ఆంధ్రా వ్యవసాయంమన వ్యవసాయంవార్తలు

ఏపీలో త్వరలో ఆర్గానిక్ ఫార్మింగ్ పాలసీని తీసుకొస్తున్నాం – వ్యవసాయ శాఖ మంత్రి వర్యులు శ్రీ. కన్నబాబు

0
organic farming kanna babu

  • ఏపీలో త్వరలో ఆర్గానిక్ ఫార్మింగ్ పాలసీని తీసుకొస్తున్నాం-మంత్రి కన్నబాబు.
  • సేంద్రియ వ్యవసాయ విధానాన్ని మరింత విస్తృతం చేసేందుకు సీఎం ఆదేశాలతో స్పష్టమైన ప్రణాళికలు చేస్తున్నాం.
  • రైతులకు రెట్టింపు ఆదాయంతో పాటు నాణ్యమైన, ఆరోగ్యకరమైన ఉత్పత్తులు ప్రజలకు చేరేలా సీఎం జగన్ చర్యలు తీసుకుంటున్నారు

సేంద్రియ , ప్రకృతి వ్యవసాయ విధానాలపై రైతులు , ఎఫ్ పిఓలు , ఎన్ జి ఓలు , అధికారులు, శాస్త్రవేత్తలతో అమరావతి ఏపీఐఐసీ బిల్టింగ్ లో మంత్రి కన్నబాబు సమావేశం

  • రైతులు, ఎఫ్ పిఓలు, ఎన్జీఓల నుంచి సేంద్రియ వ్యవసాయపు అనుభవాలు, సలహాలను తెలుసుకుంటున్న మంత్రి కన్నబాబు
  • ఆర్బీకే కేంద్రంగా సేంద్రియ వ్యవసాయ విధానాన్ని అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం.
  • సీఎం ఆదేశాల మేరకు ప్రకృతి వ్యవసాయానికి సహాయంగా
    రెండు దశల్లో 5000 కమ్యూనిటీ హైరింగ్ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నాం
  • పొలంబడి ద్వారా వ్యవసాయ , ఉద్యాన వన వర్సిటీలు రైతులకు ప్రకృతి వ్యవసాయం పట్ల రైతులను చైతన్య పరచాలి – కన్నబాబు
  • ఉత్పత్తులు తగ్గకుండా రసాయనాలు, పురుగు మందులను తగ్గిస్తూ, క్రమేపి వాటి వినియోగాన్ని కనీస స్థాయికి తీసుకురావాలి – కన్నబాబు
  • సేంద్రియ, ప్రకృతి వ్యవసాయ విధానాలను విస్తృతంగా ప్రచారం చేస్తూ భావితరాలకు ఆరోగ్యకరమైన వ్యవసాయాన్ని అలవాటు చేయాలి – కన్నబాబు
  • సర్టిఫికేషన్, శిక్షణ, పనిముట్ల పంపిణి, మార్కెటింగ్ సౌకర్యాలు, ఆర్గానిక్ ఉత్పత్తులపై విస్తృత ప్రచారం , రైతులకు కసాయాలు, ఘన జీవామృతం అందుబాటులో ఉంచడం వంటి సలహాలిచ్చిన రైతులు, ఎఫ్ పి ఓ లు, ఎన్జీవో లు.

సమావేశంలో రాష్ట్ర ప్రకృతి వ్యవసాయ ఉన్నతాధికారులు టి విజయ కుమార్(Vijayakumar), స్పెషల్ సీఎస్ పూనమ్ మాలకొండయ్య(Malakondayya) , అగ్రికల్చర్ కమిషనర్ అరుణ్ కుమార్(Arun Kumar), హార్టికల్చర్ కమీషనర్ శ్రీధర్(Sreedhar) , యూనివర్సిటీ వీసీ జానకిరామ్(Janakiram) , ఏపీ సీడ్స్ ఎం.డి శేఖర్ బాబు(Shekhar Babu) పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ అమరేంద్ర(Amarendhra) , సీడ్స్ సర్టిఫికేషన్ డైరెక్టర్ త్రివిక్రమ రెడ్డి(Trivikrama Reddy) తదితరులు పాల్గొన్నారు.

Leave Your Comments

సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

Previous article

Eruvaaka Agriculture Magazine October-2021

Next article

You may also like