కువగా ఉపయోగించే కల్తీ కారకం.
మినరల్ ఆయిల్ : మిరియాలలో శిలీంద్ర నాశకంగా పనిచేయడానికి మరియు మిరియాలకు మెరిసే తత్వాన్ని ఇవ్వడానికి నూనెను కలుపుతారు. మినరల్ ఆయిల్ కలపడం వల్ల మిరియాలు మానవ ఆరోగ్యానికి ఎంతో హనీకరం . ఇది పైన చెప్పబడిన NCDEX సంఘటనలో కనుగొనబడిన కల్తీ.
మిరియాలలో కల్తీ పదార్థాల ఉనికిని గుర్తించేందుకు ఇంటి వద్ద చేయవలిసిన పరీక్షలు.
నల్ల మిరియాలలో కల్తీ పదార్థాల ఉనికిని గుర్తించడం చాలా సులభం.ఈ పరీక్ష ఒక నిమిషం కంటే ఎక్కువ సమయం కూడా పట్టదు. ఇది శ్రమ లేకుండా కూడా చేయవచ్చు. ఒక గాజు గ్లాసు నిండా నీళ్లలో చెంచాడు మిరియాలు లేదా కొద్దిగా నల్ల మిరియాల పొడిని వేసుకోవాలి. మిరియాల గింజలు లేదా మిరియాల పొడి వాటి బరువు కారణంగా గ్లాసు కింద స్థిరపడుతాయి. బొప్పాయి గింజలు లేదా బొప్పాయి గింజల పొడి, గ్లాసు పైన తేలుతుంది. అలాగే, చెక్క పొడి కూడా నీటి ఉపరితలంపై తేలుతూ కనిపిస్తుంది.
నీటిని అటూ ఇటూ కదిలించిన, జిడ్డు లేదా చిన్న నూనె బిందువుల తేలుతూ ఉంటుంది. ఈ పరీక్షలలో మిరియాలలో నూనె ఉన్నట్లు కనిపిస్తే, అట్టి మిరియాలను పడేయాలి. మినరల్ ఆయిల్ తింటే మానవ శరీరానికి హాని చేస్తోంది.ఇది తక్కువ పరిమాణంలో కూడా మంచిది కాదు. మీ కుటుంబ ఆరోగ్యంగా తింటుందని, ఆరోగ్యంగా ఉందని నిర్ధారించుకోవడానికి ఈ పరీక్షలు ప్రయత్నించండి.
సమాచారంతో ఉండండి. సురక్షితంగా ఉండండి!
Also Read: Paddy main field management: వరి ప్రధాన పొలం తయారీ లో మెళుకువలు