తెలంగాణ సేద్యంవార్తలు

తెలంగాణకు వెంటనే ఎరువులు సరఫరా చేయాలని కేంద్ర ఎరువులు, రసాయనాల శాఖా మంత్రి మాన్ సుఖ్ మాండవీయ గారికి లేఖ రాసిన మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి

0

➡ సకాలంలో ఎరువులు సరఫరా చేయండి

➡ రాష్ట్ర అవసరాలకు అనుగుణంగా ఎరువులు సరఫరా చేయాలి

➡ యాసంగిలో 20.5 లక్షల మెట్రిక్ టన్నుల వివిధ రకాల ఎరువులు కేటాయించిన కేంద్రం

➡ తెలంగాణ రాష్ట్ర అవసరాల మేరకు నెలవారీగా కావాల్సిన ఎరువుల కోసం సెప్టెంబరులో కేంద్రానికి లేఖ ద్వారా విన్నవించిన రాష్ట్ర ప్రభుత్వం

➡ అక్టోబరు, నవంబరు మాసాలకు గాను 6.4 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులకు గాను కేవలం 3.67 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే కేటాయించిన కేంద్రం

➡ కేటాయించిన కోటాలో కూడా ఇప్పటి వరకు 1.55 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులు మాత్రమే సరఫరా చేసిన కేంద్రం

➡ కేంద్ర కేటాయింపుల ప్రకారమే 2.12 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులు ఇంకా రావాల్సి ఉంది

➡ కాబట్టి ఇతర దేశాల నుండి వచ్చిన వెసెల్స్ నుండి ఎరువులు కేటాయించాలని కోరిన రాష్ట్ర ప్రభుత్వం

➡ గంగవరం పోర్టులోని ఐపీఎల్ కంపెనీ వెసెల్ నుండి 23 వేల మెట్రిక్ టన్నుల యూరియా సరఫరా చేయండి

➡ కాకినాడ, విశాఖ పోర్టులలో ఉన్న ఆర్. సీ .ఎఫ్, ఛంబల్, ఐపీఎల్ ఫర్టిలైజర్స్ కు చెందిన వెసెల్స్ నుండి 30 వేల మెట్రిక్ టన్నుల డీఏపీ కేటాయించండి

➡ క్రిబ్ కో కంపెనీ నుండి రెండు అదనపు రేక్ లు యూరియా కేటాయించాలి

➡ అక్టోబర్, నవంబర్ నెలలలో తక్కువగా సరఫరా చేసిన ఎరువులను డిసెంబర్ నుండి మార్చి సరఫరాలో భర్తీ చేయాలి

Also Read : ప్రతి నీటి బొట్టుతో అధిక సాగు

 

Leave Your Comments

వ్యవసాయ అనుబంధ వాణిజ్యం…

Previous article

వ్యవసాయ కోర్సులకు భారీ డిమాండ్‌.. కోర్సులు ఇవే…

Next article

You may also like