TRS MPs Protest on Farmers Issues తెలంగాణాలో యాసంగి పంట కొనుగోలులో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య మాటల యుద్ధం నడుస్తుంది. పంట కొనుగోలు చెయ్యమని కేంద్రం తెగేసి చెప్పగా.. లేదూ ధాన్యం కొనుగోలు చేయాల్సిందేనంటూ తెరాస ఎంపీలు ఆందోళనకు దిగుతున్నారు. లోకసభలో తెరాస ఎంపీలు ధాన్యం కొనుగోలు విషయంలో నిరసనలకు పిలుపునిచ్చారు. తెరాస లోకసభాపక్ష నేత నామ నాగేశ్వరరావు ఆధ్వర్యంలో ఎంపీలు పోడియం వద్దకు వెళ్లి నినాదాలు చేశారు. మార్కెట్ యార్డుల్లో ఉన్న ధాన్యాన్ని సేకరించాలని కోరుతూ ప్లకార్డులను ప్రదర్శిస్తూ.. ధాన్య సేకరణపై జాతీయ విధానాన్ని ప్రకటించాలని డిమాండ్ చేశారు.కేంద్రం ఉద్దేశ్యపూరిత అలసత్వం ప్రదర్శిస్తుందంటూ నామ నాగేశ్వరరావు కేంద్రంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కాగా నిరసనలు ఆపాలని స్పీకర్ రాజా ఎంత కోరినా తెరాస ఎంపీలు ఏ మాత్రం శాంతించకపోగా.. నేడు లోకసభను వాయిదా వేశారు స్పీకర్ రాజా. ఇక సభ అనంతరం తెరాస ఎంపీలు పార్లమెంట్ ఆవరణలో ప్లకార్డులు చేత పట్టుకుని సాగు చట్టాల రద్దుకు జరిగిన పోరాటంలో అమరులైన అన్నదాతలకు రూ.25 లక్షల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు.
CM KCR అంతకుముందు యాసంగి పంటపై తెరాస ఎంపీలతో సీఎం కెసిఆర్ చర్చించారు. రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాన్ని పార్లమెంటులో తమ వాణి వినిపించాలని ఎంపీలకు దిశానిర్దేశం చేశారు. ధాన్యం కొనుగోలు విషయంలో పార్లమెంటులో ఎంతకైనా పోరాటం చేయాల్సిందిగా ఆయన సూచించారు. దీంతో సీఎం సూచనల మేరకు ఎంపీ నామ నాగేశ్వరరావు నాయకత్వంలో ఎంపీలు తూచా తప్పకుండ పాటిస్తున్నారు. TRS MPs Protest