రాష్ట్రంలోని చెక్కర కర్మాగారాల నిర్వాహణ , పునరుద్ధరణ ఇతర అంశాలపై సమావేశమైన గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ వ్యవసాయ శాఖ కురసాల కన్నబాబు(Kurasala Kanna Babu), బొత్స సత్యనారాయణ (Botsa Sathya Narayana), మేకపాటి గౌతమ్ రెడ్డి(Mekapati Goutham Reddy), స్పెషల్ చీఫ్ సెక్రటరీ పూనమ్ మాలకొండయ్య (Punam Malakondayya), డైరెక్టర్ ఆఫ్ షుగర్స్ వెంకట్రావు(VenkatRao)తదితరులువర్చువల్ గా చెరకు ఫ్యాక్టరీలు, రైతుల సమస్యలపై మంత్రివర్గ ఉపసంఘం భేటీ
- చక్కెర ఫ్యాక్టరీలలో చక్కెర అమ్మకాలు సహా ఉద్యోగాల జీతాల చెల్లింపు, వీఆర్ఎస్ అమలు, ఇతర సమస్యలపై ప్రధానంగా చర్చిస్తున్న మంత్రులు
- విజయదశమికి చెరకు రైతులు, చక్కెర ఫ్యాక్టరీలలోని ఉద్యోగుల జీతాల చెల్లింపులకు ప్రభుత్వం కసరత్తు- మంత్రులు
- హై కోర్టు నుంచి స్టే తీసుకువచ్చేందుకు కృషి చేసిన ఉన్నతాధికారులను అభినందించిన మంత్రివర్గ ఉపసంఘం
- చెరకు రైతులు, చక్కెర ఫ్యాక్టరీల ఉద్యోగుల జీతాల బకాయిలపై ప్రత్యేకంగా చర్చించిన మంత్రులు
- ముఖ్యమంత్రితో సమావేశమై ఆ తర్వాత అన్నింటిపై స్పష్టత తీసుకురావాలన్న యోచనలో మంత్రులు
- టెండర్ అనంతరం , అక్టోబర్ 5 తర్వాత మరో భేటీకి మంత్రుల నిర్ణయం
- ఈ ఏడాదికి గానూ చోడవరం, తాండవ సహా పలు చక్కెర కర్మాగారాలకు సంబంధించిన బకాయిల మొత్తం రూ.70 కోట్లని వెల్లడించిన వ్యవసాయశాఖ మంత్రి కన్నబాబు
- ఏటికొప్పాక, తాండవ ఫ్యాక్టరీల బకాయిల విలువే అత్యధికం
- ఇప్పటికే రూ.72 కోట్లు చెల్లించినట్లు మంత్రులకు వివరించిన ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య
- హైకోర్టు తీర్పుతో చెరకు రైతులకు మేలు జరిగిందన్న పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి
- అక్టోబర్ 5వ తేదీ టెండర్ గురించి ఆరా తీసిన పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి
- చక్కెర ధర పెరిగిన నేపథ్యంలో వీలైనంత త్వరగా అమ్మకాల ప్రక్రియ పూర్తి చేయాలన్న మంత్రి కన్నబాబు
- చక్కెర ఫ్యాక్టరీల ఇబ్బందులు, చెరకు రైతులు సమస్యలు, ఫ్యాక్టరీల ఉద్యోగుల జీతాల వంటి సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి
- చక్కెర అమ్మకాలు, వీఆర్ఎస్ స్కీమ్ అమలు సహా మంత్రివర్గ ఉపసంఘ నిర్ణయాలు ఆర్థిక శాఖతో ముడిపడి ఉన్నాయని వెల్లడించిన ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య
ఆప్కోబ్ (APCOB) బకాయిల మొత్తంపై మంత్రి కన్నబాబు ఆరా
చక్కెర అమ్మకాల మొత్తంలో ముందు రైతులకు చెల్లించేందుకే మొదటి ప్రాధాన్యతగా తీసుకున్న ప్రభుత్వం, అనంతరం ఉద్యోగులకు జీతాల బకాయిలను చెల్లించేందుకు నిర్ణయం.చోడవరం ఫ్యాక్టరీలోని చక్కెరను అమ్మితే రూ.100కోట్లకు పైనా వస్తాయనే అంచనాను వివరించిన మంత్రి కన్నబాబు షుగర్స్ కమిషనర్ తో పాటు ఒక ఉన్నతాధికారిని ఏర్పాటు చేసి వేగంగా చక్కెర డిస్పోజల్ పూర్తి చేయాలని ఆదేశించిన బొత్స సత్యనారాయణ మంచి ధర వస్తేనే చక్కెర అమ్మకాలు చేపడతామని ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వెల్లండించారు.